‘క్రాక్’హిందీ రీమేక్ ..హీరో ఫిక్స్

2021 సంక్రాంతి కానుకగా విడుదలైన రవితేజ చిత్రం క్రాక్.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా  హిందీలో రీమేక్  కాబోతోందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులు  భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. అంతేకాదు అక్కడ ఈ రీమేక్స్‌లో నటించే హీరో  కూడా ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది.

‘క్రాక్’లో రవితేజ పోషించిన పోలీస్ పాత్ర రణబీర్ తో చేయబోతున్నట్లు వినికిడి. రణబీర్ లోని కామెడీ టైమింగ్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీ రీమేక్ రైట్స్ కోసం ఇప్పటికే నిర్మాత బి.మధును  సంప్రదించారని.. ప్రస్తుతం వారిద్దరి మధ్య బేరసారాలు జరుగుతున్నాయని టాక్. మరి ఈ వార్త నిజమే అయితే త్వరలో ‘క్రాక్’ రీమేక్ మొదలైపోతుంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయబోతున్నారట. అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ వార్తలో నిజమెంతో చెప్పలేం.

సినిమా ప్రారంభం నుంచీ చివరి వరకూ ఎక్కడా ఆగకుండా.. ఆపకుండా వినోదాన్ని పంచింది క్రాక్ సినిమా. కథ ఇదీ.. వీర శంకర్ (రవితేజ) ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. భార్య (శృతిహాసన్),ముద్దులొలికే కొడుకుతో సరదాగా జీవితం సాగిపోతుంది. ఇదే సమయంలో కర్నూలులో టెర్రరిస్ట్ (చిరాగ్ జానీ), ఒంగోలులో కటారి కృష్ణ (సముద్రఖని), కడపలో రౌడీ (రవి శంకర్) లను తన విధుల్లో భాగంగా పట్టుకుంటాడు. దీంతో ఈ ముగ్గురితో వైరం ఏర్పడుతుంది. మరి ఆ వైరం ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో.. క్రాక్ చూడాల్సిందే.

సినిమాలో అన్ని అంశాలు పూర్తిగా మాస్ దృష్టిలో పెట్టుకునే చేశారు. ఫైట్స్ సినిమాకి ప్రత్యేకంగా ఉన్నాయి. రాంరాం-లక్ష్మణ్ అందియించిన స్టంట్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‍ సీన్లో టెంపుల్‍ ఫైట్‍, బస్టాండ్‍లో ఫైట్‍ ఈ సినిమాకు హైలైట్‍గా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *