వైస్సార్ తెలంగాణ వ్యతిరేకి ఎట్లవుతడు?

వైఎస్ తెలంగాణకు వ్యతిరేకి కాదు.2000 లో 41 మంది ఎమ్మెల్యే లతో సంతకాలు పెట్టించి 2004,2009 యూపీఏ మ్యానిపెస్టో లో పెట్టించిన వ్యక్తి తెలంగాణ వ్యతిరేకి ఎట్లవుతడు అని YS షర్మిల ప్రశ్నించారు.

ఆమె వైస్సార్ తెలంగాణ పార్టీ పెట్టాక తొలిసారి  ఈ రోజు విలేకరులతో మాట్లాడారు.

వైస్సార్ విధానాలను సమర్తించారు. ఆమె ఏమన్నారంటే…

వైస్సార్ తెలంగాణ వెనుకబాటు తగ్గించేందుకు కృషిచేశారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం ఎవరు భయపడలేదు. రాజశేఖర్ రెడ్డి చనిపోయాకే శ్రీకాంత చారి ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాతే మలిదశ ఉద్యమం జరిగింది.

వైఎస్ఆర్ తెలంగాణ కు వ్యతిరేకి అవునా కదా అని గ్రామాల్లోకి వెళ్లి తెలుసుకోండి. తెలంగాణకు వ్యతిరేకమని ఎప్పుడు చెప్పలేదు. అందరితో చర్చించే తెలంగాణ ఇవ్వాలని చెప్పారు.రికార్డులు చూసుకోండి

ఆంధ్రవాళ్లను వెళ్ళగొడతాం, ఆస్తులు కొల్లగొడతామంటేనే ఆ మాటలు వచ్చాయి.తెలంగాణ నా గడ్డ, ఇక్కడి ప్రజలకు మేలు చేసేందుకే పార్టీపుట్టింటిపై అలిగితే పార్టీలు పెట్టరు. ఎవరిమీదనో అలిగి పెట్టింది కాదు. ఈపార్టీ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకే పార్టీ. పార్టీ పేరులోనే వైస్సార్ ఉన్నారు, అవమానించేవారు ఆలోచించుకోవాలి.

కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి ని సీఎం చేయలేదు. 2004 కంటే ముందు కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ.  పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ ను నిలబెట్టింది వైఎస్అర్, రెండు సార్లు అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ వల్లే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిసినట్లే కాంగ్రెస్ వైఎస్ఆర్ కు వెన్నుపోటు పొడిచారు. చనిపోయిన తర్వాత అయన పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టింది

ఎందుకు తెలంగాణాలో పార్టీ పెట్టకూడదు?

ఎస్సి, ఎస్టీల మానప్రాణాలకు రక్షణ ఉందా? తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు.ఇప్పుడే పెట్టాల్సిన అవసరం ఉంది. కృష్ణా, గోదావరి తెలంగాణ నీటి బొట్టును వదులుకోమ్, ఇతర ప్రాంతలవి ఆపం అనేది మా విధానం. రాజన్న రాజ్యం కావాలా రాక్షస పాలనా కావాలా అనేది ప్రజల నిర్ణయం

ఏపీలో రాజన్న రాజ్య స్థాపన జరుగుతున్నట్లే అనిపిస్తుంది. ప్రజలే అల్టిమేట్ నిర్ణేతలు. పాలనా నచ్చకపోతే వారే తీర్పు చెప్తారు

కెసిఆర్ ఒక డిక్టేటర్. మేమే తెలంగాణాలో ప్రతిపక్షం. ప్రశ్నించేవాడు ఉండద్దనేది కెసిఆర్ లక్ష్యం.  నీటి సమస్యల పరిష్కారంలో ఏడేళ్ల పాలనలో కెసిఆర్ విఫలం అయ్యారు. రాజకీయం కోసమే వాటర్ ఇష్యూస్ ని ఎత్తుకుంటారు

లక్షల కోట్లు అప్పుచేసి ఎవరికైన మేలు చేసారా? ఇంత అప్పు చేసాక కూడా నిరుద్యోగం, ఆత్మహత్యల విషయంలో తెలంగాణ అగ్రస్థానం లో ఉంది

కెసిఆర్ ప్రాణాలకు రక్షణ కావాలి కానీ, తెలంగాణ యువతకు రక్షణ వద్దా. చిన్నచిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న కెసిఆర్ గుండె కరగడంలేదు. తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చుతారని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కెసిఆర్ వినియోగించుకోలేదు.

నాకు జంపింగ్ జపాంగ్ లు అవసరం లేదు. నేను సింగిల్ గా ఉన్న ఎప్పుడు అధైర్యపడలేదు.బ్ప్రజలకోసం కష్టపడే నాయకులూ కావాలి తప్ప రాజకీయాలు చేసేవాళ్ళు అవసరం లేదు . ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలోకి వచ్చేవాళ్ళు అవసరం లేదు. వైఎస్ఆర్ లెగసీని కంటిన్యూ చేయడానికే పార్టీ. హుజురాబాద్ ఉపఎన్నిక పగలు ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమే

ఈ ఎన్నిక అవసరమా? అర్థమేలేని ఎన్నికలో మేము పోటీ చేయడం అవసరమా.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *