నేటి భారత్ బంద్ డిమాండ్లు ఏమిటంటే…

అనేక రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఈ రోజు భారత్ బంద్ పట్టిస్తున్నాయి. దీనికి ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు తప్ప మిగతా వాటిలో చాలా పార్టీలు మద్దతు ప్రకటించాయి.  ఇంతకీ ఈ బంద్ డిమాండ్లు ఏమిటి? ఇవే డిమాండ్లు:

1. రైతాంగ వ్యతిరేకమైన, ఆహార భద్రతకు ముప్పుకలిగించే మూడు సాగు చట్టాలను భేషరతుగా రద్దు చేయాలి. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి.

2. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలి. ప్రయివేటికీకరణ – నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ పథకాన్ని తక్షణం విరమించుకోవాలి.

3. బహుళ జాతి సంస్థలు మరియు కార్పొరేట్ అనుకూల విధానాలతో కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా కుదించే కార్మిక వ్యతిరేక విధానాలకు – కార్మికుల హక్కులపై దాడికి స్వస్తి చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *