123 యేళ్ల నాటి ఆయుధంతో కరోనా మీద యుద్ధం, ఏమిటా ఆయుధం?

(TTN Desk)
తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఒక పురాతన చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఇదొక చట్టం ఉందని చాలా మందికి తెలియదు. చాలా ముందుచూపుతో 123 సంవత్సాల కిందట నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చింది. అదే ఇపుడు భారతదేశమంతా అమలవుతూ ఉంది.
ఈ చట్టం పేరు ఎపిడెమిక్ డిసీసెస్ యాక్ట్ 1897 (The Epidemic Diseases Act 1897).
ఇదిగో ఆ యాక్ట్ ఇక్కడంది చూడండి
భారతదేశంలో అంటే బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి దాకా వచ్చిన చట్టాలలో అతి చిన్న చట్టం ఇదే. ఇందులో ఉండేది కేవలం నాలుగు భాగాలే. అయితే, దీనిని చాలా శక్తి వంతంగా తీసుకువచ్చారు. చాలా దూరదృష్టితో తీసుకువచ్చారు.
నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా వ్యాప్తి నివారణకు  ఒక జివొ విడుదల చేశారు. ఇది GO. Ms.No.45 General Administration Department.
 నాలుగు పేజీల ఈ జివోకు స్ఫూర్తి కూడా 1897 నాటి జివో యే. GO MS No 45 లోని చివరి వాక్యం ‘No suit or legal proceedings shall lie against any person for anything done or intended to be done in good faith under these regulations’ ను యథావిధిగా 1897 నాటి జివొ నుంచి తీసుకున్నారు.
ఇపుడు 1897 జీవొ గురించి నాలుగు ముక్కలు:  ఇపుడు వచ్చిన కోవిడ్ 19 వంటి మహమ్మారుల నుంచి భారత ప్రజలను కాపాడేందుకు అప్పటి గవర్నర్ జనరల్ విడుదల చేసిన ఉత్తర్వు. ఇది కేవలం రెండు పేజీలున్న చిన్న ముక్క.  GO ఎంత స్పష్టంగా ఉందంటే, గత 123 సంవత్సరాలలో ఈ జివొ ఎలాంటి మార్పులకు లోను కాలేదు. అంటే పరిస్థితులు మారినా, జివొ మాత్రం సర్వకాల సర్వావస్థలలో ప్రయోగించేందుకు వీలుగా ఉన్నటు వుంటి ఉత్తర్వు. అందుకే 1897లో వచ్చినా 2020 లో కరోనా కట్టడికి ఉపయోగపడుతూ ఉంది.

Like this story, pl share with a friend

ఈ జివోని 1896లో అప్పటి బొంబాయిని కుదిపేసిన బుబోనిక్ ప్లేగ్ ఎపిడెమిక్ ని అదుపు చేసేందుకు విడుదల చేశారు. ఈ ప్లేగ్ 1896 సెప్టెంబర్ నెలలో మొదలయి మెల్లిగా బ్రిటిష్ ఇండియా యావత్తూ వ్యాపించింది.
భారత దేశాన్ని ఆ రోజు పీడించిన మహమ్మారులలో ఇదే భయంకరమయింది.  దీనిని నివారించేందుకు ఏకంగా  బ్రిటిష్ పార్లమెంటు రంగంలోకి దిగింది. ప్లేగ్ వ్యాపించిన నాలుగు నెలల అనంతరం, ఇది బొంబాయిలో మొదలయిందని కనుగొన్నారు.
ఇది విపరీతంగా వ్యాపిస్తున్నందున విక్టోరియా మహారాణి జనవరి 18,1897న బ్రిటిష్ పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఎంతకఠిన చర్యలయినా తీసుకుని ప్లేగ్ ను నివారించాలని ఆమె బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ( “…directed (her) government to take the most stringent measures at their disposal for the eradication of the pestilence.”)
ఆమె ప్రసంగం తర్వాత, ఒక వారానికి Epidemic Diseases Bill ని నాటి కలకత్తా (అప్పటి బ్రిటిష్ ఇండియా రాజధాని) లోని గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో ప్రవేశపెట్టారు. దీని లక్ష్యం ఏమిటి? ” Better prevention of the spread of dangerous epidemic diseases.” Council of Governor-General of India లో ఈ బిల్లు ప్రవేశపెట్టింది జాన్ వూడ్ బర్న్ (John Woodburn) అనే సభ్యుడు.
విపత్తులు వచ్చినపుడు ప్రభుత్వం తీసుకునే చర్య ల మీద ప్రజలలలో విశ్వాసం కల్గించేందుకు ఈబిల్లును ఉద్దేశించడమయిందని ఉడ్ బర్న్ చెప్పారు.
గవర్న్ జనరల్ ఆమోదం తర్వాత ఇది Epidemic Diseas Act 1897 గా అమలులోకి వచ్చింది.
బొంబాయి ప్లేగ్
బూబోనిక్ ప్లేగ్ ను బొంబాయి ప్లేగ్ అని కూడా పిలుస్తారు. ఎక్కడి నుంచి బ్రిటిష్ ఇండియాలోకి వచ్చిందో కచ్చితంగా తెలియదు గాని మొత్తానికి కరోనా, స్పానిష్ ఫ్లూ లాగే ఇది కూడ బయటి నుంచే చొరబడింది. హాంకాంగ్ నుంచి వచ్చి వుండవచ్చని ఒక అనుమానం. ఎందుకంటే, 1894 నుంచి హాంకాంగ్ ని ఈ జబ్బు పీడిస్తూ ఉంది.
మొదట ఇది రేవు పట్టణాలకే పరిమితం అయింది. బొంబాయి నుంచి కలకత్తా, కరాచి లకు వ్యాపించింది. తర్వాత పూణే వంటి నగరాలకు పాకింది.
తర్వాత భారత దేశంలోని చిన్నచిన్న పట్టణాలకు కూడావ్యాపించి బీభత్సం సృష్టించింది. పబ్లిక్ హెల్త్ మీద ఈ ఉపద్రవం చాలా ప్రభావం చూపించింది. రోగనివారణకు మొట్టమొదటిసారిచట్టాన్ని ప్రయోగించాల్సిన రావడం ఈ ప్లేగ్ వల్లే. రోగం వ్యాపించకుండా ఏ చర్య నైనా బలవంతంగా తీసుకునేందుకు మార్గం వేసింది అపుడు తెచ్చిన ఎపిడెమిక్ డిసీసెస్ యాక్టే.
అంతవరకు రోగాలను నివారించేందుకు చట్టాలను వాడలేదు. అంటే బూబోనిక్ ప్లేగ్ వల్ల ఆరోగ్యపాలన అనేది చాలా ప్రముఖాంశమయింది. బ్రిటిష్ ఇండియాలో వైద్యం,ఆరోగ్యానికి కూడా చాలా ప్రాముఖ్యం ఇవ్వాలని ప్రభుత్వానికి మొట్టికాయ వేసి చెప్పిన రోగమది. ప్రతివేయి మందికి 22 మంది చనిపోయారు. కలరా మోర్టాలిటి (14) కంటే ఇది చాలా ఎక్కువ. మొదటి ప్లేగ్ కేసు1896 సెప్టెంబర్ లో మాండ్విలో రికార్డయింది. తర్వాత వేగంగావిస్తరించడం మొదలయింది.
ఆ యేదాడిదిలో వారానికి 1900 మంది చొప్పు న చనిపోయారు. ప్లేగ్ మొదలయినపుడు బోంబాయి జనాభా 8,20,000. ఇది 1901 సెన్సస్ నాటికి 7,80,000 కుపడిపోయింది. అపుడే బొంబాయి సిటీని చక్కగా తీర్చిదిద్దాలని బ్రిటిష్ పార్లమెంటు యాక్టతో బాంబే సిటి ఇంప్రూవ్ మెంట్ ట్రస్టును ప్రారంభించారు.
1896లో వచ్చినా 1900 ల దాకా ఇది బొంబాయి రాష్ట్రాన్ని వదల్లేదు. దాదాపు 2.9 మిలియన్ల మంది చనిపోయారు. మొత్తంగా 3.8మిలియన్ల మందికి వ్యాధి సోకింది. ఆ తర్వాత 1923 దాకా ప్లేగ్ ప్రతి సంవత్సరం బొంబాయి కాటేస్తూనే వచ్చింది.
ప్లేగ్ ని నివారించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం డాక్టర్ సర్ వాల్దేమర్ మోర్డే కాయ్ వోల్ఫ్ హాఫ్ కైన్ (పై ఫోటో) ను పంపించింది. ఆయన రష్యన్ శాస్త్రవేత్త. కలరాకు వ్యాక్సిన్ కనుగొన్నది కూడా ఆయనే. ఆయన నోబెల్ శాస్త్రవేత్త ఇల్యామెక్నికోవ్ దగ్గిర పనిచేసి, పారిస్ లోని పాశ్చర్ ఇన్ స్టిట్యూట్ కు వెళ్లారు. అక్కడే ఆయన కలరా వ్యాక్సిన్ తయారు చేసింది. ఆయన వ్యాక్సిన్ ను ముందు తన మీదే ప్రయోగించుకోవడం అలవాటు. బాంబేలో ప్లేగ్ సంగతి తెలిశాక ఆయన అక్కడి వెళ్లానుకున్నారు.
ఆయన బైక్యూల్లా లోని గ్రాంట్ మెడికల్ కాలేజీ నుంచి పని ప్రారంభించారు. 1897నాటికల్లా ఆయన వ్యాక్సిన్ రెడీ చేశారు. తొలుత అది పని చేస్తుందో లేదో నని తన మీద పరీక్షించుకున్నారు. ఆపైన బైక్యుల్లా జెయిలులో పరీక్షించారు. కంట్రోల్ గ్రూప్ లో కొందరు చనిపోయినా వ్యాక్సిన్ ప్రజలకు ఎక్కించారు.   దీనితో వ్యాధి రావడం 50 శాతం తగ్గింది.

https://trendingtelugunews.com/english/features/coronavirus-second-virus-from-china-gandhi-suffered-from-spanish-flu/