అమరావతి ఉద్యమం 600 రోజుల మైలు రాయి దాటింది

ఏకైక రాజధానిగా ‘అమరావతి‘ని కొనసాగించాలని 600 రోజులుగా సాగుతున్న ఉద్యమానికి ఈ రోజు మద్దతుగా ర్యాలీ. అమరావతిలో ర్యాలీలను పురస్కరించుకుని నిషేధాజ్ఞలు విధించారు. పోలీసులను పెద్ద ఎత్తున మొహరించారు. చాలా మందిరైతులను, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు దీక్షా శిబిరం నుంచి మంగళగిరి ఆలయానికి ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో  శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకోవడమేంటని వారు పోలీసులను నిలదీశారు. మరొక వైపు రైతుల బైక్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో దీక్షా శిబిరంలో ఉన్న మహిళలు, రైతులు హైకోర్టు వైపు పరుగులు తీశారు.

పరుగులు తీస్తున్న వారిని మళ్లీ అడ్డుపడటంతో తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.  ఆగ్రహించిన పోలీసులు దళిత నాయకురాలు కంభంపాటి శిరీషను అడ్డుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ జీప్‌లో ఎక్కించారు.

దగా చేసిన మోదీ: లక్ష్మినారాయణ

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాజ్యసభలో ఆమోదముద్ర వేయించుకోవడానికి నాటి ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ “ప్రత్యేక తరగతి హోదా” హామీ ఇస్తే! నేటి ప్రధాని నరేంద్ర మోదీ అది ముగిసిన అధ్యాయమని దగా చేశారని టి.లక్ష్మీనారాయణ,సమన్వయకర్త,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక,   వ్యాఖ్యానించారు.

దేశ ప్రధాన మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరావతి విధ్వంసానికి పూనుకున్నారు. నేడు అమరావతి కన్నీరు పెడుతున్నది అని ఆయన అన్నారు.

రాజకీయ విజ్ఞత ప్రదర్శిస్తారా! చరిత్రహీనులుగా చరిత్ర పుటలకెక్కుతారా! మీరే విజ్ఞతతో ఆలోచించండి! లేదా! కాలగర్భంలో కలిసిపోతారని లక్ష్మినారాయణ హెచ్చరించారు.

అమరావతిలో పరిస్థితి

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *