కృష్ణా జిల్లాకు డోకా లేదు, మస్తుగా అక్సిజన్ బెడ్స్: ఆళ్లనాని భరోసా

కృష్ణా జిల్లా కోవిడ్ రోగులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించేందుకు ఎలాంటి సమస్య లేదని, ఆసుపత్రలలో వారికి ఎలాంటి కొరత ఎదురుకాకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని  వెల్లడించారు.

ఈ రోజు ఆయన అధికారులతో జిల్లా కోవిడ్ స్థితి మీద సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన కృష్ణా జిల్లలో చేసిన కోవిడ్ఏర్పాట్ల మీద సమాచారం అందించారు.జిల్లాలో మంగళవారం నాడు 1138 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తంగా 8578 యాక్టివ్ కేసులున్నాయి.  ఇంతవరకు జిల్లానుంచి కోవిడ్ తో మరణించిన వారిసంఖ్య 795 కు చేరింది.

ఆ వివరాలు:

కృష్ణాజిల్లాలో  77కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశాము.జిల్లా వ్యాప్తంగా 77కోవిడ్ హాస్పిటల్స్ లో 4,730బెడ్స్ అందుబాటులో ఉంచాం.

కరోనా సోకిన 4,221మంది బాధితులకు అన్ని గవర్నమెంట్, ప్రవేట్ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందిస్తున్నాం.

కరోనా బాధితులకు 745 ఐసియూ ఆక్సిజన్ బెడ్స్ సిద్ధం చేశాం.1891 నాన్ ఐసియూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి.

కోవిడ్ హాస్పిటల్స్ లో 1909 బెడ్స్ జనరల్ కేటగిరిలో ఏర్పాటు చేశాము.

కోవిడ్ హాస్పిటల్స్ లో 291 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో

ఐసియూ బెడ్స్ 29, నాన్ ఐసియూ బెడ్స్ 66,జనరల్ బెడ్స్ 196 అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 6 కోవిడ్ కేర్ సెంటర్ (సిసిసి) హాస్పిటల్ లో 3,036బెడ్స్ ఏర్పాటు చేసాం..

ప్రస్తుతం 145  కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 2,895జనరల్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్, రెమిడీసివర్ ఇంజక్షన్స్ అందుబాటులో ఉంచాం.

ఏపిలో కరోనా వైరస్ వెరియంట్  B.1.36(N440K)
ఉనికే లేదు. ప్రజలు అపోహలకు గురి కావద్దు. ఈ రకం వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెo దే ప్రమాదకరమైన వైరస్ గా ఎవరూ నిర్ధారించలేదు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *