ఒలింపిక్ మెడల్, నోబెల్ ప్రైజ్ కొట్టిన ఒకే ఒక క్రీడాకారుడెవరో తెలుసా?

ఒలింపిక్ క్రీడలో చరిత్రలో  కనిపించే అద్భుతాలలో ఇదొకటి, ఓలింపిక్స్ క్రీడల్లో ఎంత తోపు అయినా నోబెల్ ప్రైజ్ సాధించడం అనేది వూహించడం కష్టం. ఇలాంటిది ఒక్క సారే జరిగింది. బ్రిటిష్ ఎమెచ్యూర్ అథ్లెట్  ఫిలిప్ జె. నోయల్-బేకర్ (Philip J Noel-Baker) కు ఆ ఘనత లభించింది.  1920సమ్మర్ ఒలింపిక్స్  లో 1500 మీటర్ల పరుగులో సిల్వర్ మెడల్ వచ్చింది. 800మీ. ఈవెంట్ లో  కూడా సెమిఫైనల్ కు వచ్చాడు గాని, పాల్గొనలేదు.

అయితే, 30 యేళ్ల తర్వాత ఆయనకు నోబెల్ ప్రైజ్ రూపంలో బంగారు మెడల్ వచ్చింది.

బేకర్ కు క్రీడలంటే ఎంత ఇష్టమో , నిరాయధీకరణ, ప్రపంచ శాంతి అంటే అంత ఇష్టం. లీగ్ ఆఫ్ నేషన్స్, ఏర్పాటులో, ఐక్య రాజ్య సమితి ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు. 1907లో జరిగిన ఇంటర్నేషనల్  పీస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం రావడానికి  ప్రైవేటు ఆయుధ పరిశ్రమలు పాత్ర చాలా ఉందని ఆయన ఆ రోజే గుర్తించాడు. Noel-Baker was convinced that the private armaments industry bore much of the responsibility for the outbreak of war and the blood bath that followed అని నోబెల్ కమిటీ కూడా ఆయన గురించి రాస్తూ పేర్కొంది.

మొదటి ప్రపంచ యుద్ధానికే కాదు, దేశాల మధ్య జరుగుతున్న ఈ నాటి చిన్న చిన్న యుద్ధాలకు కూడా ప్రయివేటు ఆయుధ పరిశ్రమలు  ఒకప్రధాన కారమణమని వేరే చెప్పాల్సిన పని లేదు. యుద్ధాలకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతి కోసం కృషి చేసినందుకు (…for his longlosting contribution to the disarmament and peace) ఆయనకు 1959లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.

1920 సమ్మర్ ఒలింపిక్స్ బెల్జియం లోని యాంట్ వెర్ప్  (Antwerp) లో జరిగాయి. ఒలింపిక్ జెండా మొదలయింది ఇక్కడి నుంచే. ఆయేడాది బ్రిటిష్ టీమ్ జండాను మోసుకెళ్లిందాయనే.  అంతకు ముందు ఒలింపిక్ జెండా అనేది లేదు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *