ఆంధ్ర SEC నీలం సాహ్నికి పదవీ గండం?

గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా 2020డిసెంబర్ దాకా పని చేశారు. ఆపైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సలహాదారుగా సేవలందించారు.  ఆమె సేవలకు గుర్తింపు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ కాగానే, పదవిలో  ఆమె నియమించారు. ఏప్రిల్ 1, 2021న ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు.

నీలం సాహ్ని 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ఆమె జూన్ 30,2020 న రిటైర్ కావలసి ఉండింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆమె పదవీ కాలాన్ని డిసెంబర్ దాకా పొడిగించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత  పదవిలో కొనసాగిన వ్యక్తిని ఎన్నికల కమిషన్ చీఫ్ గా నియమించడానికి వీల్లేదని ఒక పిటిషన్ అమరావతి హైకోర్టులో దాఖలయింది. దానికి సంబంధించి  వ్యాజ్యంపై విచారణను హైకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.

సోమవారం విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది డీఎస్ ఎన్వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపించారు.  కేంద్ర రాష్ర   ప్రభుత్వాల్లో పదవులు చేపట్టిన వారు రాజ్యాంగబద్ధమైన ఎస్‌ఈసీ పదవికి అనర్హులని చాలా చెబుతూ సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా వెలువరించిన తీర్పును ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

సుప్రీంకోర్టు 2021, మార్చి 12న ఈ సంచలనాత్మక తీర్పు నిచ్చింది. ఈ తీర్పు వచ్చిన 20 రోజుల తర్వాత ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  రాష్ట్ర ఎన్నికల కమిషన్ చీఫ్ గా నియమించింది. అందువల్ల ఆమె నియామకం  చెల్లదని, ఎస్ఇసి కొనసాగేందుకు ఆమెకు అర్హత లేదని  పిటిషనర్ వాదించారు.

సుప్రీంకోర్టు ఏం చేప్పిందంటే…

రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, ఇలాంటి సంస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఎలాంటి పదవులు ఆలంకరించని స్వతంత్ర వ్యక్తులు (Independent Persons) అధిపతులుగా ఉండాలని కోర్టు  తీర్పు చెప్పింది. గోవా ప్రభుత్వం అడిషనల్ లా సెక్రెటరీకి  ఎస్ ఇసి చీఫ్ గా అదనపు బాధ్యతలు ఇవ్వడాన్ని తప్పు పడుతూ సుప్రీం కోర్టు ఇలా వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఇతర రాష్ట్రాలలో  ఎక్కడైనా ఇలాంటి వ్యక్తులు ఎస్సి చీఫ్ గా ఉంటే వారు వెంటనే ఆ హోదా నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది.

అలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K ప్రకారం స్వతంత్ర వ్యక్తులను ఆ పదవులకు నియమించాలని కూడా ఆదేశించింది.

“If there were any such persons holding the of SEC in any other state, such persons must be asked forthwith to step down from such office and state government concerned be bound to fulfill the constitutional mandate  of Article 243K by appointing only independent persons to this high constitutional office.”

ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని తీర్పు వెలువరించిన ముగ్గురుసభ్యుల ధర్మాసనం చెప్పింది. జస్టిస్ ఫాలి ఎస్ నారిమన్ నేతృత్వంలోని ఈ బెంచ్ లో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ రిషీకేష్ రాయ్ సభ్యులు. 96 పేజీల ఈ చారిత్రాత్మక తీర్పును   జస్టిస్ నారిమనే రాశారు.గోవాలో జరుగుతున్న అర్బన్ లోక ల్ బాడీస్ సందర్భంగా దాఖలైన పిటిషన్ లను పరిశీలించాక ఈ బెంచ్ తీర్పు ఇచ్చింది.   ఈ తీర్పుని సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో కూడా అప్ లోడ్ చేశారు.

తీర్పులో జస్టిస్ నారిమన్ రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు సంబంధించి రాజ్యాంగాంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

“It is also made clear that henceforth, all  State Elections Commissioners appointed under Article 243K in the length and breadth of India have to be independent persons who can not be persons who are occupying a post or office under Central or any State Government,” అని ఆయన తీర్పులో రాశారు.

ఈ రాజ్యంగ నియమాన్ని ఖాతరుచేయకపోవడమనేది చాలా ఆందోళన కలిగించే విషయమని జస్టిస్ నారిమన్ పేర్కొన్నారు.

“The State Election Commissioner has to be a person who is independent of the State Government as he is an important constitutional functionary who is to oversee the entire election process in the state qua panchayats and municipalities,”అని జస్టిస్ నారిమన్ పేర్కొన్నారు.

ఈ కారణాల చేత గోవా రాష్ట్ర ప్రభుత్వం లో పనిచేసే ఉద్యోగికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా అదనపు బాధ్యతలు ఇవ్వడం రాజ్యాంగా అభాసు పాలు చేయడమేనని బెంచ్ తీవ్రంగా వ్యాఖ్యానించింది.

ఇదే కారణాల వల్ల నీలమ్ సాహ్ని నియామకాన్ని పిటిషనర్ ప్రశ్నించారు.

జస్టిస్ నారిమన్ బెంచ్  ఆదేశాలను న్యాయస్థానం ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యల  ధర్మాసనం దీనిని ఆమోదం తెలిపింది.విచారణ ను వాయిదా వేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *