అణ్ణా క్యాంటీన్లుగా మారుతున్న తమిళనాడు అమ్మ క్యాంటీన్లు

తమిళనాడు నాటి ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన ‘అమ్మ క్యాంటీ’న్ల పేరును డిఎంకె  అణ్నా క్యాంటీన్లుగా మార్చాలనుకుంటున్నది. ఎంకె స్టాలిన్ ముఖ్యమంత్రిగా శుక్రవారం  నాడు డిఎంకె ప్రభుత్వం ఏర్పాటవుతున్నది.

రాష్ట్రంలో పేదలకు పౌష్టికాహారం అందించేందుకు  2013లో జయలలిత ‘అమ్మ క్యాంటీన్ల’ను ప్రారంభించింది.  ఇందులో ప్లేటు ఇడ్లీ ఒక రుపాయ, భోజనం అన్నం అప్పు రు.3, చపాతీ పప్పు రు.3 లకు దొరుకుతుంది. క్వాలిటీ పరంగా ఇవి బాగా విజయవంతమయ్యాయి.నిజానికి ఆంధ్ర,తెలంగాణలో  నడస్తున్న క్యాంటీన్లకు స్ఫూర్తి ఇవే. తెలుగు రాష్ట్రాల అధికారులు తమిళనాడు అమ్మ క్యాంటీన్లను సందర్శించి, వాటిని ఎలా నడుపుతున్నారో  పరిశీలించారు. రాజధాని చెన్నైలో మొత్తంగా 407 క్యాంటీన్లున్నాయి.వాటిని చెన్నైమునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తూ ఉంది.

ఇపుడు డిఎంకె  ఈక్యాంటీన్లకు ఒక నాటి ముఖ్యమంత్రి సిఎన్ అణ్నాదురై (సెప్టెంబర్ 15,1909- 3 ఫిబ్రవరి 1969) స్మారకార్థం ‘అణ్ణా క్యాంటీన్ ’ అని నామకరణం చేయాలనుకుంటున్నది. అంతేకాదు, రాష్ట్రంలోని అన్ని మెట్రో నగరాలలో మరొక 500 క్యాంటీన్లను ప్రారంభించాలని కూడా భావిస్తున్నది.ఎన్నికల క్యాంపెయిన్ కళైణార్ కరుణానిధి పేరు తో 500 క్యాంటీన్లను ప్రారంభిస్తామని డిఎంకె హామీ ఇచ్చింది.

ఎన్నికలకోడ్ కారణంగా ఈ క్యాంటీన్ల పేరు మీద అమ్మ అనే అక్షరాలు కనిపించకండా టేప్ అతికించారు. అయితే,  నగరంలోని ఒక క్యాంటీన్ వద్ద ఇద్దరు డిఎంకె కార్యకర్తలు జయలలిత బొమ్మ తీసేయడంతో ఎఐడిఎంకె, డిఎంకె కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.గొడవ రాజకీయం కాకుండా ఉండేందుకు డఎంకె వెంటనే ఇద్దరు కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేసు పెట్టింది. ఇలాంటి గొడవలుజరుకుండా కార్యకర్తలను శాంతింప  చేసేందుకు క్యాంటీన్లు పేరు అణ్ణాదురై క్యాంటీన్ల మారిస్తే ఎవరికీ సమస్య ఉండని కొందరంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *