ప్రపంచ వాణిజ్య చరిత్రను మార్చేసిన ఒక డాక్టర్ ప్రాణత్యాగం

ఎల్లో ఫీవర్ అనేది 18,19 శతాబ్దాలలో భయంకరమయిన జబ్బు. మధ్య అమెరికా అటు ఇటూ దేశాలలో విపరీతంగా ప్రాణాలను తీసిన జబ్బు. ఆ జబ్బు ఎలా వస్తుందో, ఎలా వ్యాపిస్తుందో తెలియని రోజులవి. అపుడే ప్రపంచవిస్తరిస్తూ ఉంది.ప్రపంచాన్ని చుడుతున్న నౌకల ద్వారా  ఈ జబ్బు దేశ దేశాలకు ప్రాకుతూ వేలాది మందిని బలిగొంటూ ఉంది.
ఇలాంటపుడు అట్లాంటిక్ , పసిఫిక్ మహా సముద్రాలను కలిపి, ఆమెరికా పడమటి తీరానికి దగ్గిర దారి వేయాలనుకున్నారు.  ఈ ఆలోచనతో మొదలయిందే పనామా కాలువ తవ్వకం.
ఫ్రాన్స్ ఈ పని మొదలుపెట్టింది. అయితే, ఆ ప్రాంతంలో ఎల్లో ఫీవర్ ప్రబలి వేల సంఖ్యలో కార్మికులు చనిపోవడంతో  భయపడి  ఫ్రెంచ్ దేశం వాళ్లు అట్లాంటిక్- పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూచేపట్టిన పనామా కాల్వ తవ్వకం పనులను ఆపేసుకుని వెళ్లిపోయారు.
అప్పటికింకా ఎల్లో ఫీవర్ నరకయాతన తెలిసినా అదెలా వ్యాపిస్తున్నదో అంతుబట్టడం లేదు.అందుకే ఎల్లో ఫీవర్ నివారణ చర్యలు చేపట్టలేకపోయారు. ఎల్లో ఫీవర్  ఉత్తర, దక్షిణ ఖండాలు రెండింటిని  గజగజ వణికిస్తున్నది. మరణాలు రేటు 20 శాతం దాకా ఉంది.
ఇపుడు కరోనా మహమ్మారి  ఎలా ప్రపంచాన్ని పీడిస్తున్నదో ఆ రోజుల్లో లాటిన్ అమెరికాతో పాటు అమెరికా దక్షిణ ప్రాంతాలను ఎల్లోఫీవర్ శాపంలా పట్టుకుని పీడించింది..
అమెరికాలోనే 18, 19శతాబ్దాలలో వేల సంఖ్యలో చనిపోయారు. ఉదాహరణకు1878లో మెంఫిస్ నగరంలో 16 వేల మంది చనిపోయారు. 1793లో 1900 మంది చనిపోయారు. ఈ జబ్బు ఎలా వస్తున్నదో ఒక మనిషి నుంచి మరొక మనిషికి ఎలా అంటుకుంటున్నదో తెలియదు.
వ్యాధికి వైద్యం చేసేందుకు, ఈ వ్యాధిని నివారించేందుకు ఈ విజ్ఞానం (Epidemeology) చాలా అవసరం. చాలా మంది డాక్టర్లు ఎల్లో ఫీవర్ ‘అంటువ్యాధి’ అని అనుమానిస్తున్నారు. ఈ జబ్బు వచ్చినపుడు కామెర్లు కూడా వచ్చి మనిషి పచ్చబడతాడు కాబట్టి ఎల్లోఫీవర్ అని పిలిచారు.
ఈ వ్యాధి వల్ల  అనేక దేశాలలో ఉన్నఅమెరికా సైనికులు పిచ్చిపచ్చిగా చనిపోతున్నారు. 1804 నాటికి ఇది ‘అంటువ్యాధి’ కాదని మాత్రం తెలుసుకున్నారు.
1807లో జాన్ క్రాఫోర్డ్  బాల్టిమోర్ అనే డాక్టర్ ఇది దోమల వల్ల వ్యాపిస్తున్నదని భావించాడు. ఆధారాలు లేవు. దోమలు ఈ జబ్బును ఒక మనిషి నుంచి మరొక మనిషికి మోసుకెళ్తున్నాయని, ఇది కూడా మలేరియాలాగే వ్యాపిస్తున్నదని ఆయన భావించాడు.అయితే,దానిని ప్రయోగాత్మకంగా ఈ సిద్ధాంతం రుజువుచేయాల్సి ఉంది.

ఇది కూాడా చదవండి

పనామా కెనాల్ నిర్మాణాన్ని సాధ్యం చేసిన ఒక డాక్టర్ ప్రాణ త్యాగం

ఎల్లో పీవర్ తో అమెరికాకు చాలా  కష్టాలుపడుతున్నది. అందువల్ల ఈ జబ్బుకు వెంటనే విరుగుడు కనిపెట్టకపోతే దేశానికి ఆర్థికంగా చాలా నష్టం. ఎలాగంటే
1. అమెరికా సైన్యాలు చాలా దేశాలలో ఉన్నాయి. 1890 దశకంలో క్యూబాలో స్పెయిన్ తో తలపడుతున్నాయి. క్యూబాలో ఎల్లో పీవర్ తీవ్రంగా ఉంది . అందువల్ల ఎల్లో పీవర్ నుంచి తక్షణం సైనికులను కాపాడుకోవాలి.
2. అమెరికా తూర్పు తీరం నుంచి పడమటి తీరానికి చాలా దూరం. సరుకుల రావాణ ఖరీదయిన వ్యవహారం. అటుఇటూ నౌకాయానం చేయాలంటే దక్షణ అమెరికా ఖండాన్ని మొత్తంచుట్టి ప్రయాణించాలి.  అందువల్ల  నౌకా యానానికి దగ్గిర దారి కనిపెట్టేందుకు పనామా కాలువతవ్వాలి. దీనితో అమెరికా ఒక తీరంనుంచి మరొక తీరానికిదూరం కొన్నివేల మైళ్లు తగ్గుతుంది. పనామా ప్రాంతంలో ఎల్లో ఫీవర్ ప్రాణాలను తీసేస్తూ ఉంది. అందువల్ల ఎల్లో ఫీవర్ ను అర్జంటు అరికట్టాలి.
3.ఆమెరికా లోని దక్షిణ రాష్ట్రాలలో ఈ జబ్బు వేల సంఖ్యలో చనిపోతున్నారు.జబ్బు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తూ ఉంది. వెంటనే అరికట్టాలి.
ఈ కారణాల వల్ల ఎల్లోపీవర్   అమెరికాలో ఎమర్జన్సీ సమస్య అయికూర్చుంది.
అపుడు ఆమెరికా ప్రభుత్వం 1900 లో ఎల్లోఫీవర్ కమిషన్ (Yellow Fever Commission) నియమించింది.  దీనికి వాల్టర్ రీడ్ (Walter Reed) అనే మిలిటరీ డాక్టర్ అధ్యక్షుడు. క్యూబా ఆ రోజుల్లో స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ఉంది.  అప్పటికే  మొదటి దఫా దశవత్సర యుద్దం (Ten-year war 1868-78)జరిపింది. తర్వాత మరొక యుద్ధం 1879-80 లో చేసింది. తర్వాత మూడోయుద్ధం, చివరి యుద్ధం 1895-98 మధ్య జరిగింది. స్పెయిన్  కు వ్యతిరేకంగా అమెరికా క్యూబాను అక్రమించుకుంది. 1902లో క్యూబా స్వతంత్రమయింది. ఈ చివరియుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంది.  అయితే, అక్కడ తిష్ట వేసి  ఉన్న అమెరికా సైనికులు ఎల్లో ఫీవర్ తో హడలిపోతున్నారు.  కాబట్టి సైన్యాన్ని కాపాడుకోవాలి.
డా. రీడ్ అప్పుడు ఒక ఆర్మీ మెడికల్ స్కూల్ లో బ్యాక్టీరియాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. రీడ్  నలుగురు డాక్టర్లో ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి క్యూబాకు పంపించారు.
వీరంతా క్యూబా రాజధాని హవానా శివార్లలో ఉన్న ఒక మిలిటరీ బ్యారక్ లో  1900 జూన్ 25న కలుకున్నారు. వీళ్ల అసైన్ మెంటు ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి ఎలా సంక్రమిస్తున్నదో కనిపెట్టాలి.
Walter Reed / Wikimedia Commons
అప్పటికే దోమల ద్వారా వ్యాపిస్తున్నదనే ఒక వాదన ఉంది. ఇదే విధంగా బాసిలర్ ఇక్టెరాయిడీస్ (Bacillus Icteroides) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందనుకున్నారు.  కాబట్టి, ఇవెంత వరకు నిజామోచూడాలనుకున్నారు.తమ ట్రయల్స్ కోసం కొంతమంది సైనికులను రిక్రూట్ చేసుకున్నారు. వీళ్లందరికి కుటుంబాలున్నాయి. పిల్లలున్నారు. అయినా సరే ప్రమాదకరమయిన, వైద్యంలేని  ఒక జబ్బు మీద జరుగుతున్న  వైద్యపరిశోధనల్లో పాల్గొనేందుకు సాహసం చేశారు.
1900 ఆగస్టు 3న  వలంటీర్లు ఈమేరకు  ప్రతిజ్ఞ చేశారు. తమ ద్వారా ఈ జబ్బు ఇతరుకు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిసినా తాము ఎల్లో ఫీవర్  వ్యాప్తి చేస్తాయని అనుమానిస్తున్న దోమలు (Aedes Aegypti)  కుట్టించుకునే వైద్యపరీక్షకు అంగీకరిస్తున్నామని ప్రతిజ్ఞ చేశారు.
మరిన్ని విశేషాలు
*తిరుమల పవిత్రతను ఈస్టిండియా కంపెనీ ఎలా కాపాడిందంటే…

*తిరుమల వెంకన్న గుడి ఈస్టిండియా కంపెనీ పాలన కిందికి ఎలా వచ్చింది?

ఇందులో మొదట 8 మంది వలంటీర్లకు ఎల్లో ఫీవర్ ప్రాంతంలోని దోమలు కుట్టేలా చేశారు.  ఎల్లోపీవర్ సోకిన రోగులున్న గదులనుంచి తెచ్చిన దోమలివి. అయితే, వాళ్లెవరూ జబ్బు పడలేదు. ఆరోజుల్లో వలంటీర్ల మీద ప్రయోగాలు చేసే ముందు శాస్త్ర వేత్తలు, డాక్టర్లు తమ మీదే మొదట పరీక్షలు (Self-Experimentation) చేసుకునే వారు.
ఈ ఎనిమిది వలంటీర్లు తర్వాత లేజియర్ తన మీదప్రయోగం చేసుకున్నాడు. ఎల్లో ఫీవరో దోమలు తనని కుట్టేలా చేసుకున్నాడు. అయితే, తొలుత ఆయనకు జ్వరం రాలేదు.
తర్వాత ఈ బృందానికి  జేమ్స్ కారొల్ (45)అనే డాక్టర్ దోమ కాట్లు తీసుకున్నాడు. కారొల్ కు రెండురోజుల్లో తీవ్రమయిన జ్వరం వచ్చింది.నమమయింది. అయితే, ఆయన శాశ్వతంగా దాని దుష్ప్రభావం మిగిలిపోయింది.
 లేజియర్ రెండో సారి సెల్ప్ ఎక్స్ పెరిమెంటేషన్ కు పూనుకున్నాడు. ఎల్లోఫీవర్ రోగకారకాలను మోసుకెళ్తున్నాయని అనుమానం ఉన్న దోమలతో రెండో సారి కుట్టించుకున్నాడు. అంతే, అయిదు రోజుల్లో ఆయన తీవ్రమయిన జ్వరం వచ్చింది. దాని ప్రభావం గురించి ఆయన రోజూ డైరీరాయడం మొదలుపెట్టారు.లేజియర్ జ్వరం మందులకు తగ్గలేదు.ఇంకా తీవ్రమయింది. అంతా చూస్తుండగానేలేజియర్ చనిపోయాడు. అపుడు ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు.
తన జబ్బు తీవ్రమవుతున్నపుడు, తన ప్రయోగం విజయవంతమయిందని ఆయనకు తెలిసిపోయింది. ఎల్లో ఫీవర్ దోమల ద్వారా వ్యాపిస్తుందనే సిద్ధాంతం తమ ప్రయోగాల్లో రుజువయిందని కూడా ఆయన డైరీలో రాసుకున్నారు.
ఇంతప్రమాదరకమయిన ప్రయోగాలు జరుగుతున్నపుడు తన గదిలో కూర్చోవడం తప్ప టీమ్ లీడర్  ప్రొఫెసర్ రీడ్  పాల్గొనే ప్రయత్నం చేయలేదు . లేజియర్ చనిపోగానే రీడ్ క్యూబా వదలి అమెరికా వెళ్లిపోయాడు. పోతూ పోతూ డాక్టర్ లేజియర్ డైరీ తీసుకుపోయాడు.
ఈ డైరీలో ఉన్న విషయాల ఆధారంగా రీడ్ ఎల్లోఫీవర్ దోమల ద్వారా వ్యాపిస్తున్నదని అమెరికి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చాడు. ఒక రీసెర్చ్ పేపర్ కూడా పబ్లిష్ చేశాడు.  రీడ్ రిపోర్టు ఒక అత్యద్భుతమయిన రహస్యాన్ని వెల్లికితీసిందని, ఎల్లో ఫీవర్ దోమల ద్వారా వ్యాపిస్తుందని రుజువుచేయడం ఒక వైద్య పరిశోధనల చరిత్రలో ఒక మైలురాయి అని  ప్రభుత్వం గుర్తించింది.  ప్రొఫెసర్ రీడ్ వైద్య ప్రపంచంలో సెలెబ్రిటీ అయ్యాడు.
దోమలు ఈ భయంకరమయిన జబ్బును వ్యాప్తి తెలియగానే ఆమెరికా ప్రభుత్వం పనామా ప్రాంతంలో దోమల నిర్మూలన కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికను చేపట్టింది. దోమల నివారణ ఎపుడూ పూర్తయిందో వ్యాధి అదుపులోకి వచ్చింది.ఆమెరికా ప్రభుత్వం పనామా కాలువనిర్మాణపు పనునలు చేపట్టింది. దీనితో రీడ్ కు విపరీతంగా గుర్తింపు వచ్చింది. ఇదే చాలా కాలం ప్రచారమయింది. ఆయన పనిచేసిన ఒక మిలిటరీ ఆసుపత్రికి వాల్టర్ రీడ్ మిలిటరీ హాస్పిటల్ అని పేరు పెట్టారు.
అయితే, ఒక కొత్త పుస్తకం వచ్చి మరుగున పడిపోయిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. వాల్టర్ రీడ్ తన సహచరులు ప్రయోగ ఫలితాల క్రెడిట్ కొట్టేయడానికి వీల్లేదని ఈ పుస్తకరచయితలు వాదిస్తున్నారు. తన టీమ్ లోె పనిచేస్తున్న ఒక జూనియర్ కొలీగ్ ప్రాణత్యాగానికి ఒడికట్టి జరిపిన  ప్రయోగం డేటాను కాజేసి, క్రెడిట్ కొట్టేశాడని ఈ పుస్తకం బయటపెట్టింది.
లేజియర్ ప్రయోగాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే మొట్టమొదటి సారి ఒక మనిషిని నుంచి మరొక మనిషికి ఎల్లో ఫీవర్ దోమలద్వారా వ్యాపిస్తుందనే విషయం రుజువు చేసేందుకు ఒక డాక్టర్ తన మీద తానే ప్రయోగం చేసుకున్నాడు. ఎల్లో ఫీవర్ బారిన పడ్డాడు. వ్యాధికి సరైన వైద్యం లేక సతమతమవుతూనే ప్రయోగాన్ని డైరీ లోరికార్డు చేశాడు. ప్రయోగం విజయవంతమయంది. వ్యాధి ముదిరింది. ప్రాణంవిడిచాడు.
ఇదీ మీకు నచ్చవచ్చు
తిరుమల గురించిన 20 చిన్న, చిక్కు ప్రశ్నలు, వీటి జవాబులు మీకు తెలుసా?
ఇటువంటి ప్రయోగఫలితాలను రీడ్ తనవిగా చెప్పుకున్నాడనే విమర్శివచ్చింది. 1984లో ఇద్దరు డాక్టర్లు Jon Franklin, Johan Suthderland లురాసిన  Guinea-Pig Doctors: Drama of Medical Research Through Self-Experimentation ఈ విషయం బయటపడింది.  ఈరచయితలు  రీడ్ పేరుతో పెట్టిన ఆసుపత్రి పేరు మార్చాలని కూడా డిమాండ్ చేశారు.
Panama Canal/Panama Canal Authority
వాల్టర్ రీడ్ నైతికతను ఈ పుస్తకరచయితలు  ప్రశ్నించారు.ఎందుకంటే ఎల్లోపీవర్ జబ్బు దోమల నుంచి వ్యాపిస్తుందన్న ధియరీని రీడ్ ఎపుడూ నమ్మలేదు.  తన గతంలో నమ్ముతున్నదానిని అంగీకరించి, తన టీమ్ ప్రయోగాలలో దోమల ద్వారా వ్యాధి వ్యాపిస్తుందని రుజవయిందని, క్రెడిట్ ను తన టీమ్ కు ఇవ్వాల్సి ఉండిందనేది వీరి వాదన. రీడ్ ఇలా గొప్పమనుసుతో పనిచేయలేదు.  మొత్తం క్రెడిట్ ను తనఖాతాలో వేసుకున్నాడనే విమర్శ ఉంది.
లేజియర్ నోట్స్ ఆధారంగా రీడ్ ఒక రీసెర్చ్ పేపర్ ను పబ్లిష్ చేశాడు. అందులో సహరచయితలుగా క్యూబా టీమ్ సభ్యులందరి పేర్లు రాశాడు.  ఫ్రాంక్లిన్, సూదర్ ల్యాండ్ దీనిని తప్పుబడుతున్నారు. అయితే, రీడ్ కు మద్దతు దారులకూడా ఉన్నారు.టీమ్ లీడర్ గా క్యూబాలో రీసెర్చనుప్లాన్ చేసింది రీడ్ యే కాబట్టి క్రెడిట్ తీసుకోవడంలో తప్పు లేదనే వాళ్లు ఉన్నారు.ఈ వివాదం ఇంకా సెటిల్ కాలేదు. అయితే,  ఎల్లోపీవర్ దోమల వ్యాపిస్తుందనే విషయంకనిపెట్టడం వైద్యశాస్త్ర ఘనవిజయం. ఇపుడు ఎల్లో ఫీవర్ కు కారణం వైరస్ అని తెలిసిపోయింది. దానికి వ్యాక్సిన్ (Vaccine) వచ్చింది. అయినా ఇప్పటికీ ఈ జబ్బు పీడిస్తూనే ఉంది. జబ్బుసోకితే మరణాలు, 20 నుంచి 50 శాతం దాకా ఉంటున్నాయని Lancet జర్నల్ రాసింది.

 

Like this story? Share it with a friend?