పేరు మార్చుకున్నా యడ్యూరప్ప రాత మారలేదు…

పేరును ముక్కలు ముక్కలు చేసి మార్చుకున్నా కర్నాటక  ముఖ్యమంత్రి  యడ్యూరప్ప రాత మారలేదు.

కర్నాటక బిజెపిలో  చాలా పెద్ద నాయకుడే అయినా  యడ్యూరప్పను దురదృష్టం నీడలా వెంటాడింది. లింగాయత్ కులపెద్ద హోదా కూడా ఆయనకు అచ్చి రాలేదు.

పేరుకే నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తంగా కలిపి కూడా ఆయన అయిదేళ్ల మయిన  పదవిలో ఉండలేదు.

ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టినపుడుల్లా దురదృష్టం తన్ని పదవి లాక్కెళ్లింది.

2007లో మొదటి సారి ముఖ్యమంత్రి అయినపుడు  కేవలం 9 రోజులే పదవిలో ఉన్నారు.

రెండవ సారి ముఖ్యమంత్రి అయినపుడూ పూర్తికాలం ఉండలేక పోయారు. అపుడు ఆయన 2008 మే  నుంచి 2011 జూలై దాకే ముఖ్యమంత్రిగా ఉన్నారు.

2018లో మూడో సారి ముఖ్యమంత్రి అయినపుడు ఆయన ముచ్చటగా మూడు రోజులే పదవిలో ఉన్నారు. అపుడు అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక రాజీనామా చేశారు.

నాలుగో సారి  2019 లో ఇదే రోజున అంటే జూలై  26 న ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజే రాజీనామా చేశారు.

ఈ మధ్యలో  ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2013లో ఆయన బిజెపి మీద అలిగి పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ ‘కర్నాటక జనతా పక్ష ’(KJP)పెట్టారు. అపుడు 10 శాతం ఓట్లు సంపాయించి  బిజెపిని దెబ్బతీశారు గాని తాను అధికారంలోకి రాలేక పోయారు. అయితే, సొంతపార్టీని కూడా కాపాడుకోలేకపోయారు.  2014 లోక్ సభ ఎన్నికల ముందు మళీ బిజెపిలోకి వచ్చారు.

ఈ మధ్యలో ఎవరో ఆయనకు పేరులో రెండు ’డి‘ (D) లు వద్దు,  ఒకటి చాలు అదనంగా ‘ఐ’ ( I ) అక్షరం చేరిస్తే అదృష్టం కలిసొస్తుందని చెప్పారు.

అంతే ఆయన పేరు Yeddyurappa ని Yediyurappa అని మార్చకున్నారు. ఇది మార్చుకున్నాక కొద్ది జాతకం మారినట్లే మారింది, నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దురదృష్టం వదల్లేదు. పూర్తికాలం పనిచేయకుండా ఇపుడు కూడా ముఖ్యమంత్రి పదవి వదులుకోవలసి వచ్చింది.

నిజానికి ఆయన ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా జీవితం ప్రారంభించారు.జనసంఘ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.

‘ముఖ్యమంత్రి అయ్యాక ఎపుడు హ్యాపీగా ఉన్నాను? మొదటి రోజునుంచీ అగ్ని పరీక్షే  నా బతకు’ అని రాజీనామా చేశాక వ్యాఖ్యానించారు.

“ముఖ్యమంత్రి పదవి చేపడుతూనే వరదలొచ్చాయి. నేను సొంతంగా క్యాబినెట్ ఏర్పాటు చేసుకుందామంటే అధిష్టానం అనుమతి నీయలేదు. సమస్య లన్నీంటిని నేనొక్కడిన్ని పరిష్కరించకోవలసి వచ్చింది, ’అని ఇపుడు వాపోతున్నాడు.

1983లో శిఖరిపురా నుంచి  మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత ఏడుసార్లు అక్కడి నుంచి గెలిచారు. ఆపైన ఒకసారి శివమొగ్గనుంచి లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *