ఈ రోజు ట్రెకింగ్ కనువిందు చేసే మూలకోన జలపాతానికి…

మూల కోన తిరుపతి నుండి చెన్నై పోయే దారిలో ఉంటుంది. పుత్తూరు కంటే  ముందుగానే ఎపి టూరిజం హోటల్ దాటగానే, నాలుగవ కిలోమీటర్  దగ్గర ఎడమవైపు దారిలో  ప్రయాణించాలి.  ఈ ప్రయాణం దాదాపు 9 కి.మీ దూరం సాగుతుంది.
ఈ దారిలో గోపాలకృిష్ణపురం చివరి గ్రామం. అక్కడి నుండి 3 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు మీదే ప్రయాణించాలి.  నేరుగా పోతే, వర్షాకాలంలో నీళ్లు నిలువ ఉండటం వలన బండ్లు పోలేవు. అందువల్ల  అక్కడి నుండి వెనక్కు వచ్చి గోపాల కృిష్ణాపురం గురుకుల పాఠశాల పక్కగా ఉన్న దారి అడిగి తెలుసుకుని ముందుకు సాాాగాలి.  ఇది అతుకుల గతుకులు దారి. ఆ దారిలోనే ప్రయాణించి  అతి కష్టం మీద మూల కోన చేరుకున్నాము.
దారి కష్టాలన్నీ మరచిపోయి ఆ ముగ్ధ మనోహర గజపతి కొండల సౌందర్యాన్ని చూసి అవాక్కయి పోయాము.
అది అద్భుతమైన ప్రదేశము. నీళ్ల దారి గుండా, రాళ్లు బండలు దాటుకుంటూ పోతే  నీటి శబ్ద తరంగాల సంగీత ధ్వనులు, పక్షుల గొంతులు మన  అలసటను గుర్తు చేయవు.
ముందుగా ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అందులో ఒక సన్యాసి చాలా కాలంగా అక్కడే ఉంటున్నాడు. దాన్ని దాటుకుని పోతే నీళ్ల గుండ ఎదురవుతుంది. ఇందులోకి దిగితే చేపల వైద్యం అనుభవించిన అనుభవం. అక్కడ  కుడివైపు మెట్ల గుండా వెళితే దేవాలయం ఉంటుంది. పక్కగా చూస్తే అద్భుతం జలపాతం, కింద మంచినీళ్ల గుండం,చూపరులను బాగా కనువిందు చేస్తాయి. తిరిగి కిందికి దిగి ఎగబాకితే,  నీళ్ల గుండా నడక బహు కుశాలుగా ఉంటుంది. అక్కడో  గుండం. దానిపైన మెట్ల గుండా పోతే ఒక చిన్న గుడి, ఒకపుట్ట. అక్కడి నుంచి చూస్తే గజపతి కొండల  శిఖరాలు చాలా మనోహరంగా అద్భుతంగా చూపరులను అలరిస్తాయి.
ఎదురుగా కింద గుండంలో నంది విగ్రహం, జల లింగేశ్వర ఆలయం ఉన్నాయి. ఈ మూలకోన లోనే ఆకాశరాజు కూతురు అలమేలు మంగను శ్రీనివాసుడు చూసి మరులు కొన్నాడని భక్తుల కథనం.
ఎంతో ఆహ్లాదకరమైన ఈ ప్రదేశానికి రవాణా సౌకర్యం గాని మరే ఇతర సౌకర్యాలు గాని లేవు. ఎక్కువగా తమిళనాడు నుండి చూపరులు వస్తున్నారు. ఈ అనాధను పట్టించుకునే నాథుడే లేడా?

MORE TREKKING IN SESHACHALM HILLS, TIRUPATI ANDHRA PRADESH

 

One thought on “ఈ రోజు ట్రెకింగ్ కనువిందు చేసే మూలకోన జలపాతానికి…

Comments are closed.