“హుజురాబాద్ లో TRS ఓడిపోతేనే మేలు జరుగుతుంది!”

తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షలతో ఏర్పడిందో నేడు అందుకు భిన్నంగా పాలకులు ప్రవర్తిస్తున్నారని అందుకే అందర్నీ మంచిగాడీలో పెట్టడానికి  పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి అవినీతి, నిర్భంత రహిత తెలంగాణ కోసం ముందుకు వచ్చామని తెలంగాణ ఆకాంక్ష వేదిక బాధ్యులు గాదె ఇన్నయ్య, సమన్వయకర్త, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి అన్నారు.

కరీంనగర్, మైత్రి రెసిడెన్షీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పలువురు వక్తలు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇన్నయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఆకాంక్ష వేదిక ఆధ్వర్యంలో ఈనెల 29న పద్మనాయక కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు తిలోదకాలు ఇచ్చే వారిని ఎదురిస్తామని, 2001 మే 17న సింహంలా గర్జించిన కరీంనగర్ కు నేడు ఏమైందని, తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు రెండు వేల మంది త్యాగాల చరిత్రను లేకుండా చేస్తున్నారని అన్నారు.

ప్రాంతేతరులను దోపిడి చేస్తే ‘ప్రాంతం దాటే వరకు తరిమి కొడదామని,
బలి దానమిచ్చిన ఉద్యమ వీరులు మనల్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. మరి ప్రాంతం వాడే ‘దోపిడి చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాం’ అని కాళోజి మాటల స్పూర్తితో, ఈనెల 9న ఆవిర్భవించిన ‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక’ ఉద్యమిస్తుందని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలకిచ్చిన హామీలు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి ఉపాధి, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల భర్తీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెరిపించి ఆధునీకరణ ఇస్తామని, ఆత్మగౌరవ పాలన అందిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక ఉద్యమిస్తుందని ఆయన అన్నారు.

పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తమతో కలిసి రావాలని అన్ని పార్టీలకు పిలుపిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేక, అనుకూల కాదన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక రాష్ట్ర కన్వీనర్ పాశం యాదగిరి మాట్లాడుతూ..

” మలిదశ తెలంగాణ ఉద్యమం గాదె ఇన్నయ్య రాసిన తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ‘దగాపడ్డ తెలంగాణ’ అనే పుస్తకం ద్వారా ప్రచురించడం వలన ఉద్యమం రగిలింది.  తెలంగాణ వచ్చిన తరువాత కూడా తెలంగాణ ప్రజలు పరాయి వాళ్ళమైనాము.  తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదంలో ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు సహకరించాయి,  కష్టాలతో ఓపెన్ కాస్ట్ లతో ఊర్లన్నీ మాయం అవుతున్నాయి.  ఇసుక, మట్టి, అడవి, బొగ్గు ఇలా అన్ని సహజ వనరుల దోపిడితో అంతరించిపోతున్నది.

“జిల్లాలో ప్రకృతి విధ్వంసం జరుగితే ఎందుకు మౌనంగా ఉన్నారని, కాంగ్రెస్, బిజెపిలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి సహకరించిన ఐదుగురు తల్లులు బెల్లీ లలిత, మీరా కుమార్, మాయావతి, సుష్మా స్వరాజ్, సోనియాగాంధీలకు రుణపడి ఉన్నాము.  తెలంగాణ ప్రజలు వారిని తలుచుకోవాలి.  బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు అవినీతి రహిత ప్రజా తెలంగాణ సాధించుకునేందుకు అందరూ సహకరించాలి.  తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వేదికలో సమిష్టి నిర్ణయాలు, సమిష్టి నాయకత్వం ఉంటుంది. హుజురాబాద్ లో టిఆర్ఎస్ ఓడిపోతేనే ఎమ్మెల్యేలు, ఎంపీలు గుర్తింపు వస్తుంది. కెసిఆర్ ఆరోగ్యంగా ఉండాలంటే హుజరాబాద్ లో ఓడిపోవాలి. ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి కాబట్టి దళిత బంధు పథకాలు వస్తున్నాయి.”

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ వేలాదిమంది అమరుల త్యాగం ఒక కుటుంబానికి ఫలితాలు ఇస్తుందని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోవడంతో మరో ఉద్యమం అవసరం అయిందని ఆయన అన్నారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులను తరిమిన నేతలే, నేడు తెలంగాణను పాలిస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణా రెడ్డి అన్నారు.

తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి జోజి రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని, ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని దింపటానికి పోరాడే ప్రతి ఒక్కరితో తాము కలసి పనిచేస్తామని చెప్పారు.

బీఎస్పీ నాయకులు సుతారి లచ్చన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలకు పాల్గొన్నారని, అయితే ఫలితాలు మాత్రం ఒక కుటుంబం మాత్రమే అనుభవిస్తుందని, పేద ప్రజలకు సామాజిక ఆర్థిక విముక్తికై పాలకులకు పట్టింపు లేదు అన్నారు.

ఫార్వార్డ్ బ్లాక్ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు శ్రీశైలం, గోపిరెడ్డి సంపత్ కుమార్, పరిశోధన పాత్రికేయులు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, జర్నలిస్టులు గంగాదేవి సంపత్ యాదవ్, తోటకూరి మన్మథరావు, బిజెవైఎం నాయకులు క్రాంతి, విద్యార్థి జెఏసి నాయకుడు శ్రీకాంత్, నాయకులు సుతారి లక్ష్మణ్, మార్వాడి సుదర్శన్ శ్రీనివాస్ గౌడ్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *