పెళ్లిళ్ల సీజన్ వస్తాంది, జాగ్రత్త: తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక

హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్  మొదలవుతున్నందున వచ్చే మూడు నాలుగు వారాలు కరోనా నివారణలో చాలా కీలకమని, ప్రజల చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

గత వారం రోజులుగా తెలంగాణలో పరిస్థితులు కొంతమేర, కొవిడ్‌ కేసుల పెరుగుదలలో స్థిరత్వం కనిపిస్తోందని కుదుట పడుతున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ అన్నారు.

కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో డీహెచ్‌ మీడియాతో మాట్లాడుతూవిరేచనాలు, జ్వరం, వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం లాంటి కొవిడ్ లక్షణాలు ఉన్నవారే కోవిడ్  టెస్టుకు రావాలని అన్నారు. కొవిడ్‌ టెస్టింగ్ కేంద్రాల్లో గుంపులుగా ఉండటం సరికాదని చెబుతూ  సాధారణ లక్షణాలు రెండు మూడు రోజులకుగానీ తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాస్

కొవిడ్‌ బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమయినన్ని పడకలు అందుబాటులో ఉన్నాయని,  బాధితుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పడకల సంఖ్యను పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన  శ్రీనివాస్ చెప్పారు.

‘‘ప్రస్తుతం ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి కరోనా బాధితులకు 50 వేల పడకలు కేటాయించాము.  వైరస్‌ సోకిన 85 శాతం మందికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. అవసరమైతే తప్ప ఆస్పత్రులకు రావొద్దు,’’ ఆయన శ్రీనివాస్ కోరారు.త

తెలంగాణాలో పరిస్థితి మెరుగు

*అవసరం లేకుండానే ప్రజలు ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడింది.

*ఆక్సిజన్‌, ఔషధాలు, పడకల విషయంలో తెలంగాణాలో పరిస్థితి మెరుగ్గా ఉంది. మే నెలాఖరు వరకు ప్రజలు సామాజిక బాధ్యతగా మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు పాటించండి.

*రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 45 లక్షల మందికి టీకా ఇచ్చాం. టీకా వేసుకున్నవారిలో ఎవరూ తీవ్రమైన అస్వస్థతకు గురికాలేదు.

*టీకా వేసుకున్న వారికి వైరస్‌ సోకినా ఆస్పత్రిలో చేరలేదు. టీకా వేసుకున్న వారిలో 80 శాతం మందికి కొవిడ్‌ సోకలేదు.

*18 ఏళ్లు పైబడిన వారు టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *