అమరావతి పరిధిలో టెన్షన్, ర్యాలీలు నిషేధం

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిఅమరావాతిలో ఉద్రిక్త  వాతావరణం నెలకొంది.

రాజధానిలో భారీగా పోలీసుల మోహరించారు. రాజధానిలోకి కొత్తవారిని అనుమతించడం లేదు. కరకట్టపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు.మరోవైపు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పోలీసుల బందోబస్తు కట్టదిట్టం చేశారు. ఆలయం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. అమరావతి రైతులు ర్యాలీ నిర్వహిస్తున్నారని, ఇదే విధంగా బహుజన పరిరక్షణ సమితి వారు దేవస్థానం నుంచి న్యాయస్థానానికి ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీనితో  నిషేధం విధించారు.

అమరావతి పరిధిలో ఏవిధమైన ర్యాలీలకు  అనుమతులు లేవు డిఐజి త్రివిక్రమ వర్మ తెలిపారు.  అర్బన్ ఎస్పీ ఆరి ఫ్ హాఫిజ్,,రూరల్ ఎస్పీ విశాల్ గు న్నీలు ఏ ర్యాలీలకు అనుమతులీయరని అన్నారు.

వివరాలు:

కోవిడ్ దృష్ట్యా కోవిడ్ నిబంధనలు మరియు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అమలులో ఉన్న కారణముగా బహిరంగ ర్యాలీలకు అనుమతి ఇవ్వడం కుదరదు.

అత్యంత పవిత్రమైన గౌరవ న్యాయస్థానం ఉన్న ప్రదేశములో ఎటువంటి నిరసనలు, ర్యాలీలు చేపట్టరాదు.

అదే విధముగా తుళ్లూరు మరియు పరిసర ప్రాంతాలలో 30 పోలీస్ యాక్ట్ కూడా అమ్మలులో ఉన్న కారణముగా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వడం కుదరదు.

బహుజన పరిరక్షణ సమితి వారు కూడా వివిధ సామాజిక మాధ్యమాల్లో దేవస్థానం నుంచి న్యాయస్థానం అనే ర్యాలీని చేపడతామని తెలపడం జరిగినది. కావున ఈ రెండు వర్గాలు వారు ఎదురైతే ఘర్షణలు జరిగి శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.

ఇతర ప్రాంతాల నుండి కొత్త వ్యక్తులు వచ్చి రెండు వర్గాల మధ్య అలజడులు సృష్టించి,శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని మా నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్నది కావున అనుమతులు ఇవ్వలేము.

శాంతియుత ఆందోళనలకు మేం అనుమతి ఇచ్చాం.వారి వారి గ్రామాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 100 నుంచి 150 మంది ప్రజలకు మించకుoడా నిరసన వ్యక్తం చేసుకోవచ్చు

రాజధాని ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలలో భాగముగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.

తుళ్లూరు మరియు పరిసర ప్రాంతాలకు ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించగలరు.

నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహిస్తే,వారిపై చట్టపరముగా చర్యలు తీసుకుంటాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *