చుట్టూర నీళ్లే… చుక్క అందవు సాగుకు: తిరుపతిలో రౌండ్ టేబుల్

రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాగునీటి వనరుల సమగ్ర వినియోగం అంశంపై తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. తిరుపతి న్యూ బాలాజి కాలని  పోలీసు పెరేడ్ గ్రౌండ్ దగ్గర, యూత్ హాస్టల్లో  12.8.2019 ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ప్రజా సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి వనరుల సమగ్ర వినియోగం అత్యంత కీలకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయం ఆధారిత రాష్ట్రం.
వ్యవసాయరంగ అభివృద్దికి కావలసిన మౌళిక వనరులైన వ్యవసాయయోగ్య భూమి, వాతావరణ పరిస్థితులు, మానవ వనరులు, అనేక చెరువులు మరియు కుంటలు, నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా తదితర అనేక నదులు ద్వారా వేలాది టి.ఎం.సీ.ల నీరు తదితర వనరులు ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా ఉన్నాయి.
ఈ మౌళిక వనరుల సమగ్ర వినియోగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉన్నప్పటికీ, సాగునీటి వినియోగంలో కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకోవలసి ఉన్నది.
ఇన్ని నీటి వనరులున్నప్పటికి ఒక వైపు పొలాలకు నీళ్ళందక పంటలు ఎండి పోవడం, మరొక వైపు వేలాది టి.ఎం.సీ. ల నీరు కృష్ణా, గోదావరి, వంశధార నదుల ద్వారా సముద్రం పాలౌతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రాంతాల వారి నీటి సమస్యలపై చర్చించి, సాగునీటి వనరులు సమగ్ర వినియోగంతో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి పరిష్కారాలను రూపొందించే దిశగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది‌. ,
సమావేశ తీర్మాణాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి సాగునీటి వనరుల సమగ్ర వినియోగంతో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టెలాగ నిర్మాణాత్మకంగా వ్యవహరించే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడమైనది.
ఈ సమావేశంలో రాయలసీమలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయపార్టీల, స్వతంత్ర రైతు సంఘాల తదితర నాయకులు పాల్గొంటున్నారని  రాయలసీమ సాగునీటి సాధన సమితి
కోరుతున్నది
(ఫీచర్ ఫోటో:ఆగష్టు 12 న తిరుపతిలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి నంద్యాల నుండి బయలు దేరిన రాయలసీమ సాగునీటి సాధన సమితి సభ్యులు)