ఆంధ్రలో ఇంటర్ పరీక్షలు ఆపేది లేదు… మంత్రి ఆదిమూలపు

మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.ఎవరెన్ని విమర్శులు చేసినా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలను కట్టుదిట్టంగా , కరోనా నియమాలను పాటిస్తూ నిర్వహిస్తారని, ఈ విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదని మంత్రి ప్రకటించారు.

ఇంటర్మీడియట్ పరీక్షలపై ఏర్పాట్లను ఆయన ఈ రోజు విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి జెసి, ఆర్ఐఓ, డిఈఓ లతో  వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా  సమీక్షించారు.

అన్ని జిల్లాల్లో అధికారులు కోవిడ్ పై జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని,  ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యం అని గుర్తించాలని ఆయన చెప్పారు.

ఏ రాష్ట్రంలో కూడా ఇవి రద్దు కాలేదని చెబుతూ కొన్ని రాష్ట్రాలలో నిర్వహిస్తున్నారు మరికొన్ని చోట్ల వాయిదా వేశార తప్ప ఎక్కడ రద్దు చేయాలేదని మంత్రి చెప్పారు.

కొన్ని రాజకీయ పార్టీలు దీనిని అనవసరంగా రాద్ధాంతం చేస్తూన్నాయని, ఇది  విద్యార్థుల, తల్లిదండ్రుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నమని ఆయన అన్నారు.

ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసినందుకు అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.

మే  5  నుంచి 23 వరకు జరిగే పరీక్షలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ దిగ్విజయంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలిచ్చారు.

విద్యాశాఖఅధికారులు వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని చెప్పారు.

అన్ని సెంటర్ లపై నిఘా ఉంచి ప్రతి రోజు తాను కూడా సమీక్షిస్తానని ఆయన చెప్పారు.

విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన చెప్పారు.

కార్యక్రమం లో పా ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్, కమిషనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *