లిక్కర్ రిలీఫ్ ఇస్తుందా? 1918 నాటి స్పానిష్ ఫ్లూకి విస్కీయే దివ్యౌషధం!

విస్కీ వైరస్ చంపుతుందా? వాక్సిన్ తీసుకుంటే మందేసుకోవచ్చా?  కోవిడ్ ఉన్నపుడు మద్యం సేవించవచ్చా అనే ప్రశ్నలు ఈ మధ్య మందు బాబులను బాగా పీడించాయి. తమాషా ఏంటంటే ప్రపంచానికి మనిషిని మహమ్మారి కాటేసినపుడల్తా ఇలాంటి ప్రశ్నలే వచ్చాయి. సరిగ్గా వందేళ్ల కిందట  ఈ ప్రశ్న న్యూయార్క్ నుంచి నాగపూర్ దాకా వినిపించింది. కాబట్టి మందు ‘మందు’గా పనిచేస్తుందా అనేది చాలా చాలా పాత ప్రశ్న.  అప్పిటికీ ఇప్పటికీ ఈ ప్రశ్నకు ఫుల్ స్టాప్ పెట్టేంత జవాబు దొరకలేదు.

సరిగ్గా వందేళ్ల కింద ఇప్పటి కోవిడ్ లాడే  అపుడు స్పానిష్ ఫ్లూ (Spanish Flu) పీడించింది. దేశదేశాల్లో లక్షలమంది పురుగుల్లా రాలిపోయారు. మన మహాత్మగాంధీ కూడా ఈ  ఫ్లూ బాధితుడే.అయితే, గెట్టిక్కాడు, భారత స్వాతంత్య్ర సంగ్రామం నడిపాడు.

*స్పానిష్ ఫ్లూ కి గాంధీ కూడా బాధితుడే…

1918 లో పరిస్థితి వూహించండి. అపుడు వైరస్, బ్యాక్టీరియా గురించి ఇంత విజ్ఞానం లేదు. యాంటిబయోటిక్స్, వ్యాక్సిన్ లు లేవు. తలపుతట్టింది గ్లోబల్ మహమ్మారి. వూర్లకు వూర్లు ఖాళీ అయిపోతున్నాయి.  1919 లో వచ్చిన న్యూస్ పేపర్లను తిరిగేస్తే మందులేని  ప్రపంచంలో మహమ్మారి  ఊచకోత ఎలా ఉంటుందో వూహించవచ్చు.  ఇపుడు గంగా నదిలో కోవిడ్ శవాలు తేలుతున్నట్లు అపుడూ నదుల నిండా శవాలే తేలియాడేవి. ఆరొజు ల్లో కూడా మాస్కులు ధరించారు. లాక్ డౌన్ విధించారు

అమెరికా సియాటిల్ లో 1918లో మాస్క్ ధరించిన న్యూస్ పేపర్ బాయ్ (sourde: Wikimedia Commons)

స్పానిష్ ఫ్లూ గురించి డాక్టర్లకు శాస్త్రవేత్లకు తెలిసిందే తక్కువ కాబట్టి మందు ఉన్నట్లుండి తయారయ్యే అవకాశం లేదు. అందువల్ల కనిపించినదాన్నల్లా ఉత్రంగా మందులాగా వాడేవాళ్లు. బతుకతామనే ఆశతో
ఆస్పిరిన్, స్ట్రైక్నైన్ (ఇదొక విషం. అగాధా క్రిస్టీ, ఐయాన్ ఫ్లెమింగ్ థ్రిల్లర్స్ చదివిన వాళ్లకు స్ట్రైక్నైన్  గురించి తెలిసి ఉంటుంది) ల దగ్గిర నుంచి  హార్లిక్స్, విక్స్ వేపొరబ్ దాకా అన్నింటిని నీళ్లలో కలుపుకుని గుటగుట తాగేవాళ్లు. ఇ

లా జనమంతా మందు లాగా తాగిన వాటిలో విస్కీ కూడా ఉంది. మందులాగా పనిచేయకపోయినా, కొద్దిసేపు రిలీఫ్ ఇస్తూ వచ్చింది. దానికితోడు ఆల్కహాల్ ను జలుబ్బుకు, దగ్గుకు ఎప్పటినుంచో వాడేవాళ్లు,  మెడిసిన్ లో సర్జరీ సమయంలో ఎనెస్థీసియాలాగా వాడుతూ వచ్చారు. అందుకే స్పానిష్ ఫ్లూ సమయంలో విస్కీ తీసుకుని రిలీఫ్ పొందేవాళ్ల సంఖ్య ఎక్కువయింది.

అయితే,అమెరికాలోని చాలా రాష్ట్రాలలో  మద్య పాన నిషేధం అమలులో ఉంది. దీనితో అంతో ఇంతో ఔషధ గుణాలున్న విస్కీ వినియోగం మీద ఉన్ని నిషేధాన్ని ఎత్తేయాలని ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు. కేవలం ఔషధం లాగా నే వాడేందుకు మాత్రమే పర్మిషన్ ఇవ్వండని మొత్తుకున్నారు. దొంగరవాణా అవుతున్న మద్యాన్ని అధికారులు పట్టుకున్నపుడు దానిని మిలిటరీ ఆసుపత్రులలో, సార్వజన వైద్యశాల్లో  ఫ్లూతో బాధపడుతున్న వారికి ఔషధంగా ఇచ్చేవారు.

అపుడు సిరక్యూజ్ (Syracuse) లోని ఒక లిక్కర్ డీలర్ ఇలా చెప్పారు. “స్పానిష్ ఫ్లూ ఎపిడెమిక్ మొదలయినప్పటినుంచి మేం మూడు రెట్లు ఎక్కువగా విస్కీ విక్రయించాం. చాలా మంది ఈస్ట్ కేకులతో, సోడాతో, క్వినైన్ వంటి వాటిని కలుపుకుని విస్కీసేవిస్తున్నారు. విస్కీ తీసుకుకోమని డాక్టర్లే సలహా ఇచ్చినట్లు కొందరు చెబుతున్నారు. విస్కీ సేవించినందున మంచి ఫలితాలు వచ్చాయని తమ మిత్రులు చెప్పినట్లు కొందరు మాకు చెప్పారు. జీవితంలో ఎపుడూ బార్ కొచ్చి ఒక చుక్క మందు సేవించని వాళ్లు, చివరకు ఏ  కషాయంలో కూడా కలుపుకొనని వాళ్లు  కూడా ఎపిడెమిక్ సమయంలో విస్కీ కొన్నారు.”

Oct. 23, 1918, న Syracuse Herald లో లిక్కర్ డీలర్లంతా ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు.

ఇన్ ఫ్లుయంజా వచ్చే దాకా ఆగవద్దు, విస్కీ సేవించడం ప్రారంభించండి కవ్వించే వాణిజ్య ప్రకటనలు న్యూస్ పేపర్ల నిండా వెలువడ్డాయి.

“Wines and Liquors used with medicinal intent will repel the influenza bacillus and is highly recommended from professional as well as individual sources as preventative. Don’t wait for the “Flue” to come to you- guard against this plague in time.” అని ప్రకటనలు ఎక్కడా చూసినా కనిపించేవి.

ఇదే పరిస్థితి భారతదేశంలో కూడా ఎదురయిందని 1919 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చెబుతుంది. ఆ యేడాది ఏప్రిల్ 4న వచ్చిన సంచికలో  విస్కీ ప్రయోజనం  కొరత గురించి రాశారు.

విస్కీ అనేది ఉద్దీపన కలిగించే పదార్థమేకాదు, అది బాగాన్నమనే భావన కలిగిస్తుంది. ఆందోళననుసడలిస్తుంది. ఈ ఇది కచ్చితంగా ఇన్ ఫెక్స్ న్ ను ఎదుర్కొనేందుకు సహకరిస్తుంది అని ఈపత్రిక రాసింది. అందుకే అపుడు ప్రజలు  విస్కీ కోటాలను సడలించాలని కోరారు. అయితే, ఇలా సడలిస్తే కేవలం ఔషధంగానే కాకుండా తాగుడుకు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఈ రిపోర్టు హెచ్చరించింది.

“Whisky is not only a stimulant but a sedative too. It induces a sense of well-being and freedom from anxiety, which is certainly a help resisting infection…The demand for an increased issue of whisky emanates from those who would use sickness and death rate as an additional argument, in favour of a relaxation. If whisky’s sale is permitted, it is certain that much of it will be consumed for other than therapeutic purposes.”

 

విస్కీ ఉత్తేజాన్నిస్తుంది. ఆందోళన ను కొంచెం సేపయినా పొగొడుతుంది. ఆందోళన పోతే, ఇమ్యూనిటీ  పెంచే హ్యాపీ ఎంజైమ్స్ రక్తంలోకి ప్రసరిస్తామని చెబుతున్నారు. అందుకే ఆ రోజు ఇంతటి సైన్స్ తేలీక పోయినా ప్రభావం చూసి విస్కీని వాడాలని ప్రజలు నమ్ముతూ వచ్చారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *