నర్మెట్టలో దొరికిన పురాతన రాతి గొడ్డలి

 

కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు,పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని దేవుని నర్మెట గ్రామం బయట ఒక రాతి గొడ్డలిని గుర్తించాడు.

కొత్తరాతియుగం మానవులు పాతరాతియుగంనాటి పెద్ద, పెద్ద బరువైన రాతి పనిముట్ల స్థానంలో రాతిబ్లేడ్లను, సూక్ష్మరాతిపనిముట్లనే కాక తమదైన శైలిలో గట్టిరాళ్ళతో చేసిన చేతిగొడ్డండ్లను, వడిసెల రాళ్ళను జంతువుల వేటలో వాడుకున్నారు.

పురాతన రాతి గొడ్డలి

పనిముట్ల తయారీలో Reduction of Tools గొప్ప పరిణామాన్ని తెచ్చింది. వేట, ఆహారసేకరణల దశ నుంచి వ్యవసాయాన్ని చేపట్టిన తరుణంలో తరుచుగా పనిముట్లపొదిని దూర,భారాలు మోయాల్సిన పనిని తగ్గించడానికి బరువు తక్కువగా వుండి, మన్నికగా వుండే రాళ్ళతో పరికరాలను తయారు చేసుకున్నారు. అవే రాతిగొడ్డండ్లు, ఇతర పనిముట్లని కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు.

కొలిపాక శ్రీనివాస్ కు లభించిన రాతిగొడ్డలి ద్వికుంభాకార, త్రిభుజాకృతిలో వున్న గ్రానైట్ రాతి పనిముట్టు. తక్కువగా వాడబడిన కొత్త పరికరం. ఆ గొడ్డలిని ఎక్కువ నూరలేదు, ఎక్కువగా వాడలేదని తెలుస్తున్నది.

బరువు 116 గ్రాములే వుంది. చక్కని పనితనంతో చెక్కిన రాతిగొడ్డలి. ఇది కొత్తరాతియుగం చివరిదశలో తయారు చేయబడింది. దాదాపు 6వేల సం.రాల కిందట తయారుచేసిన పనిముట్టు.

క్షేత్ర పరిశీలన, పురావస్తువు గుర్తింపు: కొలిపాక శ్రీనివాస్,7799669143, సభ్యుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం
చారిత్రక వివరణ: శ్రీరామోజు హరగోపాల్, 9949498698,కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *