మల్లన్నదొర తిరుగుబాటు సిలబస్ లో చేర్చాలి

-ఇఎఎస్ శర్మ
కొండ దొరలు, ఉత్తరాంధ్ర  ఆదివాసీ  ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలు. వ్యవసాయం మీద ఆధారపడతారు. షెడ్యూల్డ్ గ్రామాలలో, ఇతర ప్రాంతాల్లో, వారి భూములను గిరిజనేతరులు, రెవెన్యూ అధికారుల తో కుమ్మక్కు అయి దౌర్జన్యంగా ఆక్రమించడం గురించి గతంలో మీకు రాసాను. అధికారులలో ఇంతవరకు స్పందన లేకపోవడం బాధాకరమైన విషయం. 
 
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, పీసా చట్టం అమలు కావడం లేదు. అటవీ ప్రాంతాల్లో భూములను  తరతరాలుగా సాగుచేస్తున్న ఆదివాసీలకు, అటవీ హక్కుల చట్టం క్రింద వ్యక్తిగత, ఉమ్మడి పట్టాలు లభించడం లేదు. ఇందుకు కారణం, ప్రభుత్వ సంస్థలలో ఆదివాసీల పట్ల ఉన్న నిర్లక్ష్యం, ఉదాసీనత. ఈ విషయంలో మీ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 
 
కొండ దొరల గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలి. 
 
1900 సంవత్సరంలో సాలూరు సమీపంలో కొర్రవానివలస గ్రామంలో  కొర్ర మల్లన్న దొర అనే కొండ దొర నాయకుడు నాలుగైదు వేలమంది గ్రామస్థులకు శిక్షణ ఇచ్చి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రచురించిన  శ్రీకాకుళం గాజెట్టీర్ (gazetteer) లో ఈ క్రింద విధంగా సూచించబడింది. 
 
 
The peace of the district was seriously threatened by the Fituri of Korra Mallayya. It took place at Korravanivalasa in Salur area in A.D. 1900. A Konda Dora named Korra Mallayya gathered around him four or five thousand followers and proclaimed that he wanted to drive out the English and rule the country himself. He armed his followers with bamboos fashioned to resemble guns and gave them physical exercises. On the 7th of May. The district Magistrate rushed with the reserve police to the place where the leaders of the movement were put up. They were resisted by the mob and in the skirmish that followed. many were killed. Korra Mallayya along with his son was arrested and kept in jail where he died subsequently
 
ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించి, వారి వెబ్సైట్  లో  ఈ క్రింద సూచించిన విధంగా ప్రస్తావించారు

Korra Mallaya was the tribal chief of the Salur region, in modern-day Vishakhapatnam. He carried a mystical aura and garnered a strong following in the Vishakhapatnam Agency. His rebellion against the oppressive forest policies of foreign rule in the 1900s marked the beginning of peasant movements in the northern coastal districts. 

Armed with bamboo sticks to be used as riffles, nearly 5000 tribal people joined Korra Mallaya to raid the colonial authorities. He was a charismatic leader of the Konda Dora movement. He told everyone that he was one of the five Pandava brothers in a previous life which pushed him to fight injustice. Korra Mallaya promised that he could turn the tribals’ bamboo into guns and the government’s weapons into water. He was passionate and determined to drive the British out of the country. 

As the rebellion gained significant momentum, the Reserve Police was sent by the District Magistrate to suppress it. Several people were killed and Korra Mallaya and his son were put in jail, where the latter died.” 

ఉత్తరాంధ్ర లో బ్రిటిష్ వారి మీద 1922 సంవత్సరంలో  రంపా తిరుగుబాటు చేసిన  అల్లూరి సీతారామరాజు గారి పాత్రను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మన్య ప్రాంతాల జిల్లాను ఏర్పాటు చేసింది. రంపా తిరుగుబాటు కు రెండు దశాబ్దాల ముందే కొర్రా మల్లన్న దొర బ్రిటిష్ వారి మీద చేసిన తిరుగుబాటును కూడా రాష్త్ర ప్రభుత్వం అదేవిధంగా గుర్తించాలి.

EAS Sarma
EAS Sarma
 
ఝార్ఖండ్ మన్యం ప్రాంతాలలో బిర్సా ముండా నాయకత్వంలో బ్రిటిష్ వారిమీద జరిగిన ఉద్యమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. బిర్సా ముండా తిరుగుబాటు కూడా 1900 సంవత్సరంలో జరిగింది. అంటే కొర్ర మల్లన్న  దొర, బిర్సా ముండా సమకాలీకులు.  
 
ఇటువంటి విషయం మీద ఇంతవరకు ప్రజలలో సరి అయిన అవగాహన లేదు. ప్రజలలో, పాఠశాలలో ఈ విషయం మీద అవగాహన తేవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 
 
ఈ విషయంలో, ముఖ్యంగా ఆదివాసీల భూముల పట్టాల విషయంలో పీసా, అటవీ హక్కుల చట్టం అమలు విషయంలో ప్రభుత్వం తత్క్షణం చర్యలు తీసుకోవాలని నా విజ్ఞప్తి. 
 
(భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డు ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ)
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *