నగరమంతా జోరుగా వాన…చల్లబడ్డ హైదరాబాద్

హైదరాబాద్‌ మహానగరంలో ఈ రోజు పొద్దున్నుంచి పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఇంతవరకు అక్కడక్కడ  మాత్రమే కురుస్తూ వచ్చిన వాన ఈ రోజు నగరమంతా రొమాంటిక్ గా కురుస్తూ ఉంది. ఆదివారం కావడం సెలవుకు వాన మరింత కిక్కు నిచ్చింది.

సిటి మొత్తం తడిసి ముద్దవుతూవుంది.వాతావరణం లో లేత చలి, చక్కటి ఎదురుగాలి… ముచ్చటగా ఉంది. మరొక వైపు బోనాల సంబురాలు.

కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి,బాలానగర్‌, చింతల్‌, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, మణికొండ, గచ్చిబౌలి, రాయదుర్గం, లంగర్‌హౌస్‌, గోల్కొండ, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట,యాకుత్‌పుర, కార్వాన్, బహదూర్‌పుర, దూద్‌బౌలి,గౌలిపుర తదిరత ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *