తెలంగాణ ఉమ్మెడలో కొత్తరాతి యుగం ఆనవాళ్ళు

*ఖగోళభావనలను తెలిపే రాతిబొద్దులున్న ఉమ్మెడ
*చరిత్రపూర్వయుగ సంస్కృతికి నిదర్శనం ఈ నూరుడుగుంటలు, రాతిబొద్దులు

కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు డా.కటకం మురళి, బలగం రామ్మోహన్, Dr. మంత్రి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడలో స్థానిక సర్పంచ్ రాముడ పోశెట్టి, యువజన సంఘ బాధ్యులు బుచ్చ సాయ రెడ్డి ,స్థానికులు కసిగంటి బొర్ర ముత్తన్న గార్ల సహకారంతో కొత్తరాతియుగం, పెదరాతియుగంనాటి పురాతన ఆనవాళ్ళను గుర్తించారు.6వేల యేండ్లనాటి కొత్తరాతియుగం రాతిపనిముట్లను పదునుపెట్టుకున్న నూరుడుగుంటలను(Grooves),4న్నర వేల సం.రాలనాటి పెదరాతియుగంనాటి ఖగోళభావనలను తెలిపే రాతిబొద్దుల సముదాయాన్ని(cupules, cupmarks) చరిత్రబృందం పరిశోధకులు అన్వేషించారు.


ఉమ్మెడలోని కాలభైరవస్వామిగుట్ట చుట్టు ఎన్నోరాతిగుండ్లు, సహజసిద్ధమైన రాళ్ళపేర్పుతో ఏర్పడ్డ గుహలున్నాయి. పరుపుబండరాళ్లున్నాయి. ఒక పరుపుబండమీద 23 రాతిబొద్దు(cupules)లున్నాయి. వీటి అమరిక నక్షత్రరాశిని సూచించే విధంగా వుంది. చరిత్రకారుడు కె.పి.రావు ఇవి 4వేల సంవత్సరాల కిందటి బృహచ్ఛిలాయుగానివిగా భావిస్తున్నానన్నారు. ఇంకా పాతవి కావచ్చని చరిత్రబృందం భావిస్తున్నది. మరొకచోట కూడా రాతిబొద్దులున్నాయి. అంతేకాదు ఇప్పటికి 6వేల సంవత్సరాల పూర్వపు కొత్తరాతియుగానికి చెందిన నూరుడుగుంటలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇవి ఉమ్మెడలో వేలయేండ్లుగా మానవావాసాలుండేవని చెప్పడానికి నిదర్శనాలు.వీటితో పాటు ఇక్కడ అంతులేని ముడి, చక్రపు పెట్రోగ్లిఫ్ లు లభించాయి.

క్షేత్ర పరిశోధన : డా.కటకం మురళి-8106095618, బలగం రామ్మోహన్-9989040655, Dr. మంత్రి శ్రీనివాస్
కొత్త తెలంగాణ చరిత్ర బృందం
సహకారం:సర్పంచ్ రాముడ పోశెట్టి, బుచ్చ సాయ రెడ్డి, కసిగంటి బొర్ర ముత్తన్న
చారిత్రక వివరణ: శ్రీరామోజు హరగోపాల్,9949498698, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *