ప్రాజెక్ట్ K’ ఎప్పుడంటే? స్పెషల్  అప్ డేట్..

ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ‘ప్రాజెక్టు K’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మహానటి వంటి సూపర్ హిట్ ఇచ్చిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మితమవుతోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథలో సూపర్ హీరో పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే..ఈ సినిమాకి సంబంధించి ఒకటి రెండు స్టిల్స్ తప్ప, వేరే అప్ డేట్స్ ఇంతవరకూ బయటికి రాలేదు. దాంతో ప్రభాస్ లుక్ ఎలా ఉండనుంది? టైటిల్ ఎలా ఉండబోతోంది? అనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ప్రభాస్ పాత్రను నాగ్ అశ్విన్ ఎలా డిజైన్ చేశాడా? అనే విషయంపై కూడా అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుంచి అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని  వినిపిస్తోంది. ప్రభాస్ లుక్ తో పాటు .. టైటిల్ ను కూడా రివీల్ చేయొచ్చని అంటున్నారు. అయితే అదేం లేదు.. ప్రభాస్ పుట్టిన రోజైన జనవరి 5 న ఈ చిత్రానికి సంభందించిన అప్డేట్ వస్తుందని మరికొందరు అంటున్నారు. ఏదైమైనా జనవరి ఫస్ట్ వీక్ లో అప్డేట్ అయితే ఖాయం గా వస్తుంది.  దీపిక పదుకొణె  హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, కీలకమైన పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు.

ఆయన నటిస్తున్న ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుంది. సలార్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఓ మూతబడ్డ థియేటర్ చుట్టూ సాగే హారర్ కామెడీ చిత్రం ఇది.  రాజా డీలక్స్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్ పాత్రలను పోషిస్తున్నారు. 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *