తెలంగాణలో కోవిడ్ థర్డ్ వేవ్ రాదనలేం: ‘గాంధీ’ సూపరింటెండెంట్

తెలంగాణలో కోవిడ్ రెండో వేవ్ బాగా తగ్గిపోతున్నదని, అయితే, రానున్న కొన్ని వారాలలో కాకుంటే నెలలలో మూడో సారి కోవిడ్ దాడిచేయదన్న గ్యారంటీ లేదు.

ఈ విషయాన్ని తెలంగాణలో కోవిడ్ ట్రీట్ మెంట్ లో అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజరావు తెలిపారు.

కొత్త కరోనా వేరియంట్ తిరుగాడుతూ ఉంది.  అది ఇపుడున్న డెల్టా వేరియంట్ కంటే చాలా తీవ్రమయింది. అదిసోకకుండా మన ప్రవర్తనను మార్చుకోనక పోతే, థర్డ్ వేవ్ తప్పని సరి అని ఆయన రాసినట్లు తెలంగాణ టుడే రాసింది.

“Admissions of Covid positive individuals and those needing oxygen and ventilator support have gone down considerably everywhere in the State. The peak that we had witnessed in April/May is definitely not there. However, there is a need for people to continue to take precautions and avoid the third wave,” అని  డాక్టర్ రాజారావు తెలిపారు.

’ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో కేవలం 400 మంది కోవిడ్ రోగులున్నారు. మరొక 180 మంది మ్యూకోర్మైకోసిస్ రోగులున్నారు. ఏప్రిల్ , మే,జూన్ నెలలలో ఉన్న పరిస్థితితో పోలిస్తే ఇది చాలా మెరుగైన పరిస్థితి.అపుడు 1300 నుంచి 1400 మంది పేషంట్లు ఉండేవారు.ఐసియు బెడ్స్ అందుబాటులో ఉండేవి కాదు. ఇపుడు  619  ఐసియు బెడ్స్ లో 101 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్స్ 600 ఉంటే 105లో మాత్రమే రోగులున్నారు. మిగతాావన్నీ ఖాళీ, అని ఆయన చెప్పారు.

Almost all pandemics come in the form of waves, and we should not be surprised if there is a third wave. However, I think that subsequent waves will not be as severe as the second wave. Following  Covid-appropriate behavior and getting vaccinated are vital,”అని డాక్టర్ రాజారావు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *