FLASH: విరసం మీద నిషేధం ఎత్తివేత

తెలంగాణ ప్రభుత్వం విప్లవ రచయితల సంఘం (విరసం) మీద నిషేధం ఎత్తివేసింది. ఇదే విధంగా మరొక   15  ప్రజా సంఘాల మీద విధించిన నిషేధాన్నికూడా  తొలగించింది. ఈ సంస్థల  నిషేధానికి సంబంధించిన  గత ఉత్తర్వులను ఉపసంహరించుకుంది .

ఈ ఏడాది మార్చి నెలలోనే ఈ సంస్థలను నిషేధించారు.అయితే, ఈవిషయం ఏప్రిల్  23 దాకా బయటపెట్టలేదు. దీనికి సంబంధించిన  జివొని గోప్యంగా ఉంచారు. ఈ పదహారు సంస్థలు మావోయిస్టు పార్టీ కీ అనుకూలంగా పనిచేస్తున్నాయని చెబుతూ మార్చి 30 న వాటిని (GOMS 73 General Administration (Spl D)Deapartment) నిషేధించారు. ఇదే విధంగా నిషేధ ఉపసంహరణ కూడా జూన్  23 నే గెజిట్ లో అచ్చయినా  కూడా ఆలస్యంగా  ఇపుడు వెలుగులోకి వచ్చింది.

 నిషేధం నుంచి బయటపడిన సంస్థలు

విప్లవ రచయితల సంఘం,   తెలంగాణ ప్రజాఫ్రంట్,  తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య, తెలంగాణ విద్యార్థి వేదిక, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్,  తెలంగాణ విద్యార్థి సంఘం,  అదివాసి స్టూడెంట్స్ యూనియన్,   కమిటీ ఆఫ్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్,  తెలంగాణ రైతాంగ సమితి,  తుడుమ్ దెబ్బ,  ప్రజా కళా మండలి,  తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్,   ఫోరమ్ అగైన్స్ట్ హిందూ ఫాసిజం  ఆఫెన్సివ్ (FAHFO),సివిల్ లిబర్టీస్ కమిటీ,  అమరుల బంధు మిత్రుల సంఘం,  చైతన్య మహిళా సంఘం.

ఈ సంస్థలు హింసకు పూనుకుంటున్న వ్యక్తులను  ప్రోత్సహిస్తున్నాయని ప్రభుత్వం అపుడు ఆరోపించింది. ఈ సంస్థల సభ్యులు అర్బన్ గెరిల్లా వ్యూహాలతో పట్టణ ప్రాంతాలకు ఎగబాకుతున్నారని, రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజలు ఈ సంస్థలలో  చేరేలా చేస్తున్నారు అని ప్రభుత్వం పేర్కొంది.

“The activists of these front organisations have been regularly in touch and meeting the Maoist leadership in the forest area of Chhattisgarh. On the directions of CPI-Maoist, they are organising various protest programmes on barren lands and against so-called state repression on front activists besides demanding the release of P Vara Vara Rao, Founder, VIRASAM, Prof G.N Sai Baba (extremist convict), Rona Wilson and other leaders of various front organisations who were arrested in Bhima Koregaon case, and repealing UAPA Act, farm laws, CAA/NRC etc,” అని తెలంగాణ ప్రభుత్వం జివొ లో పేర్కొంది.

ఈ సంస్థల సభ్యులు అండర్ గ్రౌండ్ కార్యకర్తలయిపోయి, చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలనుకూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా జివొలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

మార్చి 30న నిషేధం విధించగానే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (NIA) తెలంగాణ, ఆంధ్రలలోని విరసం సభ్యుల ఇళ్ల మీద, పౌరహక్కుల సంఘాల నేతల ఇళ్ల మీద దాడులుకూడా జరిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *