బెంగుళూరులో టెన్షన్, 3వేల మంది కోవిడ్ రోగులు గల్లంతు…

కర్నాటకలో మూడు వేల మంది కోవిడ్-19 రోగులు కనిపించకుండా పోయారు. వీళ్లంతా కరోనావైరస్ ను వ్యాప్తి చేస్తూ ఉంటారని అధికారులు ఆందోళన చెందుతున్నారు.  వెంటనే వీరందరిని ట్రేస్ చేయాలని  పోలీసులను కోరారు. కోవిడ్ సోకినవాళ్లెవరూ  ఫోన్ స్విచాఫ్ చేయడం, ఇళ్ల నుంచి  తప్పించుకుని  పోవడం చేయరాదని అధికారులు కోరుతున్నారు. పారిపోయిన వాళ్లెక్కుడున్నారో, ఎలా ఉన్నారో అనే ఆందోళన తో పాటు వీరిద్వారా భారీగా కోవిడ్ వ్యాపించే ప్రమాదం ఉందని కూడా ఆందోళన చెందతున్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో కోవిడ్ రోగుల అధికారులకు అందుబాటులో లేకుండా పోయిన విషయాన్ని రాష్ట్ర రెవిన్యూ మంత్రి రాష్ట్ర రెవిన్యూ మంతరి ఆర్  అశోకా వెల్లడించారు.

పరిశీలనలో ఉన్న చాలా మంది కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు పోన్లను స్విచాఫ్ చేశారని కూడా ఆయన తెలిపారు.

“ కోవిడ్ ను 90 శాతం దాకా అదుపు చేసే మందులను రోగులకు మేం ఉచితంగా ఇస్తున్నాం. అయితే, వీరంతా ఫోన్లను ఆఫ్ చేసి కూర్చున్నారు. వీళ్లంతా క్రిటికల్ కండిషన్ లో ఐసియు బెడ్ల  కోసం పరిగెత్తుకుంటూ వస్తారేమో. ఇదే ఇపుడు జరుగుతూ ఉంది,’ అని ఆయనచెప్పారని  డెక్కన్ హెరాల్డ్ రాసింది.

కరోనా వైరస్ సోకిన వాళ్లు చాలా మంది ఫోన్లను స్విచాఫ్ చేసినందున వాళ్లెక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియడం లేదు. వాళ్లకి వైద్యం అందించడం దీనితో కష్టంగా ఉందని ఆయన చెప్పారు.

“ఇలాగే,  మరొక రెండు వేల నుంచి మూడు వేల మంది  దాకా బెంగుళూరు కోవిడ్ రోగులు  ఇళ్ల నుంచి మాయమయ్యారు. వాళ్లంతా ఎక్కడకిపోయారో తెలియడం లేదు. వీళ్లని పట్టుకోవాలని పోలీసులను కరోనామని ఆయన చెప్పారు.  తమకు జబ్బుందని తెలిసా పత్తాలేకుండా పోతే, కోవిడ్ వ్యాపిస్తుంది. దీని వల్ల మీరు ఐసియుకుపరిగెత్తుతూ చివరి నిమిషయంలో వస్తారు. ఇదిఆందోళన కలిగిస్తున్నది.  మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కోవిడ్ సోకిన వారెవరూ ఫోన్లను స్విచాఫ్ చేయవద్దు,’’అని మంత్రి అశోక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గత 24 గంటలలో కర్నాటకలో  30 వేల కొత్త కేసులు కనిపించాయి. ఇందులో 17 వేల కేసులు ఒక్క బెంగుళూరు లోనే కనిపించాయి. రాష్ట్రం మొత్తం గా కొత్త కరోనా కేసులు మూడు లక్షలు దాటాయి. ఇందులో 2 లక్షలు బెంగుళూరులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *