సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి, ఒకటే జనం

 

పీసీసీ అధ్యక్షులు అయ్యాక మొదటిసారి తన సొంత జిల్లా పాలమూరు జిల్లాకు వచ్చిన రేవంత్ రెడ్డి..అమిస్తాపూర్ జంగ్ సైరన్ సభలో  టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. ఇందులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, వర్కింగ్ ప్రసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, గీతా రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, డీసీసీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్,శివసేనరెడ్డి, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సభ కు  రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చారు.

సభలో రేవంత్ ఏమన్నారంటే

కాంగ్రెస్ పార్టీకి నేను అధ్యక్షున్ని అయినా నేను పాలమూరు బిడ్డ నే..

ఇక్కడ నుంచి బూర్గుల రామకృషరావ్, జైపాల్ రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, మల్లు ఆనంత రాములు లుగా అభివృద్ధి చెందేలా చెయ్యాలి.

4 వేల కోట్ల రూపాయల ఫీజ్ రియంబేర్స్మెంట్ ఇవ్వాలన్నా, లాక్షా 91 వేల ఉద్యోగాలు ఇవ్వాలన్నా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నా..

ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ అన్ని సీట్లు గెలిపించాలి..

పోలీస్ లకు హెచ్చరిక చేస్తున్న.. కాంగ్రేస్ కార్యకర్తలను వేధిస్తున్న వారిని వారి పేర్లు రాసి.పెట్టుకుంటాం..

మేం అధికారంలోకి వచ్చాక.కేసీఆర్ ను పండపెట్టి తిక్కుతామ్..

మా కార్యకర్తలను వేధిస్తే గువ్వలను, గబ్బిలాలను లాగులల్ల తొండలు విడిచి కొడతాం.. జాగ్రత్త..

మాజీ మంత్రి జి   చిన్నారెడ్డి వ్యాఖ్య:

హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు.. ఆయన కూడా పాలమూరు వాసి.మరోసారి పాలమూరు నుంచి సీఎం అయ్యే అవకాశం వస్తుంది. రేవంత్ రెడ్డి సీఎం అవుతారు. ఆయన సీఎం అయ్యాక పాలమూరు లో సాగునీటి సమస్య పరిష్కారం చెయ్యాలి. జూరాల నుంచి నేరుగా కాలువ తెచ్చి పాలమూరు, రంగారెడ్డి జిల్లా ప్రజల సాగునీరు అవసరాలు తీర్చాలి.

మాజీ ఎంపీ మధుయాష్కీ వ్యాఖ్య

రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ నుంచి ఎంపీ గా, పీసీసీ అధ్యక్షులుగా నియామకం అయ్యారు.రేవంత్ రెడ్డి ని అందరూ ఆశీర్వదించి అండగా ఉండాలి.పాత పాలమూరు జిల్లాలో 14 నియోజక వర్గాలు గెలిపించి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలి. భట్టి విక్రమార్క అసెంబ్లీలో అవినీతిపై నిలదీశారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురు అవినీతికి పాల్పడుతున్నారు. విద్యార్థి, నిరుద్యోగుల బాగు కోసం కాంగ్రెస్ ఉద్యమిస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పోరాటం చేస్తుంది.

సీఎల్పీ నేత భట్టి కామెంట్స్

పాలమూరు గడ్డ మీద జంగ్ సైరన్ సభ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఉద్యోగాల కోసం, విద్య కోసం, నదీ జలాల కోసం ఇంకా అనేక వనరుల కోసం ఈ తెలంగాణ తెచుకున్నాం.ఏడేళ్ళ నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈ పాలకులు

నీళ్ల కోసం ఈ తెలంగాణ తెచ్చుకుంటే కృష్ణ నది మీద కట్టాల్సిన ఒక్క ప్రాజెక్టు కేసీఆర్ కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లాంటి అనేక ప్రాజెక్టులు కట్టింది.కృష్ణ మీద పక్క రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఏడాది కాలంగా నిద్ర పోతున్నాడు. కృష్ణ జలాలు తెలంగాణ లేకుండా చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ లతో కేసీఆర్ చర్చించాలి..లేకపోతే నది జలాల విషయంలో కృష్ణ పరివాహక ప్రాంతాలలో ఉన్న అన్ని జిల్లాల్లో నష్టపోతాయి. విద్య, ఉద్యోగ, నదీజలాల విషయాలలో పోరాటం చేయడం కోసమే ఈ పోరాటం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *