Home Features చైనా నుంచి వైరస్ రావడం ఇది రెండోసారి, మొదటి సారి గాంధీ కూడా బాధితుడే…

చైనా నుంచి వైరస్ రావడం ఇది రెండోసారి, మొదటి సారి గాంధీ కూడా బాధితుడే…

499
0
Spanish Flu (Photo credits: National Museum of Health and Medicine/BBC
(TTN Desk)
చైనా లోని వూహాన్ నుంచి మొదలయి ప్రపంచమంతా చుట్టుముట్టి ఇపుడు మానవజాతిని కలవరపెడుతున్నది నావెల్ కరోనా వైరస్ (కోవిడ్ 19). ఈ వైరస్ తో వేల మంది చనిపోయారు. ఇలా లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారు. మిగతా వాళ్లంతా ఈ వైరస్ బారిన పడకుండా తప్పించుకునేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ పరుగులు పెడుతున్నాయి. సృష్టిలో అత్యంత సూక్ష్మజీవి అయిన ఈ వైరస్ మీద యుద్ధం ప్రకటించాయి.
అయితే, ఇలా సూక్ష్మజీవి మానవ జాతి మీద దాడి చేయడం కొత్త కాదు. 1918లో ఇలా స్పానిష్ ఫ్లూ వైరస్ కూడా ఇలాగే దాడి చేసింది. కలవరపెట్టింది. లక్షల మీద పొట్టన పెట్టుకుంది. ముఖ్యంగా భారతదేశంలో కనివిని ఎరుగని స్థాయిలో స్పానిష్ ఫ్లూ వల్ల చనిపోయారు. ఒక అంచనా ప్రకారం అప్పటి భారత దేశ జనాభాలో అయిదు శాతం మందిచనిపోయారు. విచిత్రమేమిటంటే… స్పానిష్ పేరు తో పాపులర్ అయిన ఈ వైరస్ కూడాచైనా నుంచి వచ్చిందే.
మరి ఈ వైరస్ తెచ్చే జబ్బుకు స్పానిష్ ఫ్లూ అని ఎందుకు వచ్చింది?
అవి మొదటి ప్రపంచ యుద్ధంజోరుగా సాగుతున్నరోజులు. యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక యుద్ధం వల్ల జరుగుతున్న మారణకాండ ఇక తగ్గుతుందని అంతా ఆశిస్తున్నారు. అపుడే అకస్మాత్తుగా ఆకాశం నుంచి వూడిపడ్డట్లు ఇన్ ఫ్లుయంజా (Influenza) ప్రపంచం మీద దాడి చేసింది.
1918 ఏప్రిల్ నెలలో ఈ జబ్బు మొదలయింది. తర్వాత కేవలం 18 నెలల్లో ప్రపంచజనాభాలో 40 శాతం మందికి వ్యాధి సోకింది. ఒక లెక్క ప్రకారం ప్రపంచమంతా దాదాపు రెండుకోట్ల నుంచి 5కోట్ల మంది దాకా చనిపోయారు.
ఇది కూడా చదవండి

హైదరాబాద్ లో జనతా కర్ఫ్యూ (ఫోటో గ్యాలరీ)

ప్రపంచయుద్ధంలోచనిపోయింది కేవలం 1.7 కోట్టు. అంటే మొదటి ప్రపంచయుద్ధంకంటే ఎక్కువ మంది ఇన్ ఫ్లుయంజా వల్ల చనిపోయారు.
అమెరికా నుంచి యూరోప్ నుంచి అక్కడి నుంచి గ్రీన్ ల్యాండ్, ఫసిఫిక్ ఐల్యాండ్స్ , భారత్  దాకా ఈ జబ్బు అత్యంత వేగంగా వ్యాపించింది. 1918 సెప్టెంబర్ నాటికి ఇది పాండెమిక్ (Pandemic) అయిపోయి పతాక స్థాయికి చేరింది.
భారతదేశంతో సహా ప్రపంచదేశాలలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే, ఏదేశం ఎంతమంది చనిపోతున్నారో ఎవరికి తెలియడం లేదు. పత్రికల్లో వార్తలు కూడా రావడం లేదు. కారణం మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్నదేశాలుతో పాటు, ఆదేశాలకు మద్దతు ఇస్తున్న దేశాలలో మరణ వార్తలు ప్రచరించకుండా సెన్సార్ విధించారు. ఇలాప్రజలు, సైనికులు విపరీతంగా చనిపోతున్న వార్తలు పత్రికల్లో వస్తే ఆదేశ ప్రజల ఆందోళనకు గురవుతారని సెన్సార్ విధించారు.అందుకే ఏ దేశంలో కూడా ఇన్ ఫ్లుయంజా వల్ల చనిపోతున్న వారి వార్తలు రాలేదు.
అయితే, స్పెయిన్ మొదటిప్రపంచయుద్ధంలో ఏ కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండింది. దీనితో స్పెయిన్ లో ఈ జబ్బు వ్యాపించడం మీద విపరీతంగా వార్తలొచ్చాయి. ఆ వార్తలు అంతర్జాతీయ పత్రికల్లో కూడా వచ్చే వి.  చనిపోతున్నవారి వివరాలు పుంఖాను పుంఖాలుగా వెలువడేవి. వేల సంఖ్యలో ఇలా స్పెయిన్ ప్రజలు ఇన్ ఫ్లుయంజా తో చనిపోవడం అంతర్జాతీయంగా ప్రముఖ వార్త అయింది. దీనితో ప్రపంచమంతా ఒక అపోహ మొదలయింది. స్పెయిన్ కు ఏదో కొత్త జబ్బు సోకిందని, దాని తో వేల సంఖ్యలో చనిపోతున్నారనే ప్రచారం, చర్చ మొదలయింది.
1918 మే నాటికి స్పెయిన్ లో ఈ జబ్బు మహమ్మారిలా వ్యాపించింది. దానికితోడు మాడ్రిడ్ మహానగరం ఈ ఇన్ ప్లుజయంజా హాట్ స్పాట్ అయి కూచుంది. అంతేనా, దేశపు రాజు కింగ్ ఆల్పాన్సో XIII కు కూడా ఈ వ్యాధి సోకడంతో  అది అంతర్జాతీయ హెడ్ లైన్ లైంది. దీనితో ఈ జబ్బు స్పానిష్ ఫ్లూ (Spanish Flu) అని పిలువడం మొదలుపెట్టారు. దీనినే స్పానిష్ లేడీ అని కూడా పిల్లుస్తారు.

Like this story, pl share with a friend to encourage good journalism

ప్రపంచమంతా దీనిని స్పానిష్ ఫ్లూ అని పిలుస్తుంటే, స్పెయిన్ లో మాత్రం దీనిని ఫ్రెంచ్ ఫ్లూ అని పిలిచేవాళ్లుు. ఈ దిక్కుమాలిన రోగం తమ దేశానికి ఫ్రాన్స్ నుంచి వచ్చిందని వాళ్ల అనుమానం, అందుకే ఫ్రెంచ్ ఫ్లూ అని దీనిని కసిగా పిలవడం మొదలుపెట్టారు.
ఇంతకీ ఇదెక్కడ మొదలయింది?
మొదట్లో ఇది ఫ్రాన్స్ లోనో, అమెరికా లోనో, బ్రిటన్ లోనో చైనాలోనో మొదలయిందని భావించారు. స్పష్టంగా ఏదీ తేలలేదు. అమెరికా లో ఇది పుట్టిందని అనుమానించేందుకు కారణం ఈ వ్యాది మొదటి కేసు 1918 మార్చి 15న కాన్సాస్ మిలిటరీ బేస్ లో కనిపించడమే. అమెరికా ఆర్మీలో పనిచేసే అల్బర్ట్ గిచెల్ అనే సైనికుడికి మార్చి 4 వ లేదీన జలుబు దగ్గు, గొంతురాపిడి, జర్వం, తలనొప్పి వచ్చి మిలిటరీ ఆసుపత్రికి వచ్చాడు. మధ్యాహ్నానికి మరొక నూరు మంది ఇదే రోగ లక్షణాలతో ఆసుపత్రికి చేరారు. అంతే, ఈ మహమ్మారి అమెరికా మొత్తం వ్యాపించి దాదాపు 675000 మందిని చంపేసింది.
స్పెయిన్ లో ఇంకా విజృంభించడంతో 80లక్షల మంది చనిపోయారు. తాజా పరిశోధనల తర్వాత ఈ జబ్బు చైనా నుంచి వ్యాపించిందని కొనుగొన్నారు. అనేక రికార్డులను పరిశీలించాక కెనడా మెమోరియల్ విశ్వవిద్యాలయానికి చెందిన మార్క్ హంఫ్రీస్ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్న చైనా కూలీలు ఈ వ్యాధి వైరస్ నుంచి బయటికి మోసుకువచ్చారని చెప్పారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో చైనా కు చెందిన దాదాపు 96,000 మంది కూలీలు బ్రిటిష్ , ఫ్రెంచ్ లైన్స్ పనిచేస్తూ (Chinese Labour Corps) వచ్చారు. వీరినుంచే ఈ వ్యాధివ్యాపించిందిన ఆయన చెప్పారు. ‘వార్ ఇన్ హిస్టరీ’ ( War in History) జర్నల్ లో ‘ది లాస్ట్ ప్లేగ్ ’ (The Last Plague) పేరుతో ఆయన వ్యాసంరాస్తూ ఈ విషయం వెల్లడించారు. సుమారు 3 వేల మంది చైనా కూలీలు ఈ జబ్బుతో కెనడాలో మెడికల్ క్వారంటైన్ లో పడ్డారు. అయితే, చైనా వాళ్ల మీద వున్న వ్యతిరేకత తో దీనిని ఆరోజుల్లో చైనీస్ లేజీనెన్ (Chinese Laziness) అని ఎగతాళి చేసే వాళ్లు. కెనడా డాక్టర్లు వాళ్ల రోగాన్ని సీరియస్ గా తీసుకోనకపోవడానికి కారణం కూడా ఇదే. తర్వాత కూలీలు ఇక్కడి నుంచి ఫ్రాన్స్ కు వచ్చారు. అక్కడఇంకా పెద్ద సంఖ్యలో జబ్బు పడ్డారు.
స్పానిష్ ఫ్లూకి కారణం
రికార్డులెక్కిన మహమ్మారులలో 1918 ఇన్ ఫ్లుయంజా అత్యంత భయంకరమయినదనిచెబుతారు. దీనికి కారణం బర్డ్ ఫ్లూ వైరసే. అంటే H1N1 వైరస్. అప్పడు చనిపోయిన రోగుల ఊపిరితిత్తలు నుంచి సేకరించిన RNA తునకలను నాటి వైరస్ జీనోమ్ స్వరూపాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ జీనో మ్ 8 భాగాలున్నాయి.
ఈ వైరస్ మీద పరిశోధనలు చేసిన డెవిడ్ ఎమ్ మోరెన్స్ బ‌ృందం మాత్రం ఈ వ్యాధి ఎక్కడ మొదలయిందో తెలియదని పేర్కొన్నారు. కాకపోతే, ఇదిజన్యుపదార్ధాన్న బట్టి మొత్తానికిది పక్షులు (బాతుల వంటి నీటి పక్షలు నుంచే వచ్చిందని కనుగొన్నారు. అయితే, పక్షల నుంచి ఇది మనిషి లోకి ప్రవేశించి అక్కడ ఎలా గూడుకట్టుకుందో ఇంకా అర్థం కాలేదని వారు పేర్కొన్నారు.
ఇండియాలో స్పానిష్ ఫ్లూ
ఇండియాలో కూడా ఈ ఫ్లూ వల్ల విపరీతంగా చనిపోయారు. దాదాపు 1.7 నుంచి 1.8 కోట్ల దాకా చనిపోయి ఉంటారని ఒక అంచనా వేశారు. మహాత్మాగాంధీ కూడా ఈ వ్యాధి భారినపడ్డారు. అదృష్ట వశాత్తు సబర్మతీ ఆశ్రమంలో ఈ వ్యాధి సోకినవారంతా, గాంధీ తో సహా కోలుకున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్నపుడు , తనకు బతుకు మీదే విరక్తి వచ్చింది మహాత్మాగాంధీ బాధపడినట్లు సౌతిక్ బిశ్వాస్ బిబిసిలో రాశారు. భారదేశ జనాభాలో దాదాపు 6 శాతం ప్రజలు ఈ జబ్బుతో చనిపోయారని ఆయన రాశారు. గాంధీ భారతదేశానికి వచ్చిననాలుగునెలల్లో ఈ జబ్బు గుజరాత్ ను పట్టిపీడించింది.