వరంగల్ తర్వాత కెసిఆర్ టార్గెట్ కరీంనగర్

410 కోట్లతో సర్వాంగ సుందరంగా మానేరు రివర్ ప్రంట్

మెదటి విడత 4కిలోమీటర్లు ప్రాజెక్టుకోసం చురుకుగా ఏర్పాట్లు

అర్కిటెక్చరల్, ఇంజనీరింగ్ డిజైన్ల పనులకోసం టెండర్లు పిలిచిన సర్కార్

జూలై నెలాఖరు కల్లా డీపీఆర్, ఆగస్టు నుండి పనులు ప్రారంభం

కరీంనగర్ ముఖద్యారమైన లోయర్ మానెర్ డాం రూపురేఖలు మారబోతున్నాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అధ్బుతమైన రివర్ ప్రంట్ గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

కాళేశ్వరం ద్వారా లోయర్ మానేరు అన్ని కాలాల్లోనూ పుష్కలంగా నీటితో నిండటం వల్ల మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుంది. ఇప్పటికే రెవెన్యూ సర్వే పూర్తయింది. ప్రభుత్వ భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. 1.8 కిలోమీటర్ల మేర డిజిటల్ సర్వే పూర్తయింది.  జూలై నెలాఖరుకల్లా ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ తో పాటు డీపీఆర్ ని పూర్తి  చేయబోతున్నారు. ఆగస్టులో రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు ఇతర సివిల్ వర్కులకు టెండర్లు పిలిచి సంవత్సరం లోపల ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ విషయాలను బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్  వెల్లడించారు. ఆయన ఈ రోజు మానేర్ రివర్ ప్రంట్ ప్రాజెక్టు పురోగతిపై మంగళవారం జలసౌదలో టూరిజం, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో పాటు సర్వేసంస్థ ప్రతినిధులతో  సమీక్ష నిర్వహించారు.

బోటింగ్ కు అనుగుణంగా రివర్ ప్రంట్ రూపొందించడంతో పాటు దుబాయ్, ఓర్లాండొ, సింగపూర్ ల మాదిరిగా ప్రపంచ స్థాయి అమ్యూజ్మెంట్ పార్క్, వాటర్ స్పోర్ట్స్, లేజర్ షో, వాటర్ లైటింగ్, ఇతర ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని టూరిజం అధికారులు సమావేశంలో వెల్లడించారు.

మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను 310.464 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవికాకుండా రూ.80 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం, రూ.190 కోట్లతో కేబుల్ బ్రిడ్జీ నిర్మాణ పనులు చివరి ధశల్లో ఉన్నాయి.

మానేరు రివర్ ఫ్రంటు నిర్మాణ పనుల డీపీఆర్ తయారీకి టెండర్ నోటిఫికేషన్ సైతం జారీ అయింది. ఇప్పటికే ఎల్ఎండీ లైటింగ్తో సర్వాంగ సుందరంగా ముస్తాబై వీక్షకులకు కనువిందు చేస్తుంది, మానేరు రివర్ ఫ్రంట్ పూర్తైతే ప్రపంచస్థాయి టూరిస్ట్ కేంద్రంగా కరీంనగరం మారుతుంది.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, కాడ్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్ రావు, శంకర్, టూరిజం కార్పోరేషన్ ఎండి మనోహర్ రావు, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగబూషణం, ఏకాం ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (pressnote)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *