కెసిఆర్ కు శివాజీ స్ఫూర్తి…

తెలంగాణ సాధించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె హరీష్ రావు అన్నారు. శివాజీ ది అహింసా మార్గం, అలాగే తెలంగాణ సాధనంలో కెసిఆర్ ది అహింసా మార్గం అని హరీష్ రావు కొనియాడారు.

ఈ రోజు  బాసర జంక్షన్ లో  చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి కొద్ది సేపటి కిందటఆవిష్కరించారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు శివాజీ ప్రాముఖ్యమేమిటో హరీష్ రావు వివరించారు.

ఆయన ఏమన్నారంటే…

బాసర జంక్షన్లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరం. పరిపాలన, యుద్ద నైపుణ్యం లో అన్నింటా శివాజీ ఆదర్శం. మత సామర్యాన్ని చాటారు.ప్రజలే ప్రభువులుగా పాలించారు.

శివాజీ ఎన్నో యుద్దాలు చేసినా హింసను ప్రోత్సహించలేదు. పవిత్ర స్థలాలు ధ్వంసం చేయలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడంలో శివాజీ గారు స్ఫూర్తి. అహింసా మార్గంలో 14 ఏళ్లు పోరాటం చేసి  తెలంగాణ సాధించి  అద్భుత పాలన అందిస్తున్నారు.

అభివృద్ధిలో తెలంగాణ దేశానికి మోడల్ దేశానికి అయ్యింది. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు ఇక్కడి పథకాలు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.

స్థానిక ప్రతినిధుల కోరిక మేరకు బాసర పి హెచ్ సి కి అంబులెన్స్ మంజూరు చేస్తున్నం.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..
బాసర అమ్మవారిని మంత్రి హరీశ్ రావు దర్శనం చేసుకొని, శివాజీ విగ్రహాన్ని ప్రారంబించడం సంతోషంగా ఉంది. బాసర దేవాలయాన్ని ప్రభుత్వం వంద కోట్లతో అభివృద్ధి చేయనున్నది. రాబోయే రోజుల్లో బాసర పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *