AP లో ’ఆరోగ్యశ్రీ‘ పేషెంట్స్ ను చులకనగా చూస్తే లైసెన్స్ రద్దు:

ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఉన్న పేషెంట్స్ పట్ల చులకన భావం ప్రదర్శించినా, వారిని నిరుత్సాహ పరచినా, వారికి అందించే ట్రీట్మెంట్ లో వ్యత్యాసం చూపినా కటిన చర్యలు తీసుకుంటామని జాషువా, గుంటూరు జిల్లా.ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి హెచ్చరించారు.

అలాంటి ఆసుపత్రుల లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకోవడమే కాక సంబంధిత వైద్య సిబ్బందిపై క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటాని కూడా ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే…

5-5-21 న  పిడుగురాళ్ల పట్టణం లోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులు పై విజిలెన్స్ రైడ్లు నిర్వహించడం జరిగింది. “పల్నాడు ఆసుపత్రిలో ” ఒక కోవిడ్ రోగి 6 రోజుల ట్రీట్మెంట్ కు 3.15 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయిన నేపథ్యం లో సదరు ఆసుపత్రి యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.
2200 రూపాయిలు ఏం. ఆర్. పీ కి సప్లై చేయబడిన రెండేస్ వేర్ వయల్ ను రు.10,000 కు రోగులకు పంపిణీ చేయడం రుజువు అయినది.
ప్రైవేట్ ఆసుపత్రులు రెండేస్వేర్ ఇంజెక్షన్లు అధికారుల ద్వారా ఎం. ఆర్. పీ కి పొంది వాటిని అధిక ధరలకు బ్లాక్ మార్కెటింగ్ చేయటం, పేషంట్స్ కు పది నుంచి నలబై వేల రూపాయిలకు అమ్మడం జరుగుతున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతున్న నేపథ్యం లో ప్రైవేట్ ఆసుపత్రుల రెండేస్వెర్ డిమాండ్ మరియు వినియోగాన్ని స్క్రూటినీ చేస్తాం.
పిడుగురాళ్ల పట్టణం లో అంజిరెడ్డి ఆసుపత్రిలో ఒక పేషంట్ వద్ద నాన్ క్రిటికల్ ట్రీట్మెంట్ కు 1.5 లక్షల రూపాయలు వసూలు చేసిన ఫిర్యాదుపై తనిఖీ నిర్వహించి అరోపణలు రుజువు అయినందున ఆసుపత్రి యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేయడం జరిగింది.

ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ ట్రీట్మెంట్ కు నిర్దేశించిన చార్జీల వివరాలు జీ. ఓ. 77 ద్వారా స్పష్టంగా నిర్దేశింబడినవి. అధిక ఛార్జీలు వసూలు చేసే ఆసుపత్రులను వదిలే ప్రసక్తే లేదు.

జారీ చేసిన వారు,
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *