దిలీప్ కుమార్, లతా మంగేష్కర్ సాంగ్ విన్నారా?

సంగీత దర్శకుడు సలీల్ చౌధరి  చిత్రసీమ చరిత్రలో ఒక అద్భతం సృష్టించారు. అదేమిటంటే దిలీప్ కుమార్ చేత పాట పాడించడం.అదేదో సరదాకోసం పాడించిన పాట కాదు. సీరియస్ పాట.అంతకు ముందు ఎందరో సంప్రదాయ సంగీత వెత్తలు పాడిన  పాట.

దిలీప్ కుమార్ పాట పాడటమేమిటని ప్రశ్నిస్తారు కదూ. ట్రాజెడి కింగ్  ఒక చిత్రంలో లతా మంగేష్కర్ తో కలసి ఈ యగళ గీతం పాడారు. ఈ అద్భుతం  1957 లో జరిగింది. చిత్రం ముసాఫిర్. ఈ చిత్రానికి దర్శకుడు హృషీకేష్ ముఖర్జీ,  గేయరచయిత శేలేంద్ర.  ఇది హృషీకేశ్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన తొలి చిత్రం కూడా. ఆ పాట Laagi Nahin Choote Rama chahe jiya Jaae క్లాసికల్ రెండరింగ్.

ఈ పాటకి ట్యూన్ కూడ దిలీప్ కుమారే కట్టారు.  ఆయన గొప్పనటుడే కావచ్చు. కాని గాయకుడిగా ఆయన మూమూలు మనిషే. అటువైపు లతామంగేష్కర్. అందుకే ఆయన చాలా ప్రాక్టీస్ కూడా చేశారట. అయితే, ఈ పాటలో లతా తన శక్తి నంతా కూడదీసుసుకుని తనని డామినేట్ చేసిందేమో నని అనుమానం దిలీప్ కుమార్ లో ఉండిందట.  ఈ పాట రికార్డయిన తర్వాత పదిహేనేళ్ల పాటు వాళ్లిద్దరు  మాట్లాడుకోనేలేదట. దిలీప్ కుమార్ చిత్రాలలో లతా పాడుతూవచ్చినా,వారిరువు కలుసుకోనే లేదు,ర మాట్లాడకోనేలేదట.

ఈ అరుదైన పాట వినండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *