దేశీయంగా తయారయిన మొదటి వ్యాక్సిన్ ప్రయోగం భారతదేశంలో 1897 జనవరి 10న జరిగింది. దీనిని కనిపెట్టిన శాస్త్రవేత్త వల్దేమర్ మోర్డెకై వుల్ఫ్ హాఫ్ కైన్ (Waldemar Mordecai Wolff Haffkine). సింపుల్ గా హాఫ్ కైన్.
ఆయన రష్యా దేశస్తుడు. అప్పటి బ్రిటష్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు 1890 దశాబ్దంలో భారత దేశంలో వ్యాపించిన ప్లేగ్ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేయాలని ఇండియా వచ్చారు.
ఆయన తయారు చేసిందే ఈ వ్యాక్సిన్. ఇప్పటిలాగా మూడు సార్లు క్లినికల్ ట్రయల్స్ జరిపిన ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి తీసుకుని ప్రజలకు ఎక్కించేంతగా వ్యాక్సిన్ సైన్స్ అభివృద్ధిచెందలేదు. తయారు చేయాలి. ప్రయోగించాలి.
అంతకు ముందు ప్రఖ్యాత బ్యాక్టీరియాలజిస్టు లూయీ పాశ్చర్ తో కలసి కలరా వ్యాక్సిన్ తయారు చేసిన అనుభవం ఉన్నందున, ఆ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇచ్చినందున ఆయనకు అప్పటికే వ్యాక్సిన్ శాస్త్రవేత్తగా పేరొచ్చింది. దానితో నాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆరోజుల్లో లక్షలాది మందిని చంపేస్తున్న ప్లేగ్ కు వ్యాక్సిన్ తయారు చేయాలని కోరింది.
అలా ఆయన బొంబాయికి వచ్చి వ్యాక్సిన్ తయారు చేశారు. నిజానికి ఆయన వచ్చింది కలరా వ్యాక్సినేషన్ కోసం ఇండియావచ్చాడు.
మార్చి 1894లో కలకత్తాలో కలరా వ్యాక్సిన్ వేస్తున్న హాఫ్ కైన్ / twitter picture
అయితే, అదే సమయంలో ప్రమాదకరమమయిన ప్లేగ్ ఇండియాలోప్రవేశించింది. ప్రజలు విపరీతంగా చనిపోవడం మొదలుపెట్టారు. చాలా వేగంగా వ్యాపించడం మొదలయింది. అందువల్ల అత్యవసరంగా వ్యాక్సిన్ తయారుచేయించాల్సి వచ్చింది. దీనికి సమర్థుడొక్కడే. హాఫ్ కైన్ . అపుడాయన కలకత్తాలో కలరా వ్యాక్సినేషన్ లోఉన్నారు. ప్రభుత్వం పిలుపుతో బొంబాయి పరిగెత్తు కుంటూ వచ్చి వ్యాక్సిన్ ను దినాల్లో తయారు చేసేశాడు. ఆ వ్యాక్సిన్ ఎలుకల మీద బాగా పని చేసింది. తర్వాత కుందేళ్ల మీద, ఆపైన తానూ స్వయంగా తీసుకుని సురక్షితమని దేశానికి చాటాడు.
దీనితో ధైర్యంగా ఆయన ఇక వలంటీర్లకు ఎక్కించవచ్చని భావించారు. 1897 జనవరి 3న 140 మంది వలంటీర్లకు వ్యాక్సిన్ ఎక్కించాడు. వీళ్లలో కొంతమంది బైక్యుల్లా జెయిల్ ఖైదీలు కూడా ఉన్నారు. వీరికి ధైర్యం చెప్పి వ్యాక్సిన్ ఎక్కించేందుకు హాఫ్ కైన్ ఒక వారంలో రోజులు జైలులో నే ఉన్నాడు. ఇలా ఈ జైలు ( Byculla House of Correction) భారతదేశంలో తొలిసారి వ్యాక్సిన్ ఎక్స్ పెరిమెంట్ జరిగిన ప్రదేశంగా చరిత్రలో మిగిలిపోయింది.
ఇది కూడా చదవండి
123 యేళ్ల నాటి ఆయుధంతో కరోనా మీద యుద్ధం, ఏమిటా ఆయుధం?
తర్వాత డామన్ లో 2,200 మందికివ్యాక్సిన్ ఎక్కించాడు. ఈ ప్రయోగంలో కూడా ఫలితాలు చాలా ప్రోత్సాకరంగా ఉన్నాయి. ప్రయోగంలో వ్యాక్సిన్ ఎక్కించిన వారిలో కేవలం 36 మంది చనిపోయారు. ప్రయోగం కోసం ఎంచుకున్న 6 వేల మంది వ్యాక్సిన్ నిరాకరించిన గ్రూప్ ఇది. (కంట్రోల్ గ్రూపు) ఇందులో 1,482 మంది చనిపోయారు.
ఈ ప్రయోగాలు అపుడు దేశంలో పెద్ద సంచలనం సృష్టించాయి. దీనితో ఆఘాఖాన్ వ్యాక్సిన్ ఎక్కించుకునేందుకు స్వయంగాముందుకు వచ్చారు. ఆయనపాటు ఆయన ఖోజా ముస్లిం అనుచరులంతా వ్యాక్సిన్ ఎక్కించుకున్నారు. ఇందులో 3814 మంది ప్లేగు టీకాలు వేస్తే వారిలో చనిపోయివ వాల్లుకేవలం ముగ్గురు మాత్రమే.
వ్యాక్సిన్ నిరాకరించిన 9,516 మందిలో 77 మంది చనిపోయారు.
ఇలాంటపు బరోడా మహారాజు కూడా ఆయనను ఆహ్వానించి వ్యాక్సినేషన్ చేయమన్నారు. అపుడు బరోడా చీఫ్ జస్టిస్ అబ్బాస్ త్యాబ్జీ తన కూతరు షరీఫాను మేనల్లుడు హతీమ్ ని ధైర్యంగా వ్యాక్సినేషన్ కుపంపించి సంచలనం సృష్టించారు.
దీనితో హాఫ్ కైన్ ఇండియా ప్లేగ్ వ్యాక్సిన కనిపెట్టడం అంతర్జాతీయ వార్త అయింది. అప్పటి బ్రిటిష్ మెడికల్ జర్నల్, నేచర్ లు ఆయన ప్రయోగాన్ని ఆకాశానికెత్తేశాయి. దీనితో వ్యాక్సిన్ వల్ల ప్లేగ్ నివారించవచ్చని ప్రపంచం ఆమోదించింది. అయితే, కోట్లలో జనాభాకు వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు లేవు. దీనితో వ్యాక్సిన్ వల్ల బతికే వారి సంఖ్య కంటే వ్యాక్సిన్ అందక, ప్లేగ్ సోకి చనిపోవడం ఎక్కువయింది.
భారీగా వ్యాక్సిన్ తయారుచేయాలని డాక్టర్ హాఫ్ కైన్ మీద వత్తిడి మొదలయింది. ల్యాబ్ ఏర్పాటుచేసుకునేందుకు మలబార్ హిల్స్ లో ఆయనకు ఒక పెద్ద బంగళా ఇచ్చారు. అయితే, ఆఘా ఖాన్ ముందుకొచ్చి ఖుస్రులాడ్డ్ ఇచ్చారు. డిమాండ్ విపరీతం కావడంతో ఇపుడు ‘హాఫ్ కైన్ ఇన్ స్టిట్యూట్’ గా పేరున్న పరేల్ లోని భవనంలోకి మారారు. అపుడు దానికి ప్లేగ్ రీసెర్చ్ లాబొరేటరీ అని నామకరణం చేశారు. హాప్ కైన్ ఈ లాబొరేటరీకి డైరెక్టర్ ఇన్ చీఫ్. అక్కడి కొచ్చాక 50 మిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారుచేసే దాకా కెపాసిటీ పెరిగింది.
1904లో దీనిని ‘బాంబే బ్యాక్టీరియాలజీ లాబొరేటరీ’ (Bombay Bacteriology Laboratory) గా మార్చారు. 1986-1904 వరకు ప్లేగ్ ల్యాబొరేటరీ కలరా, టైఫాయిడ్, మాల్టా జ్వరం, డిఫ్తీరియా, రిలాప్సింగ్ ఫీవర్, లెప్రసీ, స్మాల్ పాక్స్, యాంటి-స్నేక్ వేనమ్ (పామువిషం విరుగుడు) లతో పాటు దోమల మీద, రకరకాల పురుగుల మీద పరిశోధన చేస్తూ వచ్చింది.
హాప్ కైన్ వ్యాక్సి న్ ఎలా తయారు చేశారు?
అంతకు ముందు ఆయనకు కలరా వ్యాక్సిన్ మీద పనిచేసిన అనుభవం ఉంది. వ్యాక్సిన్ తయారీలో ఇప్పుడంతా సైంటిఫిక్ థియరీ లేదు. ఉన్నదంతా ప్రాక్టికల్ అనుభవమే. నిర్వీర్యం చేసిన బ్యాక్టీరియా శరీరంలోకి ఎక్కిస్తే మనిషిలో ఆ బ్యాక్టీరియాకుఅవసరమయిన ఇమ్యూనిటీ పెరుగుతున్నదని గ్రహించాడు.
ఈ అనుభవంతోనే ఆయన ప్యారిస్ లో కలరా వ్యాక్సిన్ తయారు చేశారు. ఇపుడు ఇండియాకు వచ్చి అదే పద్థతి లో ప్లేగు వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేశారు. వ్యాక్సిన్ తయారు చేసే విధానాన్ని కూడా ఆయన కనిపెట్టారు. బ్యాక్టీరియా సోకిన ఎలుకలనుంచి సేకరించిన బ్యాక్టీరియాని ఆయన మాంసం పులుసులో పెంచారు. ఈ పులుసుపైన కొబ్బరి లేదా నెయ్యివేసి ఒక పొర లాగా చేసిన కప్పేశారు. దీనితో అడుగున పులుసులో బాక్టీరియా తీగెల్లాగా పెరగడం మొదలయింది. ఈ తీగెలను హాఫ్ కైన్స్ స్టాలెక్ స్టైట్స్ (Haffkine’s Stalactites)అనిపిలిచారు. ఈ బ్యాక్టీరియాని ఒక పదిహేనురోజులు పెరిగేలా చేసి , తర్వాత వేరు చేసి వేడిచేసి నిర్వీర్యం చేశాడు. ఇదే వ్యాక్సిన్. ఇది మనిషిలో పనిచేస్తుందా? అదే పెద్ద సవాల్.
ఎలుకలమీద ప్రయోగం
ఈ ద్రవాన్ని ఆయన ఎలుకల మీద ప్రయోగించాడు. దీనికి ఇళ్లలో తిరిగే ఇరవైఎలుకలను సేకరించాడు. ఇందులో పదింటికి వ్యాక్సిన్ ఎక్కించాడు. మరొక పదింటిని అలాగే వుంచాడు. ఈ రెండింటిని కలిపేశాడు. వీటి మధ్యన ప్లేగ్ వ్యాధి సోకిన ఎలుకను వదిలాడు. ప్లేగ్ వ్యాపించిందేమో పరీక్షించాడు. ఆయన వ్యాక్సిన్ ఎక్కించిన పది ఎలుకలు బతికాయి. వాటికి వ్యాధి సోకలేదు. వ్యాక్సిన్ లేని పది ఎలుకల్లో తొమ్మది చనిపోయాయి. ప్రయోగం విజయవంతమయింది. ఆయన ఆనందానికి లేకుండా పోయింది.
ఈ ప్రయోగాన్ని 1896 డిసెంబర్ 1897జనవరి మధ్య ఆయన కుందేళ్ల మీద చేశాడు. అదీ సక్సెస్ అయింది. తన ప్లేగ్ నివారణ విధానం (Plague prophalaxis) గురించి సైంటిఫిక్ జర్నల్ లో వ్యాసం కూడా రాశారు. ఇక మనుషుల మీద ప్రయోగించాలి. ఎలా?
ఇది కూడా చదవండి
చైనా నుంచి వైరస్ రావడం ఇది రెండోసారి, మొదటి సారి గాంధీ కూడా బాధితుడే…
ఎవరిమీదో ప్రయోగం ఎందుకని, 1897జనవరి 10వ తేదీన తనకు 10 మి.లీ వ్యాక్సిన్ ఎక్కించుకుని ఫలితం చూశాడు. అది బాగా పనిచేసింది. మొదట తీవ్రంగా రియాక్షనిచ్చింది. బాగా జ్వరం వచ్చింది. లెక్కచేయకుండా తన పనిలో నిమగ్నమయ్యాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. ఈ ప్రయోగం సమాచారం British Medical Journal, Nature లో అచ్చయింది. హాప్ కైన్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.
ఇంతకీ ఎవరీ హాఫ్ కైన్?
హాఫ్ కిన్ రష్యాదేశస్తుడు. 1860 మార్చి 15న జార్ చక్రవర్తి పాలనలోని రష్యాలో నల్ల సముద్రం రేవుపట్టణం ఒడెస్సాలో జన్మించాడు. జంతుశాస్త్రం చదువుకున్నాడు. ఆరోజుల్లో జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు నడుస్తూఉంది. తీవ్రవాదులు జార్ అలెగ్జాండర్ ని హత్య చేశారు. దీని పర్యవసానంగా రష్యలో యూదుల మీద అణచివేత ఎక్కువయింది.దీనికి తోడుయూదు జాతికి చెందిన హాప్ కైన్ ఒక తిరుగుబాటు సంస్థలో పనిచేసేవాడు. ఒక దశలో ఆయనను అరెస్టు చేశారుకూడా.తన ప్రొఫెసర్ సాక్ష్యంతో ఆయన కేసునుంచి బయటపడ్డాడు.
జూవాలజీ లో ఉన్నత విద్య నభ్యసించాక, రష్యాలో పరిస్థితి యూదులకు అనుకూలంగా లేకపోవడంతో ఆయన విదేశాలకు వెళ్లాలనుకున్నాడు.మొదట స్విజర్లాండ్ వెళ్లాడు. జెనీవా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నపుడు పారిస్ లో లూయీ పాశ్చర్ ప్రయోగాలవైపు ఆయన ఆకర్షితుడయ్యాడు. అంతే, పాశ్చర్ ను కలసి ఆయన టీమ్ లో చేరాడు. అక్కడ 1889-93 దాకా చాలా కమిట్ మెంట్ పతో పనిచేసి మొప్పు పొందాడు. కలరా బ్యాక్టీరియా ఆయనకు ఇష్టమయిన పరిశోధన. కలరా వ్యాక్సిన్ తయారు చేశాడు. అయితే, యూరోప్ లో అంతగా కలరా లేదు. దీనికి ఏసియాదేశాలు అనుకూలం. ఇలాంటపుడు ఆయన బ్రిటిష్ ఇండియా నుంచి పిలుపు వచ్చింది.
ఇలాంటపుడు ఆయన బ్రిటిష్ ఇండియాను పీడిస్తున్న కలరాకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రభుత్వం ఆహ్వనించింది. 1893 మార్చిలో ఆయన కలకత్తా వచ్చారు. ఈ వ్యాక్సిన్ ను అప్పటికే తయారు చేశాడు. ఇక మనుషుల మీద ప్రయోగించాలి. అయితే, వ్యాక్సిన్ పరిచయంలో భారతీయుల్లో నమ్మకం కల్గించేందుకు తానే మొదటు ప్రయోగించుకుని సురక్షితమయిందని చెప్పాడు.
ఆయన ఇలా కలరా వ్యాక్సిన్ తో బిజీ గా ఉన్నపుడు హాంకాంగ్ నుంచి బొంబాయికి ఒక నౌక వచ్చింది.హాంకాంగ్ లో అప్పటికే ప్లేగ్ బాగా ప్రబలి ఉంది. ఈ నౌకతో పాటు ప్లేగ్ సోకిన కొన్నివందల ఎలుకలు కూడా వచ్చాయి. ఇవి బొంబాయిలో ప్రవేశించి ప్లేగ్ ను అంటించాయి. అప్పటికి రెండు వందల యేళ్లుగా భారత దేశంలో ప్లేగ్ వ్యాధి లేదు. బొంబాయి నుంచి ప్లేగ్ వ్యాధి దేశమంతా వ్యాపించింది.
కలరాకు విజయవంతంగా వ్యాక్సిన్ తయారు చేసిన అనుభవం ఉన్నందున, బొంబాయి ప్రభుత్వం హాప్ కైన్ ను కలకత్తానుంచి ఉన్నఫలాన బొంబాయి రప్పించింది. వ్యాక్సిన్ తయారుచేయాలని చెప్పింది. అంతేకాదు, ఆయనకు ఇండియన్ సివిల్ (ఐసిఎస్) సర్వీస్ ఉద్యోగి హోదా కూడా ఇచ్చింది. ఇలా ఆయన రోజుకు పద్నాలుగుగంటలు పనిచేసి ప్లేగ్ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేశాడు. ఇదే భారతదేశంలో కనిపెట్టిన మొదటి వ్యాక్సిన్.
Like this story? Share it with a friend!