తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు: కేసిఆర్

 

‌భారాస అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌ పథకం అమలుచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి, బి ఆర్ ఎస్ సంస్థాపకుడు కేసీఆర్ పునరుద్ఘాటించారు.

నేడు జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రైవేటీకరణ ను తాము రద్దు చేస్తామని కూడా ప్రకటించారు. ఎల్ ఐ సి ప్రైవేటీకరణ ఉండదని, ఒక వేళ మోడీ చేస్తే, తాము మళ్ళీ జాతీయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని తెలిపారు.

దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కానీ, కేవలం 20వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. బకెట్‌ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాస్తోంది. చైనాలో 5వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ ఉంది. మన దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్‌ ఉందా?

రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చింది. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు కాదా?. రూ.లక్ష కోట్ల విలువైన పామాయిల్‌ దిగుమతి చేసుకుంటున్నాం. దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయింది.

ఈదేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ 4.10లక్షల మెగావాట్లు. దేశం ఎప్పుడూ కూడా 2.10లక్షల కోట్ల మెగావాట్లు మించి వాడలేదు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి. వీటన్నింటిని రూపుమాపేందుకే భారాస ఆవిర్భవించింది.

దేశ దుస్థితికి కాంగ్రెస్‌, భాజపానే కారణం. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే భాజపాను తిడుతుంది. భాజపా అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుంది. భారాస అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్‌ను తయారు చేస్తాం.

దేశంలో రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వాల్సిందే. భారాస అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌ ఇస్తాం. రైతు బంధు స్కీమ్‌ దేశమంతా అమలు చేయాలన్నదే భారాస విధానం. ఎన్‌పీఏల పేరుతో రూ.14లక్షల కోట్లు దోచి పెట్టారు

కేసీఆర్ ప్రసంగం లోని  మరిన్ని ముఖ్యాంశాలు:

‌నష్టాలు సమాజానికి.. లాభాలు ప్రైవేటు వ్యక్తులకా?

కేసీఆర్‌ఎల్‌ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా?

ఎల్‌ఐసీ కోసం భారాస
పోరాడుతుంది.

ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు భారాసను బలపరచాలి:

కరెంటు కార్మికులారా? పిడికిలి బిగించండి:

విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం:

ఇంకా దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది:

అవసరం ఉన్నచోట వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం:

దళితబంధును దేశమంతా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా:

మీరు ఇవ్వకపోతే మేము దేశమంతా దళితబంధు ఇస్తాం:

‌దేశంలో మతపిచ్చి లేపుతున్నారు:

విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వం:

విశాఖ ఉక్కును మోదీ అమ్మితే మేము అధికారంలోకి వచ్చాక కొంటాం:

‌లొడలొడ మాట్లాడే ప్రధానికి మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా?:

మేక్ ఇన్‌ ఇండియా.. జోక్‌ ఇన్‌ ఇండియాగా మారింది:

అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం: క

కొద్దిరోజుల్లోనే భారాస విధానాలు ప్రజల ముందుంచుతాం:

150 మంది మేధావులు భారాస విధానాలు రూపొందిస్తున్నారు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *