తెలంగాణ పిసిసి కొత్త అధ్యక్షుడిగా రేవంత్, అభిమానుల సందడి (ఫోటోలు)

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చాప్టర్ మొదలయింది,  గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపి  రేవంత్ రెడ్డి  బాధ్యతలు స్వీకరించారు.  ఆయనతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులు, కమిటీ చైర్మన్ లు కూడా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.   పెద్దఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చి కార్యక్రమంలో సందడి సృష్టించారు.

కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఇలాంటి సందడి కనిపించలేదు. వరస పరాజయాలతో కంగుతిన్న కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి నియమాకం ఒక  పెద్ద పండగ లాంటిదే.

నాయకులు మధ్య విబేధాలున్నా, రేవంత్ నియామంతో లోన అసంతృప్తిగా ఉన్న గాంధీ భవన్ కి కళ వచ్చే లా ఈ రోజు సీనియర్లంతా వచ్చి సంబురాల్లో భాగస్వాము లయ్యారు.

నిజానికి రేవంత్ రెడ్డి పేరు పిసిసి అధ్యక్షుడి ప్రకటించగానే పార్టీలో కదలిక మొదలయింది. పార్టీలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తున్న అలికిడి కనిపించింది. సీనియర్ల  మాటెలా ఉన్న రెండో స్థానంలో ఉన్న అనేక మంది నేతలు రెేవంత్ రాకతో పార్టీ పనితీరు కొత్త దనం వస్తుందని భావిస్తున్నారు. అందుకే వారంతా రేవంత్ కు ఎదురేగి స్వాగతం పిలికారు. కలసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.పార్టీని అదుపులోకి తీసుకురావాలనుకుంటున్న రేవంత్ కి ఇది తొలివిజయం. అందుకే గాంధీభవన్ పండగ వాతావరణం కనిపించింది.

ఈ రోజు కార్యక్రమంలో  రేవంత్ రెడ్డి కి పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు అప్పగించి మాజీ అయ్యారు. ఆయన రేవంత్ ధన్యవాదాలు తెలిపి సహాయ సహకారాలు కోరారు.

ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపి డాక్టర్ మల్లు రవి కార్యదర్శులు బోస్ రాజు , శ్రీనివాస కృష్ణన్ , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య , సీతక్క , షబ్బీర్ అలీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, గోవా పీసీసీ అధ్యక్షుడు గిరిష్ రాయ చౌద్కర్ , కేరళ ఎంపీ తారిక్ అన్వర్, మాజీ మంత్రి గీతా రెడ్డి   లతో పాటు అనేకమంది సీనియర్లు పాల్గొన్నారు.

పెద్దమ్మ గుడి నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులతో ప్రదర్శనగా  రేవంత్ రెడ్డి గాంధీ భవన్ చేరుకున్నారు.

అంతకు మందు ఆయన  పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. నాంపల్లి దర్గా వద్ద ప్రార్థనలు జరిపారు. తర్వాత

వందలాది  వాహనాలతో   ర్యాలీ గా పార్టీ కార్యాలయం బయలు దేరారు.

అభిమానలు  బాణసంచా కాల్చి, డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో రేవంత్ రెడ్డి తో తొడ్కొని గాంధీ భవన్ కు వచ్చారు.

పెద్దమ్మ తల్లి టెంపుల్ లో రేవంత్ రెడ్డి తో పాటు ప్రత్యేక పూజల్లో  సీనియర్ నేత జానారెడ్డి.. ఎమ్మెల్యే సీతక్క మల్లు రవి కూడా పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *