ఈ రోజు పర్యాటక దినోత్సవం బాగా గుర్తొస్తున్నది. తిరుపతిలో ఎన్నెన్ని పర్యాటక కేంద్రాలున్నాయో, అవి ఎంత అనాథగా మిగిలిపోయి ఉన్నాయో తలచుకుంటే బాధేస్తుంది.
తిరుపతి నడిబొడ్డున ఈ మొండోడి కోన ఉంది. లీలా మహల్ మీదుగా పాత గ్రాండ్ వరల్డ్ మీదుగా పోతే, ప్రస్తుతం ఉన్న హోటల్ సరోవర్ దగ్గిర్లో వెహికిల్స్ పార్క్ చేసుకుని కొండకు అభిముఖంగా వెళ్లే రెండు చక్కని జలపాత మార్గాలున్నాయి.
మొండోడి కోన మూడు భాగాలుగా ఉంది. ఒక్కోభాగంలో నీటి గుండం ఉంటుంది. ఈ రోజునేను మూడో గుండం పైభాగానికి నడచుకుంటూ పోయి వచ్చాను. సన్నగా జలపాతపు పాయ.అన్నిచోట్ల మంచివానలు కరుస్తున్నాయిగాని తిరుపతిలో చెప్పుకోదగ్గ వాానల్లేవు. మంచివానలు కురిస్తే ఈ జలపాతం అత్యంత రమణీయంగా కనువిందుచేస్తుంది. నెల క్రితం పోయినపుడు ఆ హొయలు శబ్ద తరంగాలు మైమరిపించినాయి. హాయిగా జలపాతం కింద స్నానం చేసి కాసేపుఉల్లాసంగా గడిపి రావచ్చు.
పైకి ఎక్కలేని వారికి కిందనే మంచి నీటిగుండం వుంది. ఇంకొంచె పక్కకుపోతే,చిన్న జలపాతం ఉంటుంది.ఒక వేలజలపాతం లేకపోయినా, దాని ఛాయ, ఆ సుందర దృశ్యం కనువిందుచేస్తాయి.
అక్కడి నుంచి చూస్తే తిరుపతి అందచందాలను ఆస్వాదించవచ్చు. దారంతటా చక్కటి పూలవాసన, పక్షులు కిలకిలారావాలు, పైకి ఎగబాకి చూస్తే కొొండల పచ్చదనం, ఇంకేంకావాలి, ప్రకృతి మనకు అందిస్తున్న అపురూప కానుక ఈ ఆరోగ్య మనస్థితి. దాన్నంది అంది పుచ్చకోవడం మన బాధ్యత.
ఈ అపురూప దృశ్యమాలిక తిరుపతికి కూత వేటంత దూరంలోనే…
MORE TREKKING oN SESHACHALM HILLS, TIRUPATI, ANDHRA PRADESH, INDIA
- తిరుపతి పక్కనే, పురాతన సుద్దకుంట రాతిబాటలో ట్రెకింగ్… గొప్ప అనుభవం
- ఈ రోజు ట్రెకింగ్ కనువిందు చేసే మూలకోన జలపాతానికి…
- ఈ రోజు ట్రెకింగ్ ‘వేయిలింగాల కోన’ అడవుల గుండా (గ్యాలరీ)
- ఈ రోజు ట్రెకింగ్: చంద్రగిరి కోటలో ‘ఉరికంబం’
- ఈ రోజు కాలభైరవ గుట్టకు ట్రెకింగ్…అద్భుతాల ఈ గుట్ట ఇపుడు అనాథ (గ్యాలరీ)
- చారిత్రక విశేషాల ఖజానా ‘తాటికోన’ కు ఈ ఉదయం ట్రెకింగ్
- తిరుమల కొండ ప్రకృతి సోయగాలు… గంట మంటపానికి ట్రెకింగ్