కెసిఆర్ నేషనలైజేషన్ నినాదం గొప్ప మలుపా!

“బిజేపీ ది ప్రయివేటైజేషన్  మాది నేషనలైజేషన్: కెసిఆర్.

– బి ఎస్ రాములు

ఈ నినాదం దేశాన్ని మలుపుతుంది.
” దేశానికి దిక్సూచి తెలంగాణ”
నేను రాసిన పుస్తకం పేరు.
ఇలా 30 ఏళ్లుగా సాగిన ప్రయివేటీకరణ
వల్ల జరిగి పోయిన నష్టాలకు
నేషనలైజేషన్ ఒక పరిష్కారం చూపుతుంది.
ఉపాధి కల్పన దృష్టి పెరుగుతుంది.
ప్రయివేటీకరణలో లక్షలాది మంది
ఉద్యోగాలు ఉపాధి
కోల్పోయారు.
ప్రయివేటీకరణలో లాభాల దృష్టి తప్ప
సమాజ సంక్షేమం దృష్టి అప్రధానం.
నేషనలైజేషన్ల్ లో సామాజిక సంక్షేమం
ఉపాధి కల్పన దేశాభివృద్ది ప్రధానం.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భారీ పరిశ్రమలను
భూమిని జాతీయం చేయాలన్నారు.
ప్రయివేటీకరణలో రిజర్వేషన్లు లేక
సామాజిక సమతుల్యత దెబ్బ తిన్నది.
సామాజిక వర్గాల మధ్య అసమానతలు
పెరిగి కొత్త శక్తితో వర్ణ కులవివక్షలు పెరిగాయి.
70 శాతం ప్రజల
రిజర్వేషన్ లను తొలగిస్తూ ఆచరణ నిరాకరిస్తూ
రావడం వల్ల సామాజిక సమైక్యత బదులు
వారి మధ్య అగాధం పెరిగింది.
పేదరికం , విద్య ఉద్యోగ ఉపాధి వైద్యం సమస్యలను
పక్కదారి పట్టిస్తూ మత వైషమ్యాలవైపు మళ్లించారు.
నేషనలైజేషన్ వల్ల సామాజిక అభివృద్ది సాగుతుంది.
బీజేపీ గానీ దాని మాతృ సంస్థ జనసంఘ్, ఆర్ ఎస్ ఎసెస్ గాని
మొదటినుండి ప్రయివేటీకరణకే మద్దతు.
బి.జేపీ ఆర్. ఎస్ ఎస్
అలాంటి పెట్టుబడిదారులు పారిశ్రమిక వేత్తలు
మర్వాడీ గుజరాతీ సేట్ల ప్రయోజనాల కోసం కట్టుబడి
ఉంటాయి. వారి పోషకులు వారే.
ప్రపంచీకరణ 1991 లో మొదలయ్యాక
ప్రయివేటీకరణ కు ప్రాధాన్యత నిచ్చిన చాలా దేశాలు
జాతీయ ప్రయోజనాల కోసం సోషలిస్ట్
మార్ంలో సామాజిక భద్రత, రైతులకు
సబ్సిడీలు ఉచిత విద్య ఉచిత వైద్యం
వృద్దాప్య పెన్షన్లు కనీస కూలీ మద్దతు ధరలు
మొదలైనవి కొనసాగిస్తున్నాయి. యూరప్ దేశాల్లో
ఆస్ట్రేలియా దేశాల్లో ఈ విధానం ద్వారా
ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి.
తాము అధికారంలకి వస్తే ప్రయివేటీకరించిన వాటిని తిరిగి కొంటాం
అనే ప్రకటన ప్రత్యక్ష యుద్దాన్ని ప్రకటించడమే.
రైతు బంధు, దళిత బంధు, రైతులకు ఉచిత విద్యుత్తు
నినాదాలు ఉత్రాది ి ఊపేస్తాయి.
మత రాజకీయాలనుండి సామాజిక సంక్షేమ ఆర్థిక
రాజకీయాలపై ప్రజల దృష్టి పెరుగుతుంది.
యం ఐ యం నాయకులు అసదొద్దీన్
హజ్ యాత్ర సబ్సిడీ రద్దు చేసి ముస్లిం బాలికల
విద్యాభివృద్దికి కెటాయించాలని కోరడం మత రాజకీయాల నుండి
ప్రజల వైపు దృష్టి పెరుగుతున్నదనడానికి నిదర్శనం.
కనుక ఇక నుండి బిజేపీ గెలవడానికి అనుకూలంగా
ఇంతదాకా పోటీ చేస్తూ వస్తున్న యం ఐ యం
సెక్యులర్ మధ్యేవాద పార్టీలు
గెలవడానికనుకూలంగా కలిసి పని చేస్తుందని అర్థమవుతున్నది.
ఇలా రాజకీయాల్లో సామమాజిక కోణం ముందుకు
రావడం సంతోషించాల్సిన విషయం.
కేసీఆర్ 150 మంది మేధావులతో దేశ రాజకీయ
సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో రావలసిన
మార్పులకోసం ఒక బృందం పని చేస్తున్నదన్నారు. .
ఆ మేధావుల బృందం దేశరాజకీయాల్లో నినాదాల్లో
అనేక మార్పులు తెస్తుందనడంలో సందేహం లేదు.
గతంలో తెలంగాణ ఉద్యమంలో ఇలా
మేధావుల బృందాలు చేసిన సూచనలు కేసీఆర్
మేధో మదనం నుండి 410 పైగా చిన్నా పెద్దా పథకాలు రూపు దిద్దుకున్నాయి.
కే సీ ఆర్ అమ్ముల పొదిలో 70 వేల టియంసీలు వృధాపోతున్న నదీజలాలు
వంటి బ్హ్రహాస్త్రాలు చాలానే వున్నాయి.
నామ మాత్రంగా మిగిలిన వామ పక్షాలు పూర్వ వైభవంలోకి రావడానికి
కూడా నేషనలైజేషన్ నినాదం అద్భుతంగా ఉపయోగ పడుతుంది.
రాజకీయాల్లో మేధావుల సూచనలు స్వీకరించడంలో కేసీఆర్ తనకు తానే సాటి
అనిపించుకున్నారనిపిస్తుంది.
మొత్తానికి ఖమ్మం భారత రాష్ట్ర సమితి
జాతీయ రాజకీయ రంగంలో గొప్ప ప్రారంభం.
కేసీఆర్ గారికి సభ ను జయ ప్రదం చేసిన వారికి
నైతిక మద్దతుగా వచ్చిన అరవింద్ కేజ్రీవాల్,
అఖిలేష్ యాదవ్, పినయరవి, డి రాజాగారలకు
అభినందనలు

(– బి ఎస్ రాములు,తెలంగాణ ఉద్యమ కారులు
బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *