బెంగాల్ కు కేంద్ర మంత్రులొస్తే… కోవిడ్ టెస్ట్ చేయండి: మమత కొత్తరూల్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  రాష్ట్రంలోకి వస్తున్న కేంద్రమంత్రులకు కోవిడ్ టెస్టు చేశాకే అనుమతించాలని కొత్త నియమం పెట్టారు.

కేంద్రం నుంచి  ఇలా కేంద్ర మంత్రులు చీటికిమాటికి రాష్ట్ర పర్యటనకు వచ్చి పశ్చిమ బెంగాల్లో  కోవిడ్ ను వ్యాప్తి చేస్తున్నారని ఆమె విమర్శించారు.

కేంద్ర మంత్రుల వల్లే ప.బెంగాల్ లో కోవిడ్ వ్యాపించిందని ఆమె ఆరోపించారు.

అందువల్ల రాష్ట్రంలో పర్యటనకు వచ్చే మంత్రులకు RT-PCR పరీక్ష చేయాలని, రిపోర్టు నెగటివ్ వస్తేనే వారిని అనుమతించాలని ఆమె ఆదేశించారు. కేంద్ర మంత్రులు ప్రత్యేక విమానాల్లో వచ్చినా ఈ నియమం తప్పని సరి అని ఆమె గురువారం నాడు ప్రకటించారు.

కేంద్రం నుంచి వచ్చే మంత్రులు, కమిటీలు మొదట కోవిడ్ సెంటర్లను తిరిగి పరిస్థితి గమనించాలిగాని,నివేదికల తయారీ పేరుతో వూరూరు తిగిరి కోవిడ్ వ్యాప్తి చేయవద్దని ఆమె చెప్పారు.

“If ministers come, they have to get an RT-PCR negative report, even for special flights. The rule should be the same for all. Covid is increasing because of BJP leaders coming here again and again,” అని ఆమె ప్రకటించినట్లు దక్కెన్ హెరాల్డ్ రాసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *