ఆంధ్రలో రెండో రోజు 20 వేలు దాటిన కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 1,16,367 కోవిడ్ పరీక్షలుచేయగా 22,204 పాజిటివ్ కేసులు కనిపించాయి. ఇది 19.08 శాతం పాజిటివిటి. ఇలా 20వేలకు పైగా కేసులు కనిపించడం వరుసగా రెండో రోజు.  నిన్న రాష్ట్రంలో మొత్తం   85 మంది (0.38 శాతం ) చనిపోయారు. ఈ వివరాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ వెల్లడించారు.

నిన్న తూర్పుగోదావరి జిల్లా అత్యధిక కేసులు 2344 కేసులు కనిపించాయి. అత్యధికంగా కేసులు కనిపించిన జిల్లాలు: అనంతపురం (2304),విశాఖపట్టణం (2113), కర్నూలు 1985, శ్రీకాకుళం (1982).

ఆయన ఇంకా ఏమిచెప్పారంటే..

ఏపీ లో 11,556 వేల రేమిడేసివర్ ఇంజక్షన్లు ప్రవేట్ హాస్పిటల్స్ అందుబాటులో ఉంచాము. 18,037 ఇంజక్షన్లు ప్రభుత్వ హాస్పిటల్స్ లో    అందుబాటులో ఉన్నాయి. మరో 12 వేలు కూడా అందుబాటులోకి తెస్తున్నాం.

ప్రవేట్ హాస్పిటల్స్ కు సప్లై చేశాం. 17,196 కాల్స్ 104 కాల్ సెంటర్ కు వచ్చాయి. 387  టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశాం, నెల్లూరు జిల్లాలో ప్రవేట్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు 12 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ పంపించాము. ఆక్సిజన్ లోపం లేకుండా చర్యలు తీసుకున్నాం.

3,220 మంది డాక్టర్లు 104 కాల్ సెంటర్ కు టెలికన్సల్టెంట్స్ గా పనిచేసేందుకు ముందుకు వచ్చారు.

ఈ రోజు మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమలులోకి తీసుకు వచ్చాము.మొదటి రోజు కర్ఫ్యూ పై ప్రజలకు అవగాహన కల్పించాం.  లాక్ డౌన్ కాకుండా కర్ఫ్యూ తీసుకు వచ్చాము. హాస్పిటల్స్ కు వెళ్లే రోగులకు, ఆరోగ్య శ్రీ రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు, జిల్లా కలెక్టర్లు నుంచి నివేదిక కోరాం.

రేపు కోవిడ్ పై సీఎం సమీక్ష చేయనున్నారు, ఆయన దృష్టికి తీసుకు వస్తున్నాం. కేంద్రం ఏపీ కి 4800 రేమిడేసివర్ వయల్స్ కేటాయించింది. 2107 ఆక్సిజన్ కన్సట్రే టర్స్ కేటాయించారు. 1.92 రాపిడ్ కిట్స్ కూడా కేంద్రము కేటాయించింది.

బ్యాంక్ సిబ్బంది, ప్రజా రవాణా, సివిల్ సప్లై స్టాఫ్  కి మొదటగా ఇచ్చేందుకు కోవిషీల్డ్ 6-8 వారాలు కేటాయించారు. వస్తున్న ప్రతి వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చాము.

9 లక్షలు డోసుల మే నెల కోట విడుదలవుతుంది. 13 లక్షలు డోసెస్ కేంద్రం నుంచి కొనుగోలు చేస్తున్నాం. 19 లక్షలు మందికి సెకండ్ డోస్ కోసం అందిస్తాం. సెకండ్ డోస్ కోసం ప్రజలు ఆందోళన పడొద్దు. అందరికి ఇస్తాం. ప్రజలు అందరికీ సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాతనే మిగిలిన వారికి మొదటి డోస్ కు వెళ్తాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *