తెలంగాణ తల్లి ప్రగతి భవన్ లో బందీ : తొలి ప్రసంగంలో రేవంత్

కరోనా కంటే కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్,ప్రధాన మంత్రి మోదీ డేంజర్ అని బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి ప్రసంగం చేస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మిసైల్ సంధించారు.

తెలంగాణ తల్లి ప్రగతి భవన్ లో బందీ అయిందని, తెలంగాణ తల్లిని విముక్తి చేయడం కోసం కాంగ్రెస్ పని చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. కెసిఆర్ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నాలుగు కోట్ల తెలంగాణప్రజలను బందీలు చేశారని అన్నారు. తెలంగాణ మలి విముక్తి జరగాలని రేవంత్ పిలుపునిచ్చారు.

తన ప్రసంగాన్ని ముఖ్యంగా కెసిఆర్ మీదే ఆయన ఎక్కు పెట్టారు.

రెండేళ్లు కష్ట పడితే దేశంలో ,రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భరోసా ఇస్తూ, తెలంగాణ వచ్చినప్పుడు లక్ష ఉద్యోగాలు ఖాళీగా  ఉంటే…ఇప్పుడు లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు.

కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర పొలిమేరలు దాటించాలని అ అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయని రేవంత్ అన్నారు.

“రావణాసురుడు సీతమ్మ ను ఎం చేసాడో మనకు తెలుసుగా.  ఇప్పుడు కేసీఆర్ రావణాసురుడు వలె తెలంగాణ తల్లి ని ప్రగతి భవన్ బందీని చేసాడు.. ఆనాడు సీతను రాముడు విముక్తి చేస్తే ఇప్పుడు తెలంగాణ తల్లి ని విముక్తి చేయమని సోనియమ్మ నన్ను పంపించింది. రాముడికి వానర సైన్యం సహాయం చేసినట్లు  మీరు నాకు సహాయం చేయాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే

కాంగ్రెస్ పార్టీ లో అందరి నాయకుల సూచన మేరకు సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

నా భాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన పార్టీ నేతలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

వర్షం పడుతూ ఆ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు.  పోచమ్మ ,ఎల్లమ్మ ,లక్ష్మీనరసింహస్వామి ల దయ తో పాటు సోనియమ్మ ఆశిసస్సులతో ఈ పదవి చేపడుతున్నా.

వ్యక్తుల నినాదాలు వద్దు

సభా వేధిక నుంచి ఈ రోజు చెప్తున్నా జై సోనియమ్మ , రాహుల్ గాంధీ ల నినాదాలు తప్ప మరో వ్యక్తి నినాదం వినిపించకూడదు. సోనియా ,రాహుల్ గాంధీ ల నినాదం మినహా మరో వ్యక్తి నినాదం చేస్తే  ఎంతటి వారినైనా క్షమించం. నా అభిమానులుగా నేను ఓక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు నుంచి వ్యక్తుల నినాదాలు ఇవ్వకండి. కాంగ్రె స్ పార్టీ ఇక నుంచి సమిష్టిగా పనిచేస్తుంది. సమిష్టి నిర్ణయాలుంటాయి.సమిష్టిగా  తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసేందుకే  సోనియా గాంధీ  నాకు ఈ బాధ్యతనిచ్చారు. అందువల్ల ఇకనుంచి కాంగ్రెస్ లో  వ్యక్తుల పరంగా నినాదాలు బంద్ అని అన్నారు.

నిరుద్యోగులు ,దలితుల,బడుగు బలహీన వర్గాలను నయవంచనకు టిఆర్ఎస్ ప్రభుత్వం గురిచేసింది. మన తల్లి తెలంగాణ…తెలంగాణను ఇచ్చినది సోనియమ్మ. నాలుగు కోట్ల ప్రజలు తమ మదిలో సోనియమ్మ గుడి కట్టుకోవాలి.

నాయకుల సందేశాన్ని ప్రతీ గడపగడపకు తీసుకెళ్ళాలి. వేలాది మంది సైనికులకు నాయకుడు ముందు ఉంటే..ఈ ప్రపంచాన్ని గెలువొచ్చని చెప్పారు.. అలా ముందుకు నడిపించే సోనియా ,రాహుల్ గాంధీ లు ఉన్నారు.

ప్రతీ కార్యకర్త రెండు సంవంత్సరాలు ఇంటికి సెలవు పెట్టాలి..

తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పీకే ను సలహాదారు గా పెట్టుకోవాలి కొందరు మిత్రులు సలహా ఇస్తున్నారు. తెలంగాణ లో ఉన్న ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఓక పీకే  ఇంత మంది పీకే లు ఉండగా మనకు పీకే అవసరమా..

ఏపీ లో కాంగ్రెస్ చనిపోయినా పర్వాలేదు అని తెలంగాణ ఇస్తే.. సోనియా గాంధీ కి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం లేదా, అని రేవంత్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *