కథ వెనుక కథ’ టైటిల్.. ఫస్ట్ లుక్ లాంచ్

విశ్వంత్ దుద్దుంపూడి శ్రీజిత ఘోష్‌, శుభ శ్రీ హీరో హీరోయిన్లుగా సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో  దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్స్‌ ప్రొడక్ష‌న్ నెం.1గా దండమూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కథ వెనుక కథ’.కృష్ణ చైత‌న్య దర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ లాంచ్ మరియు ఫస్ట్ లుక్‌ని గురువారం  ప్రసాద్ ల్యాబ్య్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా…

నిర్మాత దండమూడి అవనింద్ర కుమార్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాం. ట్విస్టులు బాగున్నాయి. మీడియా ఈ చిత్రాన్ని చూసి సహకరించాలి. ఇకపై అన్ని భాషల్లో చిత్రాలను తెరకెక్కిస్తాం. ప్రేక్షకులందరికీ వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాం. సినిమా కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి ఎంతో కష్టపడ్డాడు. చిత్రానికి పని చేసిన అందరికీ థాంక్స్. అలీ, సుమన్ ఇలా అందరూ చక్కగా నటించారు. పాటలు అద్భుతంగా వచ్చాయి’’ అని అన్నారు.

సునీల్ మాట్లాడుతూ ‘‘కథ వెనుక కథ’లో చాలా కథలుంటాయి. స్క్రీన్ ప్లే బాగుంటుంది. నాకు మంచి పవర్ ఫుల్ పాత్ర దొరికింది. డీబీఓ (దండమూడి బాక్సాఫీస్) అని చూస్తే హెచ్‌బీఓ గుర్తొచ్చింది. హెచ్‌బీవో స్థాయిలో డీబీఓ సక్సెస్ అవ్వాలి. సినిమాలో నాకు మంచి పాత్రను ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమా వల్ల వందల కుటుంబాలు బాగుంటాయి. సినిమా హిట్ అయితే వేల కుటుంబాలు బాగుపడుతాయి’’ అని అన్నారు.

కమెడియన్ అలీ మాట్లాడుతూ ‘‘దండమూడి అవనింద్ర కుమార్ గారిది గోల్డెన్ హ్యాండ్‌. ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. సినిమా హిట్ అయితేనే డబ్బులు వస్తాయి. కానీ డబ్బుల కోసం ఆలోచించకుండా సినిమాలు తీస్తూనే ఉంటాను అని చెబుతున్నారు. గొట్టిపాటి సాయి గారిని నిర్మాతగా చేశారు. అనుకున్న బడ్జెట్‌లో అద్భుతంగా సినిమాను నిర్మించారు. కథ వెనుక కథ మంచి కథ. డైరెక్టర్ చైతన్య కృష్ణకు ఈ కథ బాగా నచ్చింది. నాకు కథ చెప్పిన వెంటనే నచ్చింది. అవనింద్ర కుమార్ గారు కరోనా సమయంలో ఆయుర్వేద మందు తయారు చేసి పదిలక్షల మందికి పంచారు. సినిమా బాగుందంటే జనాలు ఆదరిస్తారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’’ అని అన్నారు.

రఘుబాబు మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్ అంతా కూడా సరదాగా సాగింది. టీం అందరినీ చక్కగా చూసుకున్నారు. దండమూరి బాక్సాఫీస్ తీసే ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాలి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి ఫోన్ చేసి వరుసగా ఐదు సినిమాలు ప్లాన్ చేశామని అన్నారు. మూవీ మొఘల్ రామానాయుడిలా దండమూడి అవనింద్ర కుమార్ ఎన్నో గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

బెనర్జీ మాట్లాడుతూ ‘‘దండమూడి గారిది గోల్డెన్ హ్యాండ్. సాయితో నాకు ఎన్నో ఏళ్ల పరిచయం ఉంది. అతను మంచి స్థాయిలో ఉండాలని మేం అంతా కూడా కోరుకుంటాం. చాలా తక్కువ సమయంలోనే దండమూడి గారితో స్నేహం ఏర్పడింది.  మా అందరినీ ఎంతో చక్కగా చూసుకున్నారు. మా డైరెక్టర్ కృష్ణ చైతన్య ఎంతో గొప్పగా సినిమాను తీశారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘‘దండమూడి గారు వంద సినిమాలు తీయగల సత్తా ఉన్న వ్యక్తి. ఆయనకు వెన్నుదన్నుగా ఉన్న సాయి గారి జడ్జ్మెంట్ బాగుంటుంది’’ అని అన్నారు.

హీరో దుద్దుంపూడి విశ్వంత్ మాట్లాడుతూ ‘‘కథ వెనుక కథ టైటిల్ వెనుక ఎన్నో కథలున్నాయి. అందరి జీవితాల్లో ఎన్నో కథలుంటాయి. మా నిర్మాత వెనుకున్న కథ ఎందరికో స్పూర్తిగా ఉంటుంది. మా డైరెక్టర్ కృష్ణ చైతన్యతో నాకు ఎన్నో ఏళ్ల పరిచయం ఉంది. మా కెమెరామెన్ శేఖర్‌ అద్భుతంగా విజువల్స్ అందించారు. ఆలీ, సునీల్, రఘుబాబు వంటి వారితో నటించడం ఆనందంగా ఉంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి గారితోనే ఈ సినిమా మొదలైంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాతో గట్టిగా కొట్టబోతోన్నాం’’ అని అన్నారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ ‘‘దండమూడి అవనింద్ర గారితో నాకు దాదాపు 35 ఏళ్ల పరిచయం ఉంది. ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేసి రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయుర్వేద వైద్యులు కూడా. కరోనా సయమంలోనూ అందరికీ మందులు పంచారు. కథ వెనుక కథ టైటిల్ బాగుంది. దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ పేరు బాగుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి, డైరెక్టర్ కృష్ణ చైతన్యలకు విజయం చేకూరాలి. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా విజయం అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ ‘‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. విశ్వంత్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. అలీ గారి వల్లే ఈ చాన్స్ వచ్చింది. తెలుగు సినిమాలో పని చేయడం నాకు సంతోషంగా ఉంది. ప్రేక్షకుల ప్రేమ, సపోర్ట్ నాపై ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

హీరోయిన్ శుభశ్రీ మాట్లాడుతూ ‘‘కథ వెనుక కథ నాకు రెండో సినిమా. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఇంత మంది నటీనటులతో పని చేయడం ఆనందంగా ఉంది. సెట్‌లో ఎంతో సరదాగా షూటింగ్ జరిగేది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అని అన్నారు.

న‌టీన‌టులు:

విశ్వంత్ దుద్దుం పూడి, శ్రీజిత ఘోష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య‌ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘుబాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ ఈరోజుల్లో సాయి, రూప తదిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌:  దండ‌మూరి బాక్సాఫీస్‌, సాయి స్ర‌వంతి మూవీస్‌, నిర్మాత‌: దండ‌మూడి అవ‌నింద్ర కుమార్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  గొట్టిపాటి సాయి, క‌థ‌- మాట‌లు-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం:  కృష్ణ చైత‌న్య‌, సినిమాటోగ్ర‌ఫీ: గంగ‌న‌మోని శేఖ‌ర్‌, ఈశ్వ‌ర్‌, మ్యూజిక్‌:  శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌, ఎడిటింగ్: అమ‌ర్ రెడ్డి కుడుముల‌, ఆర్ట్‌:  వెంక‌ట్ స‌ల‌పు, కొరియోగ్ర‌ఫీ:  భాను, లిరిక్స్‌:   కాస‌ర్ల శ్యామ్‌, పూర్ణా చారి, ఫైట్స్:  అంజి, రియ‌ల్ స‌తీష్‌, ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  కృష్ణ ప్ర‌సాద్‌, పి.ఆర్‌.ఒ:  నాయుడు – ఫ‌ణి (బియాండ్ మీడియా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *