ఇంటర్ పరీక్షల నిర్వహణ: ఆంధ్ర మీద సుప్రీంకోర్టు అసంతృప్తి

దిల్లీ: ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలనే విషయంలో  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి మీద  సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే చూస్తున్నది.

పరీక్షల నిర్వహణ మీద  ప్రభుత్వ విధానామేమిటో నాన్చకుండా జూన్ 24వ తేదీన తుదినిర్ణయం ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సిబిఎస్ఇ, ఐఎస్ సిఇ పరీక్షలను రద్దుచేయడాన్ని సవాల్ చేస్తూ  వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.  దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల  భద్రత రీత్యా తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని,  అది బాగా ఆలోచించి అత్యున్నత స్థాయిలో  తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానిస్తూ  జస్టిస్  ఎఎం ఖన్ విల్కార్, జస్టిస్ దినేష్ మహేశ్వరి ల వెకేషన్ బెంచ్  మంగళవారం నాడు ఈ పిటిషన్లనుకొట్టి వేసింది.

ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా ప్రస్తావనకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ తరఫున  మాఫూజ్ నజ్కీ వాదన వినిపించారు. వెకేషన్ బెంచ్ కు తన వాదన వినిపిస్తూ రాష్ట్రంలో దాదాపు 5  లక్షల మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు, పరీక్షలు నిర్వహించాలనే పట్టుదలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. పరీక్షల నిర్వహణ మీద రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే విషయాన్ని జూలై1 వ తేదీకి  వాయిదా వేసిందని ఆయన చెప్పారు.

జూలైలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి వస్తే ఏంచేస్తారని న్యాయమూర్తులు ప్రశ్నించారు.

ఇతర రాష్ట్రాల లాగా ఆంధ్ర ప్రదేశ్ కూడా ఇపుడే ఎందుకు నిర్ణయం తీసుకోలేదని కూడా వారు ప్రశ్నించారు.   ప్రభుత్వ దోరణి మీద న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థులను ఇలా ఆనిశ్చిత పరిస్థితికి గురిచేయవద్దని సలహా ఇచ్చారు. జూలై నెల దాకా ఆగకుండా రెండు రోజులలో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్నిప్రకటించాలని బెంచ్ ఆంధ్రప్రదేశ్ ను ఆదేశించింది.

రాష్ట్రంతో ఎంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని  ధర్మాసనం ప్రశ్నించినపుడు అడ్వకేట్ నజ్కీ  ‘అయిదు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు,’ అని సమాధానమిచ్చారు.

సిబిఎస్ ఇ, ఐసిఎస్ ఇ తో పాటు 20 రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినపుడు, 5 లక్షల మంది విద్యార్థులతో పరీక్షలు భద్రంగా నిర్వహించగలమన్న విశ్వాసం రాష్ట్రానికి ఉందా అనిన్యాయమూర్తులు  ప్రశ్నించారు

దీనికి అడ్వకేట్ నజ్కీ  ‘ఉంది’అని సమాధానమిచ్చారు.ఒక్కొక్క హాలులో  15 మంది విద్యార్థులకంటే ఎక్కువ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అన్ని కోవిడ్ ప్రొటోకోల్స్ పాటిస్తామని ఆయన కోర్టుకు నివేదించారు.

పరీక్షల వల్ల ఒక్క విద్యార్థి మృతి చెందినా  రాష్ట్రానిదే బాధ్యత  అని ధర్మాసనం స్పష్టం చేసింది.

“If there is one fatality, we’ll make the state responsible.” అని ధర్మాసనం ప్రకటిచింది.

అస్సాం, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాలు కూడ బోర్డ పరీక్షలను రద్దు చేశాయని, ఒక్క అంధ్రప్రదేశ్ మాత్రమే పరీక్షలను రద్దు చేయడం మీద నిర్ణయం తీసుకోలేదని కేంద్రం నిన్న కోర్టు కు  తెలిపింది. ఇంతవరకు ఆరు రాష్ట్రాలు పరీక్షలను నిర్వహించాయి, 18 రాష్ట్రాలు  రద్దు చేశాయని కోర్టు తెలిపింది.

 

One thought on “ఇంటర్ పరీక్షల నిర్వహణ: ఆంధ్ర మీద సుప్రీంకోర్టు అసంతృప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *