ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేఖ రాయండి: రైతుల పిలుపు

రైతుల పోస్ట్ కార్డు ఉద్యమానికి మీ మద్దతు కావాలి… తెలంగాణ రైతు స్వరాజ్య వేదిక పిలుపు.

 

మూడు సంవత్సరాల నుండి లక్షలాది మంది రైతులు కోట్లాది రూపాయలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయారు,అయినా ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టటం లేదు.దేశంలో పంటల బీమా అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ.

పంటల బీమా పథకం అమలు చేయాలని 2020 నుండీ రైతు స్వరాజ్య వేదిక పోరాడుతూనే ఉంది.హై కోర్ట్ లో కేసు వేసి మంచి తీర్పు సాధించింది.. కానీ ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయకుండా సుప్రీంకోర్టు కు వెళ్ళింది.మనం కూడా సుప్రీంకోర్టు కు వెళ్ళాము. ఇప్పుడు కేసు అక్కడ నడుస్తుంది.

అయినా ప్రతి సంవత్సరం ఫీల్డ్ లో రైతులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా దారుణంగా నష్టపోతున్నారు. ఈ 2022 లో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే లక్ష ఎకరాలలో పంట నడతపోయినట్టు మేము దాఖలు చేసిన RTI కి జవాబు వచ్చింది.

ఇటు వంటి పరిస్థితులలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచటానికి,మిగిలిన సమాజానికి తెలిసే విధంగా ముఖ్యమంత్రి గారికి తమ సమస్యను వివరిస్తూ వేలాదిగా పోస్ట్ కార్డులు వేయాలని కోరుకుంటూ ఉన్నారు..రైతుల పక్షాన మీరందరూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాం..

 

ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డ్ రాయడానికి మాటర్ ( మోడల్):

ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి,
నమస్కారం.గత మూడు సంవత్సరాలలో నేను పండించిన పంట భారీవర్షాల వలన నష్ట పోయాను. ఎటువంటి నష్ట పరిహారం( ఇన్ పుట్ సబ్సిడీ) కానీ,పంట బీమా పరిహారం కానీ రాలేదు. ఫలితంగా అప్పులు పెరిగిపోయాయి.
మేము ప్రభుత్వాన్ని ఈ క్రింది కోర్కెలు కోరుతున్నాం.
1. పంట మద్యం జరిగిన వెంటనే అధికారులు గ్రామాలు తిరిగి,నష్ట పోయిన రైతుల జాబితా తయారు చేయాలి. త్వరగా నష్ట పరిహారం అందించాలి.
2. వెంటనే మంచి పంటల బీమా పథకం అన్ని పంటలకు తక్కువ ప్రీమియం తో అమలు చేయాలి.
ఇట్లు,

(సంతకం)

పేరు:
గ్రామం:
మండలం:
జిల్లా:

పోస్ట్ కార్డు పంపవలసిన చిరునామా:

శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు,
రాష్ట్ర ముఖ్యమంత్రి,
ముఖ్యమంత్రి కార్యాలయం,
ప్రగతి భవన్, పంజాగుట్ట,
హైదరాబాద్ ,తెలంగాణ

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *