భారత్ లో వెంటనే లాక్ డౌన్ అవసరం : అమెరికా సూచన

భారత దేశంలో సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించకపోవడంతో తక్షణం కొన్ని వారాలు లాక్ డౌన్ విధించడమే మార్గమని అమెరిక కోవిడ్ నిపుణుడు, అధ్యక్షభవనం సలహాదారు అంధోని ఫాసి సలహా ఇచ్చారు.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ (Indian Express) కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే తగినంత ఆక్సిజన్, మందులు, వ్యక్తిగత భద్రత సాధనాలు (పిపిఇ) అర్జంటు సమకూర్చుకోవడం కూడా అవసరమని ఆయన చోప్పారు.

భారత దేశంలో ‘కరోనా మీద విజయం’  సాధించినట్లు తొందరపడి ప్రకటించారని (Victory was declared maybe too prematurely) కూడా ఆయన చెప్పారు.

ఇపుడు మీరు ఎంతవరకు వెళ్లగలరో అంతవరకు దేశంలో లాక్ డౌన్ పెట్టక తప్పదు.ఇదేచాలాముఖ్యమనినేను భావిస్తున్నాను.ఇదే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తక్షణ చర్య, మధ్యకాలిక చర్య, దీర్ఘకాలిక చర్య కూడా.

“ I think the most important thing in the immediate is to get oxygen, get supplies, get medication, get PPE, that kind of things but also, one of the immediate things to do is to essentially call a shutdown of the country,” ఫాసి చెప్పారు.

అంధోని ఫాసి అమెరికా అధ్యక్షుడ బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్. దేశంలో ఆగ్రశ్రేణి వైరస్ వ్యాధుల నిపుణుడు కూడా.

లాక్ డౌన్ ఆరు నెలలు ఉండాల్సిన పనిలేదు. ఇది కరోనా వైరస్ జీవితచక్రాన్ని తెంచేందుకు తాత్కాలికంగా  ఈ చర్య తీసుకోవచ్చు అని డాక్టర ఫాసి చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *