‘మనం సాధించుకున్నది అవినీతి తెలంగాణయా?’

(వడ్డేపల్లి మల్లేశము)

“మనుషులుగా చూడు మన్నాము
కానీ మంత్రులు గా చూడమనలేదు.”

ఇటీవల భూకబ్జా ఆరోపణలపై ప్రభుత్వ విచారణ ద్వారా మంత్రి పదవి కోల్పోయిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారి మాటలను ప్రస్తావించినప్పుడు రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన ప్రజలకు ప్రజాప్రతినిధులకు గల గౌరవము ఏపాటిదో అర్థం అవుతున్నది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి 1969 నుండి వివిధ దశలలో కొనసాగిన టువంటి తెలంగాణ ఉద్యమం యొక్క ప్రధాన ఆకాంక్ష స్వావలంబన దిశగా తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల తో పాటు ప్రధానంగా ఆత్మగౌరవాన్ని కూడా మనం గొప్పగా చెప్పుకోవడం జరిగింది.

తొలి మలి దశ ఉద్యమాలలో వేలాది మంది ఉద్యమకారులు విద్యార్థులు అమరులై 2014లో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత కొనసాగుతున్న టువంటి పాలనలో ప్రజల ఆకాంక్షలను తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలను సాధించామ అని ఒకసారి వెనుతిరిగి చూస్తే పాలన ఎవరి చేతిలో ఉంది అవినీతి ఏ స్థాయిలో ఉంది ప్రజా సంపద ఏరకంగా దుర్వినియోగం అవుతున్నదో ఇటీవల వరుసగా అవినీతి ఆరోపణలను ప్రస్తావించిన సందర్భాలను బట్టి తెలుసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారుల స్థాయిలో నే కోట్ల రూపాయలను లంచాలు గా తీసుకున్నటువంటి ప్రకటనలను ఇటీవలి కాలంలో మనం చూశాం. ప్రధానంగా రాజకీయ అవినీతిని అంతం చేయకుండా ఉద్యోగ వర్గము లోపల అవినీతిని అంతం చేయలేమని విషయాన్ని ప్రస్తావిస్తే దానికి బాధ్యులైన ప్రభుత్వ సారథులు మంత్రులు శాసనసభ్యులు రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరూ కూడా తమ నిజాయితీని రుజువు చేసుకోవలసిన అవసరం వచ్చిందని ఈ సందర్భంగా ప్రజానీకం పెద్దఎత్తున కోరుతున్నారు.
గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణల పైన కబ్జా పైన మంత్రి పదవి కోల్పోయిన టువంటి మాజీ ఆరోగ్య మంత్రి విధానాన్ని వారి పైన జరిగినటువంటి విచారణ సంబంధించినటువంటి హైకోర్టులో జరుగుతుందని న్యాయ విచారణను మనం సూక్ష్మంగా పరిశీలిస్తే అనేక అంశాలు ఆ విచారణలో వ్యక్తం అయినట్లుగా తెలుస్తున్నది.

ఎలాంటి నోటీసులు అందించకుండా సమయం తీసుకోకుండా ముందస్తు సమాచారం లేకుండా ఇతరుల ఆస్తుల పైన విచారణ జరపడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా కాదని అంత తొందరగా నివేదిక తెప్పించుకుని విచారణ జరపాల్సిన ఇటువంటి అవసరం ఏమొచ్చిందని హైకోర్టు వ్యాఖ్యానించడాన్ని మనం గమనించాలి. అదే సందర్భంలో హైకోర్టు రాష్ట్రంలో ఇటీవలి కాలంలో అనేక మంది పైన అవినీతి ఆరోపణలు పత్రికల్లో పతాక శీర్షికలో వచ్చినప్పటికీ ఆయా ప్రాంతాల కలెక్టర్ స్వయంగా స్థానిక శాసనసభ్యులు నాయకుల పైన అవినీతి ఆరోపణలను నివేదిక రూపంలో ఇచ్చినప్పటికీ ఎందుకు విచారణ జరిపించాలి లేదని ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని హైకోర్టు ప్రశ్నించే విషయాన్ని మనమందరం కూడా ఆలోచించాలి.

హైకోర్టును యొక్క సూచనలు వ్యాఖ్యలను రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు శాసన సభ్యులు మంత్రులు భాగస్వాములు అందరూ కూడా చిత్తశుద్ధిగా విచారణకు సిద్ధమని ప్రకటించాల్సిన అవసరం ఉన్నట్లుగా తెలుస్తున్నది

ఈ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి గారు ప్రకటన చేస్తూ తన ఆస్తిపాస్తులూ కబ్జాకు సంబంధించినటువంటి ఆరోపణల పైన ప్రస్తుత గౌరవ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని మిగతా ఆరోపించబడిన వారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా సవాలుగా తీసుకో వలసిన సందర్భం వచ్చిందని అప్పుడు మాత్రమే తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్నదని ప్రజలకు రుజువు చేసే అవకాశం ఉంటుందని భావించవచ్చు.

కాలేశ్వరం వంటి కొన్ని ప్రాజెక్టులు నిర్మాణం జరిగినప్పటికీ ఉద్యోగాల నియామకం లోపల రాష్ట్రం లోపల సరైన విధానము కొనసాగడంతో అనేక మంది నిరుద్యోగులు యువతీ విద్యావంతులు ఆత్మహత్యలు ఇటీవలి కాలంలో చేస్తున్న సందర్భాలను మనం గమనించవచ్చు.
కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క ఉద్యోగ విరమణ వయస్సును అదనంగా మూడు సంవత్సరాలు పెంచడం ద్వారా ప్రస్తుత యువతకు ప్రభుత్వం నష్టం చేసిన దని యువత వా పోతున్నది.
ఇక రైతుబంధు వంటి అంశాలలో కోట్ల రూపాయలను ఉన్నత వర్గాలకే, వందలాది ఎకరాలు ఉన్నవారికి కట్టబెట్టడం ద్వారా ప్రయోజనం నెరవేరక పోగా అసమానతలు మరింత పెరిగి ఆర్థిక భారం పెరిగిపోవడంతో మూడు లక్షల కోట్లకు అప్పు పెరిగిన విషయాన్ని కూడా గమనించవచ్చు.
ఇక చివరి లక్ష్యమైనటు వంటి ఆత్మగౌరవం విషయంలో చెప్పదలచుకుంటే
శాసనసభ్యులు గౌరవ మంత్రివర్గ సహచరులకు అపాయింట్మెంట్ దొరకదని చెబుతుంటే ఇక సామాన్య ప్రజానీకం తన గోడు వెళ్లబోసుకున్న డానికి ఆస్కారం ఎక్కడిదని సర్వత్రా ప్రశ్నలు వినబడుతున్నవి.

అనేక చోట్ల పని పరిస్థితుల్లో నాసిరకం వలన వాటర్ ట్యాంకులు కొండపోచమ్మ సాగర్ కాలువ గండి పడటంతో పాటు అనేక నిర్మాణాలు కూడా నాణ్యత లేని విషయాన్ని మనం గమనించవచ్చు.

మంత్రి వర్గంలో ఉన్నటువంటి మంత్రుల పైన పూర్తి అజమాయిషీ తో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క విశ్వాసం ఉన్నంత వరకే మంత్రులుగా కొనసాగే అవకాశం రాజ్యాంగబద్ధంగా ఉంటుంది కానీ ప్రస్తుత కరోనా సమయం లోపల రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో గౌరవ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తగు చర్యలు తీసుకోలేదని విమర్శిస్తూ ఉంటే ఆరోగ్యశాఖకు మంచి లేకుండా ఉండటం కూడా ఒక రకమైనటువంటి సంకటమే కదా!

ఈ రాష్ట్ర సంపద ఎవరి సొంతం కాదు కేక మంది శాసనసభ్యులు మంత్రులకు సంబంధించి అధికారానికి వచ్చిన తరువాత వారి సంపద వేల కోట్లు పెరిగిందని విమర్శలు సర్వత్రా వినపడుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి గారి పైన ఏవిధంగా విచారణకు ఆదేశించారు అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అటువంటి వారు ఎంతటి వారైనా తగు విచారణ జరిపించి గాయానికి మించిన ఆస్తులను విచారణలో తేల్చి ప్రజల పరం చేయవలసిన ఎటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.

అవినీతికి ఎంతటి వారు పాల్పడిన నేరమే ఎవరైనా ఏ వర్గమైనా సమానమే కానీ జాన్ స్వామ్య బద్ధంగా పూర్తిస్థాయిలో విచారణ జరిపించడం ద్వారా నేరారోపణలు ఎదుర్కొంటున్న అందరి పట్ల ఒకే వైఖరిని ప్రభుత్వం అవలంబించవలసిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉన్నది.

మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి యొక్క విచారణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలో ప్రజలు పార్టీ కార్యకర్తలు ప్రాయం వ్యక్తం చేస్తున్న విషయాలను నాయకత్వం దృష్టిలో ఉంచుకొని అక్రమాలకు పాల్పడిన వారిని కచ్చితంగా శిక్షించాలి. అటువంటి అవసరం ఉన్నదని, అందరి పట్ల ఒకే రకమైన వైఖరిని అవలంబించాలని ప్రజానీకం కోరుతున్నది.

పెన్షన్లు, లోన్లు ,చిన్నచిన్న ప్రలోభాలకు తమను గురిచేసి సభ్యులు మంత్రులు మాత్రం కోటాను కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని సామాన్య ప్రజానీకం ఆలోచిస్తూ ప్రశ్నిస్తున్న వేళ తమ చిత్తశుద్ధిని చాటుకో వలసిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడి పైన ఉన్నది.

అట్టడుగు వర్గాలు వెనుకబడిన తరగతులకు చెందిన అటువంటి వారి పట్ల అవినీతి ఆరోపణలు ప్రస్తావించడం లో కాని విచారణలో కానీ వివక్షత ఉండకూడదన్నది నేడు ప్రజలు ప్రభుత్వం ఉంచిన కీలకమైన సమస్య .
ప్రభుత్వం లోనూ రాజ్యాధికారం లోనూ చట్టసభల లోపల కూడా అట్టడుగు వెనుకబడిన తరగతుల వర్గాలవారు నామమాత్రంగా కొనసాగుతున్న వేల వారి పట్ల కొనసాగుతున్న విచారణలో వివక్షతను మాత్రమే సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తుంది.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు ఆకాంక్షను నెరవేర్చాలని అంటే ఈ అవినీతి ఊబిలో నుండి బయటపడడానికి తమ వంతు బాధ్యతగా చిత్తశుద్ధిగా తమ నేరారోపణలు నిజం కాదని రుజువు చేసుకోవలసిన అవసరం ముందుగా ప్రతి శాసనసభ్యులు మంత్రుల పైన ఉన్నది.

వడ్డేపల్లి మల్లేశము

( ఈ వ్యాసకర్త కవి రచయిత సామాజిక రాజకీయ విశ్లేషకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *