న్యాయ వ్యవస్థ లో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ అమలయ్యేదెపుడు?

(జువ్వాల బాబ్జీ)

దేశంలో న్యాయ వ్యవస్థ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కావడం లేదని ఎంతమందికి తెలుసు?

ఎప్పటికప్పుడు, శాసన, కార్య నిర్వాహక వ్యవస్థల పనితీరు రాజ్యాంగ పరిధిలో సక్రమంగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించవలసిన న్యాయ వ్యవస్థ తన పనినీ, విస్మ రించడం ఆందోళన కలిగించే అంశం.

రాజ్యాంగ బద్దంగా పనిచేస్తామని, విధులు నిర్వర్తించేప్పుడు, ఏ విధమైన ప్రలోభాలకు, వత్తిడులకు లొంగకుండా, పక్ష పాత వైఖరి, బందు ప్రీతి కనబర్చ కుండా పని చేస్తామని న్యాయ మూర్తులు రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తారని ప్రజలు నమ్ముతుంటారు, అది నిజమే కావచ్చు.

అటువంటి న్యాయ వ్యవస్థ లో జరుగుతున్న కొన్ని విషయాలు పరిశీలిస్తే చాలా భాద కలుగుతుంది.

న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది.రాజ్యాంగం యొక్క”బేసిక్ స్ట్రక్చర్”మారకూడదు అని సుప్రీం కోర్టు తీర్పు లను అదే కోర్టు గౌరవించకపోవడం విచారకరం.

అవునులే, జడ్జీలు మాత్రం మానవ మాత్రులే కదా! వారికి, బంధుప్రీతి ఉండదు అని కాకుండా, మనుషులకుండే సహజ సిద్ధమైన, భావాలు ఉంటాయని గ్రహించాలి. ఇటీవల జరిగినకొన్ని సామాజిక ఉద్యమాలు, సంఘటనలు వాటిపై కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే అర్థమవుతుంది.

2018 సంవత్సరంలో సుప్రీం కోర్టు,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు లో ఇచ్చిన తీర్పు ఒకటి. దానిని నిరసిస్తూ దళితులు దేశ వ్యాప్తంగా ఆందోళన కు దిగారు, కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత,కేంద్ర ప్రభుత్వం, రివిజన్ పిటీషన్ దాఖలు చేయడం, మరల సుప్రీం కోర్టు తన తీర్పును రద్దు చేయడం జరిగింది.

పై దానిని బట్టి న్యాయ మూర్తులు అందరూ, ఒకేలా ఆలోచించరని అర్థం చేసుకోవాలి. అంటే న్యాయ వ్యవస్థ లో “రూల్ ఆఫ్ రిజర్వేషన్”అమలులో ఈ విధమైన ఆలోచనలే ఎందుకు కలిగి ఉండరు? కచ్చితంగా ఉంటారు.

రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు లేదా  అగ్రకులాల మేధావులనేబడే వారు తరచుగా అడిగే ప్రశ్నలు:
1. ఎన్ని సంవత్సరాలు రిజర్వేషన్ లు అమలు చేస్తారు?
2. డా. బి. ఆర్.అంబేడ్కర్ గారు కేవలం 10సంవత్సరాలు చాలని అన్నారని?
3. మీలో చాలా మంది చదువుకున్నారు , చాలా మంది ఉద్యోగులు, ధనవంతులు ఉన్నారు కదా ఇంకా వారికెందుకు రిజర్వేషన్ లు?
4. ఇతర కులాల వారు చాలా మంది పేదలున్నారు, వారికి కూడా రిజర్వేషన్ సౌకర్యం కావాలని.

అయితే ఈ ప్రశ్నలు, సుప్రీం కోర్టు మరొకలా ఎందుకు అడగటం లేదు!
అవి;
1. ఎన్ని కోట్ల మంది దేశంలో ఎస్సీ,ఎస్టీ లున్నారు?
2. ఎంత మంది చదువు కున్నారు, వారిలో ఎంతమందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చారు?
3.  ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని?
4.భూములు , ఎంత మంది కి ఉన్నాయి?
5. ఎస్సీ,ఎస్టీ లలో ఎంత మంది బడా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు?
6. ఎంత మంది ప్రముఖ యూనివర్సిటిలకు వైస్ ఛాన్సలర్ లు అయ్యారు?
7. ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రైవేట్ రంగానికి ఇస్తున్నారు?
8. అక్కడ రిజర్వేషన్ లు అమలు చేశారా?
9. ఎన్ని రాష్ట్రా లకు ఎస్సీ ఎస్టీ ముఖ్య మంత్రులు ఉన్నారు?
10. న్యాయ వ్యవస్థ లో ఎంత మంది, ఎస్సీ ఎస్టీ న్యాయ మూర్తులుఉన్నారు? వారిలో, ప్రధాన న్యాయమూర్తులు ఎందరు? సుప్రీం కోర్టు లో ఎందరు, హై కోర్టుల్లో ఎందరు ఉన్నారు? అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తున్నా రా?

ఇటువంటి కొన్ని మౌలికమైన ప్రశ్నలు ప్రభుత్వాలను అడిగితే బాగుంటుది. ఇవి అడగరు, ఎందుకంటే వారిలో సామాజిక అణచి వేతకు గురయ్యి, అంటరాని తనం, వెలివేతలు, కటిక పేదరికం, ఉంటానికి ఇల్లు, తినడానికి తిండి లేక, ఆకలికి తాళలేక, గ్రామాలువిడిచి పెట్టీ జీవనో పాధికోసం చదువులు చదివిన వారు లేరు కదా. వారికి తెలుస్తోంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు కావాలో రిజర్వేన్లు గురించి, కాన్స్టి ట్యంట్ అసెంబ్లీ లో జరిగిన చర్చల్లో పాల్గొని, ఆర్. ఎమ్. నల్వాడే, హెచ్.జే ఖండేల్కర్ లు ఇలా అన్నారు.”సామాజిక సమస్య పరిష్కారము కోసం, రిజర్వేషన్ లే ప్రత్యామ్నా యం” అని అన్నారు.

న్యాయ వ్యవస్థ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కోసం జాతీయ ఎస్సీ ఎస్టీ కమీషన్ కొన్ని సూచనలు చేస్తూ నివేదిక ఇచ్చింది. కానీ, ఫలితం లేదు. ఎస్సీ ఎస్టీ లకు మెరిట్ లేదని, వారికి న్యాయ పరిజ్ఞానం ఉండదని, జుడిష ల్ సర్వీస్ లో రిజర్వేషన్ అమలు చేయక పోవడం నిజంగా విచార కరం. దానికోసం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్సీ ఎస్టీ న్యాయ వాదులు, ఐక్యంగా ఉండి హక్కులు కోసం పోరాడాలి. అంబెడ్కర్ ఆశయాల కోసం కృషి చేయాలి.

ప్రజాస్వామ్య దేశంలో, మూడు ప్రధానమైన వ్యవస్థలలో ఒకటైన, ముఖ్యమయిన న్యాయ వ్యవస్థ  ఎస్సీ, ఎస్టీ లకు “రూల్ ఆఫ్ రిజర్వేషన్”ఫలాలు ఏమాత్రం అమలు కావటం లేదని గత కొంత కాలంగా “అంబేడ్కర్ ఆలోచన_ఫౌండేషన్ ” రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ,ఎస్టీ న్యాయవాదులను సమీకరిస్తూ సభలు, సమావేశాలు పెడుతున్నది.
ఇటీవల, విశాఖపట్నం, రాజమండ్రిలలో కేడర్ క్యాంప్ లు నిర్వహించింది.

అంబేడ్కర్ ఆశయాల సాధనలో  న్యాయవాదులు చాలా మంది పాల్గొంటున్నారు. పెద్దఎత్తున పాల్గొని రూల్ ఆఫ్ రిజర్వేన్ అమలు అయ్యేందుకు వత్తిడి తీసుకురావాలి.

(బాబ్జీ అడ్వకేట్,9963323968, పోలవరం ప్రాజెక్టు దళిత నిర్వాసితుల జాయింట్ యాక్షన్ కమిటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *