‘అమరావతి రాజధాని నిర్ణయం ఎవరిది?

“రాజధానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమి చేయలేడంటూ తమ అభిమాతాన్ని వెల్లడిస్తున్నారు.”

 

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి

కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమరావతి రాజధాని పదం వాడింది ఇంకేముంది అమరావతి అభిమాన మీడియా ప్రచారం మొదలు పెట్టింది.

రాజధానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమి చేయలేడంటూ తమ అభిమాతాన్ని వెల్లడిస్తున్నారు.

జరిగింది ఏమిటి.

కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సచివాలయ నిర్మాణ ప్రస్తావన చేసింది. అంచనా వ్యయానికి, కేటాయింపుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్ర సచివాలయం నిర్మాణ వ్యయ అంచనా రు.1,214.19 కోట్లుగా పేర్కొంటూ 2022-23 వార్షిక బడ్జెట్ లో కేటాయిపు లక్ష రూపాయలు చేశారు. కేంద్ర సచివాలయంకు కావలసిన భూ సేకరణకు రు.6.69 కోట్లు వ్యయ అంచనాగా పేర్కొని, ఇప్పటికే రు.4.48 కోట్లు ఖర్చు చేశామని, 2022-23 వార్షిక బడ్జెట్ లో లక్ష రూపాయలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు అందులోనూ సచివాలయ నిర్మాణానికి సంబంధించనది కనుక కేంద్రం నిర్ణయం తీసుకుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్యాలయాలకు నిధులు ఖర్చు చేయాలి. గత ప్రభుత్వం అమరావతి కేంద్రంగా చట్టంలో పేర్కొన్న కార్యాలయాలకు నిధులు మంజూరు చేయాలని తన ప్రతిపాదనలు పంపింది. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సినది 1214 లక్షల రూపాయల వ్యయ అంచనాకు కేటాయించిన నిధులను కేవలం ఒక లక్ష రూపాయలు.

రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. కనుకనే పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయలేదు. దీన్ని కేంద్రం సాధారణ రాజకీయ భాషలో చెప్పదు. పాలనా భాషలో చెప్పకనే చెప్పింది.

రాజధాని నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధి అని అందులో తమ పాత్ర ఉండదని ఒకటికి రెండుసార్లు హైకోర్టులో ఆఫీడివిట్ రూపంలో చెప్పింది.

అమరావతే సర్వస్వంగా భావించే కొన్ని మీడియా సంస్థలు అది తప్పు అని తమ ఛానల్ చర్చలలో పాల్లోనే అనధికారిక వ్యక్తులు చెపుతున్న మాటాలు అత్యంత కీలకమని తీర్పు ఇస్తున్నాయి. తమ అభిమాతమే అందరి నిర్ణయంగా కూడా తీర్పులు చెపుతున్నాయి.

రాజధాని విషయంలో అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు కానీ అసత్యాలు , వక్రీకరణ చేయడం సరికాదు. తిరుపతిలో రాయలసీమ ఆకాంక్షలలో అమరావతిని చూపించిన సదరు మీడియా రాజధాని కార్యాలయాలకు నిధులు విడుదల చేసిన సాంకేతిక అంశం ఆధారంగా అమరావతిని చూపించడం సహజమే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *