ఇంటింటా సీమ పుస్తకం, యాభైశాతం తగ్గింపుతో… రాయలసీమ బుక్ సొసైటీ ఆఫర్

రాయలసీమ సాహిత్యాన్ని ఇంటింటికి చేర్చేందుకు ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది.  ఇందులో భాగంగా తాము ప్రచురించిన పుస్తకాలన్నింటిని 50 శాతం రిబేటుఅందించేంుకు రాయలసమీ బుక్ సొసైటీ ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని రాయలసీమ సాహిత్యాభిమానులు సద్వినియోగపర్చుకోవాలని ‘ఇంటింటా సీమ పుస్తకం’ నిర్మాహకులు కోరుతున్నారు.
వివరాలు

“మొదటితరం రాయలసీమ కథలు” (1882-1944)… పుస్తకం
డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి సంపాదకత్వంలో వెలువడింది.
మే- 2015 న అబ్జ క్రియేషన్స్ పక్షాన కోడిహళ్లి మురళీ మోహన్ ప్రచురించారు.

1882 నుండి 1944 మధ్య కాలంలోని 8 పాత పత్రికల ఆధారంగా, సీమలో వెలువడిన 42 కథలతో 240 పేజిలుగా ఈ పుస్తకం ఉంది. ప్రసిద్ధ కథకులు, విమర్శకులు కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణలు ముందుమాటలు రాసారు. సంపాదకుడి విస్తృతమైన పీఠిక సీమ కథా మూలాలను తెలుపుతుంది.
1926 కంటే ముందే రాయలసీమ వెలువడిన 5 కథలు కూడా ఇందులో ఉన్నాయి.
1913 నాటి హిందూసుందరి పత్రికలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు పేరున వెలువడిన “రోజాంబ-శ్వేతాంబ” కథతోపాటు,
1923 లోనే రాయలసీమ స్థల, కాలాలతో నిర్దిష్టంగా ఈ ప్రాంత జీవితాన్ని చిత్రిస్తూ కొప్పర్తి నారాయణ రాసిన “అచ్చుబాటు కాని చదువు” కథ ఈ పుస్తకంలో ఉండడం విశేషం.
కథలన్నీ వస్తు, శిల్ప పరంగా అత్యంత ఆధునికంగా నడుస్తాయి.
1937 నాటి టి. ఆర్ముగం పిళ్ళై, 1938 నాటి కందాళ శేషాచార్యులు,  1939 నాటి విద్వాన్ విశ్వం లను ఈ పుస్తకం తొకలి సారిగా కథకులుగా సాహిత్య లోకంలో నిలబెట్టింది.
1927 నాడే సీమలో హెచ్. నంజుండరావు రాసిన చిన్న కథలు అనే కథాలక్షణ వ్యాసం, కొన్ని కథలపై విమర్శలు, అభిప్రాయాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. సీమ కథా విమర్శ మూలాలను ఇది చూపుతుంది.
ఎంతో శ్రమతో, పరిశోధన పై బాధ్యతతో మొదటితరం సీమ‌కథలను వెలుగులోకి తీసుకొచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి గారి ఈ పుస్తకాన్ని పాఠకులకు చేరువ చేయాలని భావిస్తున్నాం.
యాభైశాతం డిస్కౌంట్ తో కేవలం 100 రుపాయలకు పుస్తకం అంద చేయాలని నిర్ణయించాము.
100 + రిజిస్టర్ పోస్టల్ చార్జీలు 20 కలిపి “మొత్తం…120 రుపాయలు” కింది నంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే లేదా అకౌంట్ కు పంపిన వారికి, పదిరోజల్లో పుస్తకం మీ ఇంటికి చేరుస్తాం.
మాకు పంపిన వెంటనే ఆ విషయం, పూర్తి చిరునామ పిన్ కోడ్ తో కలిపి వాట్సప్ నెంబర్ కు లేదా ఫోన్ నెంబర్ కు పంపగలరు.
Phone pay & Google pay Number :
94922 87602
Bank A/C:

A/c No : 30955516254
IFSC. : SBIN0002722
Name : M. Ravi Kumar,
SBI, Gorantla,

ధన్యవాదాలతో…..
రాయలసీమ బుక్ సొసైటీ టీమ్,
యం. రవికుమార్,
94922 87602
ఇంటి నెం: 2/1090, ఆర్. యం.యస్ కాలనీ, గోరంట్ల, అనంతపురము జిల్లా, ఆంధ్రప్రదేశ్.