ఉత్తర తెలంగాణలో రెడ్ ఎలెర్ట్

*రాష్ట్రం లో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల అప్రమత్తం

*కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్

ఈ రాత్రి నుండి మంగళవారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణా జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణా జిల్లాలకు ఆరెంజ్ అల్లర్ట్ గా ప్రకటించారు. తెలిపారు.

నేటి రాత్రి నుండి మరో రెండు రోజుల పాటు గులాబ్ తూఫాన్ ప్రభావం రాష్ట్రం మొత్తంపై ఉన్నందున ప్రతీ జిల్లా కలెక్టరేట్ లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గులాబ్ ప్రభావం రీత్యా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొమేశ్ కుమార్ హెచ్చరించారు.

అయన ఈరొజూ జిల్లా కలెక్టర్ల తో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

న్యూ ఢిల్లీ లో జరిగిన సి.ఎం ల సమావేశంలో పాల్గొనడానికి సి,ఎం కేసీఆర్ తో వెళ్లిన సోమేశ్ కుమార్ అక్కడనుండి నుండే కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లా కలెక్టర్లలతో పాటు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్, ఇంధన శాఖ కార్య దర్శి సందీప్ సుల్తానియా లి కూడా పాల్గొన్నారు..

జిల్లాల్లో పోలీస్ ఇతర లైన్ డిపార్ట్మెంట్ లతో సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాలపట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు, తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా వహించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. అవసరమైతే ఎన్.డీ.ఆర్.ఎఫ్. సేవలను పొందాలని,. ప్రస్తుతం వరంగల్, హైదరాబాద్, కొత్తగూడెంలలో ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలున్నాయని పేర్కొన్నారు.

వాగులు, వంకల నుండి వరద నీరు ప్రవాహ సమయంలో వాటిని దాటకుండా ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంచాలన్నారు.ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని, స్థానికుల సహాయంతో వరద నష్టం నివారణా చర్యలను చేపట్టాలని సి.ఎస్. సూచించారు. చెరువులు, పూర్తిగా నిండిన జలాశయాల్లో నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ, ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని ఆదేశించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *