దేశంలో వ్యాక్సినేషన్ స్పీడ్ ఎంత తగ్గిందో చూడండి

భారతదేశంలో  ఒక వైపు కరోనాకేసులు పెరుగుతూ, లాక్  డౌన్, నైట్ కర్ఫ్యలు అమలులోకి వస్తుంటే మరొక వైపు  కరోనా వ్యాక్సినేషన్ ఉధృతి తగ్గింది. గత మూడు వారాలుగా దేశంలో పూర్వం అనుకున్నట్లు వ్యాక్సినేషన్ జరగడం లేదు.గత ఏడు రోజుల్లో కేవలం 1.6మిలియన్ డోసుల వ్యాక్సిన్ మాత్రమే  అందించారు. ఇది అంతకు ముందుకంటే 28 శాతం తక్కువ.

నిజానికి  ఆగస్టు 2021 నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలనేది కేంద్రం లక్ష్యం.అయితే,  ఈపుడు సాగుతున్న సప్లై, డెలివరీతో పోలిస్తే, ఈ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. మార్చిలో  3.5 మిలియన్ డోసులతో అట్టహాసంగా మొదలయిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ వారంలో కేవలం 1.6మిలియన్ డోసులకు పడిపోయింది. ఇలా మందగిస్తే,  30 కోట్ల వ్యాక్సిన్ లు ఇవ్వాలన్న లక్ష్యం నేరవేరేందుకు 2022 ఫిబ్రవరి దాకా ఆగాల్సి ఉంటుంది. అప్పటికి పూర్తయ్యేది కూడా దేశం జనాభాలో  20 శాతం మాత్రమే.

తొలి వ్యాక్సినేషన్ మొదలయినప్పటినుంచి  మే నెల 4 దాకా భారతదేశంలో 158.9 డోసులు వ్యాక్సిన్ మాత్రమే పంపిణీ చేశారు.

కరోనా వైరస్  వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో చాలా రాష్ట్రాలు పూర్తిగానో, పాక్షికంగా లాక్ డౌన్ విధించాయి. కనీసం రాత్రిపూట కర్ఫ్యూ విధించాయి.

నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ 18 గంటల కర్ఫ్యూ అమలులోకి వచ్చింది.ఇది మధ్యాహ్నం 12గంటలకు మొదలవుతుంది.  మరుసటి ఉదయం  6 దాకా అమలులో ఉంటుంది. ఇలాగే కేరళ ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది.

దక్షిణ భారతదేశంలో ఇలా కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రం కర్నాటక తర్వాత కేరళయే.  కర్నాటక ప్రభుత్వం ఏప్రిల్ 27నే సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. ఈ నెల 12 ఇది ముగుస్తుంది. అయితే, మే నెలాఖరుదాకా పొడిగించవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ అసవరం లేదని, దాని వల్ల ప్రయోజనం లేదన వాది్స్తున్నది. ఇలావాదించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. కోర్టులు, శాస్త్రవేత్తలు లాక్ డౌన్  ఈ నేపథ్యంలో దేశంలో నేరుగా లాక్ డౌన్ లాక్ డౌన్ వంటి ఆంక్షలు విధించిన రాష్ట్రాల వివరాలు:

  1. ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్ డౌన్ లో  ఉంది. ఇది మే 10 తేదీ దాకా ఉంటుంది.
  2. బీహార్ : బీహార్ లో కూడా లాక్ డౌన్ విధించారు. ఇక్కడ మే 15 దాకా కొనసాగుతుంది.
  3. ఉత్తర ప్రదేశ్ : యూపి ఈ రోజు దాకా లాక్ డౌన్ కొనసాగింది. మళ్లీ పొడిగించే అవకాశం ఉంది.
  4. ఒదిషా లో నిన్నటి నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ఇది మే `19 దాకా అమలులో ఉంటుంది.
  5. హర్యానాలో ఏడు రోజుల లాక్ డౌన్ కొనసాగుతూ ఉంది. మే 3న ఇది మొదలయింది. అంతకు ముందు 9 జిల్లాలలో వారాంతపు కర్ఫ్యూ అమలులో ఉండింది.
  6. రాజస్థాన్ లో  మే 17 దాకా లాక్ డౌన్ అమలు ఉంది.
  7. చత్తీష్ గడ్ లో మే 15 దాకా లాక్ పొడిగించే అవకాశం ఉంది.
  8. పంజాబ్ వారాంతపు కర్ఫ్యూలు, నైట్ కర్ఫ్యలు కొనసాగుతున్నాయి. మే 15 దాకా ఈ ఆంక్షలుంటాయి.
  9. మధ్య ప్రదేశ్ కరోనా కర్ఫ్యూ  విధించింది. ఇది మే 7 ముగుస్తుంది. దీనిని పొడిగించే అవకాశం ఉంది
  10. గుజరాత్ ప్రభుత్వం 29 నగరాలలోనైట్ కర్ఫ్యూ విధించింది. ఇతర ప్రాంతాలలో ప్రజలు ఏవిధంగా గుమికూడకుండా ఆంక్షలు విధించింది.
  11. మహారాష్ట్రలో ఏప్రిల్ 5 నుంచి లాక్ డౌన్ వంటి ఆంక్షలుకొనసాగుతున్నాయి. ఇపుడ వీటిని మే 15 దాకా పొడిగించారు.
  12. గోవా లో లాక్ డౌన్ ఉండింది.సోమవారంనాడు సడలించారు. అయితే, కోవిడ్ ఆంక్షలు మే10 దాకా కొనసాగుతాయి.
  13. తమిళనాడులో కోవిడ్ ఆంక్షలు మే 20 దాకా కొనసాగుతాయి
  14. పుదుచ్చేరిలో మే 10 దాకా లాక్ డౌప్ ఉంటుంది.
  15. తెలంగాణలో మే 8 దాకా నైట్ కర్ఫ్యూ ఉంటుంది.
  16. ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి పాక్షిక కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు దాకా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఇది రెండువారాలు అమలులో ఉంటుంది.
  17. పశ్చిమబెంగాల్ లాక్ డౌన్ లేదు. అయితే, ప్రజలు గుమి కూడడం మీద ఆంక్షలున్నాయి.
  18. అస్సాం సాయంకాలం 6 నుంచి మరుసటి ఉదయం 8గంటలదాకా నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఏప్రిల్ 27 న ఇది మొదలయింది. మే 7 దాకా ఉంటుంది.
  19. నాగాలాండ్ లో రాజధాని ఐజ్వాలో తో పాటు ఇతర జిల్లా కేంద్రాలలో మే 3 నుంచి ఎనిమిది రోజుల లాక్ డౌన్ ప్రకటించారు.
  20. జమ్ముకాశ్మీర్ లో శ్రీనగర్, బారాముల్లా, బుద్దామ, జమ్ము జిల్లలో ఈ రోజు దాకా లాక్ డౌన్ ఉంది. ఇతర మునిసిపల్ ప్రాంతాలలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతూ ఉంది.
  21. ఉత్తరాఖండ్ లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతూ ఉంది.
  22. హిమాచల్ ప్రదేశల్ రేపటినుంచి మే 16 దాకా పదిరోజుల లాక్ డౌన్ విధించారు.
  23. సిక్కింలో కూడా పదిరోజుల లాక్ డౌన్ కొనసాగుతూ ఉంది. ఇది మే 16 దాకా ఉంటుంది. ఇది ఈరోజునేం అమలులోకి వచ్చింది.
  24. కర్నాటకలో   ఏప్రిల్ 27 నుంచి మే 12 దాకా పూర్తి లాక్ డౌన్ విధించారు.  మే 12 నుంచి మరొక రెండు వారాలు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *